Guppedanta Manasu Serial Today June 21st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: తాను రిషిని కాదన్న రంగ - అనుపమ, మహేంద్ర మధ్య రిలేషన్ ఏంటని ప్రశ్నించిన దేవయాని
Guppedanta Manasu Today Episode: నిద్రపోతున్న వసుధారను నిద్రలేపి తాను రిషినేనని అనివార్య కారణాల వల్ల ఇలా ఉండాల్సి వచ్చిందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: సరోజ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఇంటి వెనక కూర్చుని ఉంటుంది వసుధార. ఇంతలో రంగ అన్నం తీసుకుని వస్తాడు. నువ్వు నా వెనకాల ఉన్నట్టు నాకు తెలుసు రండి అని వసుధార చెప్పగానే ఎలా కనిపెట్టారు అని అడుగుతాడు రంగ. నువ్వు రిషి సార్ నా ప్రాణం అందుకే తెలుస్తుంది అనగానే రంగ దగ్గరకు వచ్చి ‘‘నేను రిషి సార్ కాదు. నేను రంగ’’ అంటూ.. ‘‘మీరు నన్ను రిషి సార్ అంటుంటే మా నాన్నమ్మ కంగారుపడుతుంది. సరే మీరు ఏమైనా అనుకోండి అవన్నీ తర్వాత ముందు అన్నం తినండి’’ అంటాడు రంగ. ‘‘నాకైతే తినాలని లేదు నువ్వు తినిపిస్తే తింటా’’ అంటుంది వసుధార. అయితే రంగ నాలుగు మాటలు చెప్పి వసుధార అన్నం తినేలా చేస్తాడు. మరోవైపు ఫణీంద్ర, దేవయాని ఇద్దరూ కలిసి మహేంద్ర ఇంటికి వస్తారు.
మహేంద్ర: అన్నయ్య చెప్పండి అన్నయ్యా ఏ పని మీద వచ్చారు.
దేవయాని: ఏంటి మహేంద్ర అలా అంటావు. మేము నీ కోసం వస్తే ఏం పని మీద వచ్చారు అంటావేంటి?
ఫణీంద్ర: దేవయాని నువ్వు ఉండు నేను మాట్లాడతాను కదా! మహేంద్ర సంతోషంతో కలకలలాడే మన కుటుంబం ఈరోజు దుఃఖంలో కూరుకుపోయింది. నీకు జరిగిన నష్టం ఎవ్వరూ పూడ్చలేనిది ఏవ్వరూ తీర్చలేనిది.
దేవయాని: అవును మహేంద్ర మీ అన్నయ్య ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు ఏమైపోతావోనని రాత్రిళ్లు నిద్ర కూడా పోవడం లేదు.
మహేంద్ర: అన్నయ్యా నాకేం కాదు మీరు నా మీద బెంగ పెట్టుకోవద్దు.
ఫణీంద్ర: లేదు మహేంద్ర ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా కళ్లముందు లేకపోయేసరికి నాకు ఏదోలా ఉంది. నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండటం ఎందుకు మహేంద్ర. ఇంటికి వచ్చేయ్.
మహేంద్ర: లేదు అన్నయ్యా నేను రాలేను.. నన్ను మీరు భరించలేరు.
అని మహేంద్ర చెప్పగానే దేవయాని పాత విషయాలు గుర్తు చేసుకుంటుంది. మహేంద్ర, రిషి తాగి వచ్చినప్పుడు జరిగిన గొడవ గుర్తు చేసుకుంటుంది. వెంటనే గతంలో జరిగింది మనసులో పెట్టుకుని రానంటున్నావా? అని అడుగుతుంది. ఫణీంద్ర నాకోసమైనా రావాలని అడుగుతాడు. మహేంద్ర రానని చెప్తాడు. దీంతో ఫణీంద్ర వెళ్దామని చెప్పగానే.. దేవయానిని నేను రానని మీరు వెళ్లండి మహేంద్రకు ఇష్టమైన వంట చేసి వస్తానని చెప్తుంది. సరేనని కానీ సూటిపోటి మాటలతో వాళ్లను ఇబ్బంది పెట్టకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు ఫణీంద్ర. దేవయాని కిచెన్ లోకి వెళ్తుంది.
దేవయాని: ఏం చేస్తున్నావు అనుపమ. ఎంతైనా నువ్వు గ్రేట్. నువ్వు వేసిన ప్లాన్‌కు నా దిమ్మ తిరిగిపోయింది తెలుసా? నేను ఇంత మాట్లాడినా నువ్వేం మాట్లాడవు ఏంటి?
అనుపమ: నీలాంటి వాళ్లతోటి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
దేవయాని: ఎవరు చెప్పారు. మహేంద్ర చెప్పాడా? లేదంటే ఆ వసుధార చెప్పిందా?
అనుపమ: ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు.
దేవయాని: ఓ అలాగా కానీ నీ బుర్రే బుర్ర అనుపమ. ఇంట్లో అందర్నీ అంటే ముందు రిషిని, తర్వాత వసుధారని ఇలా ఒకరి తర్వాత ఒకర్ని మాకు.. కాలేజీకి దూరంగా సాగనంపావు. ఇప్పుడు నా కొడుక్కి దక్కాల్సిన ఎండీ పదవిని నీ కొడుక్కి పట్టం కడదామనుకుంటున్నావు కదా?
మహేంద్ర: వదిన గారు వంట చేస్తానని చెప్పి గొడవ పెడుతున్నారేంటి? అయినా నువ్వు అక్కడ వంట చేస్తానని చెప్పినప్పుడే నాకు అర్థం అయ్యింది.
అనగానే దేవయాని నువ్వు తప్పు చేస్తున్నావు అంటూ మహేంద్రను హెచ్చిరిస్తుంది. దీంతో తప్పు చేయడం నా హిస్టరీలోనే లేదని మహేంద్ర చెప్తాడు. అయితే ఒంటరిగా ఉన్న నీతో ఈ అనుపమ ఎందుకు ఉంది. అని ఈ ప్రశ్న నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఇప్పుడు వేరే ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే ఏం చేస్తావు అని వెళ్లిపోతుంది దేవయాని. మరోవైపు వసుధార నిద్రపోతుంది. రంగ వచ్చి వసుధారను నిద్ర లేపి నేను రిషినేనని కొన్ని పరిస్థితుల కారణంగా ఇలా ఉండాల్సి వచ్చిందని ఇప్పుడే మనం మన ఇంటికి వెళ్దాం పద అనగానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఓటీటీలోకి వంద కోట్లు కొల్లగొట్టిన HORROR COMEDY - తమన్నా, రాశీల సినిమా ఎందులో చూడాలంటే?