Guppedanta Manasu Serial Today June 19th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: శైలేంద్రను ఎండీని చేయమన్న దేవయాని – రంగానే రిషి అని నిరూపిస్తానన్న వసు
Guppedanta Manasu Today Episode: తాను రిషిని కాదని ఆ అమ్మాయిని బతకించడం కోసం అలా చెప్పానని రంగ, సరోజతో చెప్పడం వసుధార వినడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: నేను మీ మనవణ్ని రంగాను కాదు.. నేను తన భర్తను అని రంగ చెప్పడంతో వసుధార హ్యాపీగా ఫీలవుతుంది. రాధమ్మ, సరోజ, బుజ్జి షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావురా రంగా అంటూ రాధమ్మ కోప్పడుతుంది. వసుధార సర్ అంటూ రంగాను హగ్ చేసుకుంటుంది. రంగ మాత్రం ముభావంగానే ఉండిపోతాడు. అసలు ఏం జరిగిందని అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారని ఆవిడను నాన్నమ్మ అంటున్నారు. ఆవిడేమో మిమ్మల్ని బావ అంటుంది ఏం జరిగిందని వసుధార అడగ్గానే అవన్నీ తర్వాత చెప్తాను అంటాడు రంగ.
వసుధార: అయితే మనం వెంటనే ఇక్కణ్నుంచి వెళ్లిపోవాలి సర్. మన కాలేజీ చేజారిపోయేటట్టు ఉంది. మనం మన ఇంటికి వెళ్దాం.. పదండి. ఏంటి సర్ రావడం లేదు.
రంగ: మనం మన ఇంటికి వెళదాం కానీ ఇప్పుడు కాదు. తర్వాత వెళ్దాం..
వసుధార: లేదు సర్ ఇప్పుడు వెళ్దాం..
రంగ: నా మాట వింటావా లేదా? నీ ఆరోగ్యం కుదుట పడ్డాక వెళ్దాం. లోపల నీకు బట్టలు ఉన్నాయి వెళ్లి మార్చుకో..
అనగానే వసుధార లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు ఫణీంద్ర ఫోన్ చూస్తుంటే దేవయాని వచ్చి ఈరోజు బోర్డు మీటింగ్ జరిగిందట కదా దేని గురించి అని అడుగుతుంది. ఎండీ పదవి గురించి అని ఫణీంద్ర చెప్పగానే. దానికి మీటింగ్ ఎందుకు మన శైలేంద్రకు ఆ బాధ్యతలు అప్పజెప్పమని చెప్తుంది. అయితే బోర్డు మీటింగ్ లో మేము డిసైడ్ అయ్యామని నువ్వు జోక్యం చేసుకోవద్దని ఫణీంద్ర చెప్తాడు. మరోవైపు మను మంత్రి గారిని కలిసి ఏదో మాట్లాడుతుంటాడు. ఇంతలో శైలేంద్ర వస్తాడు. అక్కడ మనును చూసి షాక్ అవుతాడు.
శైలేంద్ర: ఏయ్ మను వాట్ ఏ సర్‌ప్రైజ్..
మను: నీ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే సర్‌ప్రైజ్ లా లేదే.. షాక్ లా ఉంది.
శైలేంద్ర: ఈ మధ్యన నేను ఏం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నానో నాకే అర్థం కావడం లేదులే.. ఏంటి మను నువ్వు ఇక్కడున్నావు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి వచ్చావా?
మను: మంత్రి గారితో మాట్లాడానికి వచ్చాను అంటే ఇంపార్టెంట్ విషయమే అయ్యుంటుంది కదా.
అనగానే శైలేంద్ర ఏ విషయం ని అడుగుతాడు. కాలేజీ విషయం గురించే మాట్లాడ్డానికి వచ్చానని వసుధార మేడం లేరు కదా అందుకే అన్ని రకాల విషయాలు మాట్లాడాలని వచ్చానని చెప్తాడు మను. దీంతో శైలేంద్ర పిచ్చి పట్టిన వాడిలా ఏదేదో మాట్లాడతాడు. దీంతో మంత్రిగారు, మను నవ్వుకుంటారు. ఏంటేంటో మాట్లాడుతున్నావు అని అడుగుతారు.
మంత్రి: ఏంటయ్యా ఏదేదో మాట్లాడతావు కానీ అసలు పాయింట్ చెప్పనే లేదు.
శైలేంద్ర: అదే సార్ కాలేజీలో వసుధార లేదు కదా.. మను ఏదైతే చెప్పాలని వచ్చాడో నేను అదే చెప్పడానికి వచ్చాను సార్. ఎండీ లేని కాలేజీ చుక్కాని లేని నావ వంటిది. దానికి మీరే ఒక మార్గదర్శి లాగా దారి చూపించాలి సార్.
అనగానే సరే నేను నిర్ణయించుకుని చెప్తాను. అనగానే మను, శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు సరోజ నువ్వు రిషి సర్ వా? రంగావి కాదా? తను అనుకున్నంత మాత్రాన నువ్వు రిషి సర్ వి అయిపోతావా? నువ్వు రిషి సర్ అయితే మరి మా రంగా బావ ఏడీ..? అని ప్రశ్నిస్తుంది. దీంతో ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోమ్మని డాక్టర్ చెప్పారు. అందుకే ఆ అమ్మాయిని కాపాడటానికి నేను అలా అబద్దం చెప్పాను అని రంగ చెప్తాడు. అంతా వింటున్న వసుధార మీరు చెప్పింది అబద్దం కాదు సర్ అంటుంది. మీరే రిషి సర్ అని నిరూపించేవరకు ఈ ఇంట్లో నుంచి వెళ్లను అని వసుధార చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఆస్పత్రిలో పవిత్ర గౌడ... రేణుక స్వామి మర్డర్, దర్శన్ అరెస్ట్ కేసులో కొత్త ట్విస్ట్!