Guppedanta Manasu Serial Today March 18th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మనుని కాలేజ్ నుంచి వెళ్లగొట్టిన అనుపమ – కొత్తజంట అంటూ కాలేజీలో మను, వసుల ఫోటోలు
Guppedanta Manasu Today Episode: మనుని అనుపమ కాలేజీ నుంచి వెళ్లిపోమ్మని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: వసుధార మహేంద్ర, అనుపమకు కాఫీ ఇస్తుంది. అనుపమ కాఫీ తాగకుండా అలాగే ఉండిపోతుంది. అది చూసిన మహేంద్ర.. అనుపమను ఏమైందని అడుగుతాడు. తర్వాత మను బర్త్ డే ఎప్పుడో తెలుసుకోవాలని అతన్ని అడిగితే చెప్పట్లేదు. కాబట్టి మనమే తెలుసుకోవాలి అంటాడు మహేంద్ర. అనుపమ చెప్పు.. నాకు లిస్ట్ రెడీ చేసి ఇస్తావుగా అని మహేంద్ర అడిగితే.. నాకు కాలేజీలో వర్క్ ఉందని కంగారుగా వెళ్లిపోతుంది అనుపమ.
మహేంద్ర: మను మనకు చాలా చేస్తున్నాడు. రిషి వెళ్లాకా నేను నమ్మకం కోల్పోయాను. కానీ, మను వచ్చాకా చాలా ధైర్యం వచ్చింది. ఆ శైలేంద్ర ప్లాన్స్ తిప్పి కొడుతున్నాడు. నీ సంతోషం కోసం బర్త్ డే చేశాడు. రిషి నీ పక్కనే ఉన్నట్లు చేశాడు.
వసుధార: అవును మామయ్య.. అయినవాళ్లే ఆపదలు పెడుతుంటే ఎక్కడి నుంచో వచ్చి మనకు అండగా ఉన్నారు. శైలేంద్రే కాదు. రాజీవ్ విషయంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. మనును చూసే రాజీవ్ కూడా వెనుకడుగు వేస్తున్నాడు.
అని వసుధార అక్కడినుంచి వెళ్లిపోతుంది. తర్వాత జగతి ఫొటో దగ్గరకు వెళ్లి జరిగిన విషయాలన్ని చెప్పుకున్న మహేంద్ర.. మను గురించి గొప్పగా చెబుతాడు. మన రిషి లాగే మా బాగోగులు చూసుకుంటున్నాడు. అతనికి ఏదో ఒకటి చేయాలని ఉంది అని మహేంద్ర అనుకుంటాడు. తర్వాత రిషి ఫొటో చూస్తూ తనకోసం చేయించిన కంకణం తీస్తాడు. మన కుటుంబానికి అండగా ఉన్న మనుకి ఈ కంకణం ఇస్తాను అనుకుంటాడు. మరోవైపు మనుతో ఎలాగైనా మాట్లాడాలి. వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. అని అనుపమ మను ఛాంబర్‌కు వెళ్లి చూస్తుంది. మను అక్కడ లేకపోవడంతో బయటకు వస్తున్న అనుపమకు రాజీవ్ చేసిన పోస్టర్స్ కనిపిస్తాయి. కొత్త ప్రేమ జంట అని వసు, మను ఫోటోలు ఉన్న పోస్టర్ చూసి షాక్ అవుతుంది అనుపమ. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో అక్కడి వచ్చిన వసుధార కూడా పోస్టర్ చూసి షాక్ అవుతుంది.
వసుధార: ఏంటిది మేడమ్.. ఈ పోస్టర్ ఏంటి?
అనుపమ: అమ్మా వసుధార నువ్ ఏం కంగారుపడకు
ఇంతలో మను వస్తాడు. వాళ్ల చేతిలో ఉన్న పోస్టర్ చూసి మను కూడా షాక్ అవుతాడు.
అనుపమ: రేయ్.. ఏంట్రా ఇది నీకు అసలు బుద్ధి లేదా. నీకు ఏది అనిపిస్తే అది చేస్తావా? అసలు నిన్ను మనిషి అంటార్రా. వసుధార గురించి తెలిసి కూడా ఇలా చేస్తావ్.
మను: మేడమ్ మీరు పొరపడుతున్నారు. కనిపించేది అంతా నిజం కాదు
అనుపమ: ఛీ.. ఆపు.. వసుధార కాలేజీ కోసం కష్టపడుతుంది. రిషి కోసం వెతుకుతోంది. ఇంత కష్టపడుతున్న వసుధారను ఇంకా బాధపెట్టాలనుకుంటున్నావా?
దూరం నుంచి చూస్తున్న శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు.
మను: మేడమ్.. మీకు నేనేంటో తెలుసు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. నేను ఇది చేశాను అంటే నమ్ముతున్నారా?
అనుపమ: ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా నువ్ ఉండకు. ఈ కాలేజీ విడిచిపెట్టి దూరంగా వెళ్లిపో. మళ్లీ మా జీవితాల్లోకి రాకు
మను: మేడమ్ అంతా మాట అనకండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. నిజా నిజాలు తెలుస్తాయి
అనుపమ: వెళ్లమని చెప్పానా.. వెళ్లు.. వెళ్తావా లేదా.. వెళ్లకుంటే నా శవాన్ని చూస్తావ్
అని అనుపమ అనడంతో వసు షాక్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకున్న మను.. మీరు అలా అపశకునంగా మాట్లాడకండి. మీరు అంతా బాగుండాలి. నేను వెళ్తాను. కేవలం మీకోసం వెళ్తున్నాను. నేను తప్పు చేయకున్నా తలదించుకుని వెళ్తున్నాను. కానీ, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి అని మను అంటాడు. అది విన్న శైలేంద్ర ఫుల్ హ్యాపీగా ఫీలవుతాడు. మేడం మీరైనా నమ్ముతారా నన్ను అని వసుధారను అడుగుతే వసుధార కూడా ఇక ఎలాంటి క్లారిటీ అవసరం లేదండి. మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: డీజే టిల్లుకి రాధిక కంటే లిల్లీనే గట్టి షాకే ఇచ్చేలా ఉందిగా.. అనుపమ లుక్ అలాగే ఉంది మరి