అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 25th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రంగను తీసుకెళ్లేందుకు శైలేంద్ర ప్లాన్ – వసుధారను వెళ్లిపోమ్మన్న రంగ

Guppedanta Manasu Today Episode: దేవయాని చెప్పడంతో రంగను తీసుకెళ్లేందుకు శైలేంద్ర, సంజీవను రంగంలోకి దించుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: రిషి లేడు.. వాడు రాడు. వీడు రంగానే అని శైలేంద్ర అనగానే ఆ రంగా గాడి వల్లే మన కాలేజీ మనం సొంతం చేసుకోవచ్చు అని తన ప్లాన్‌ చెప్తుంది దేవయాని.. ప్లాన్‌ నచ్చడంతో శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీలవుతాడు. అయితే వాడు ఇక్కడకు ఎలా వస్తాడని అడుగుతుంది దేవయాని. నేను వాణ్ని ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తానని శైలేంద్ర చెప్పడంతో.. నువ్వు వాడితో డైరెక్టుగా వెళ్లకు నువ్వు వాళ్ల మామ నుంచి వెళ్లు అని చెప్తుంది. శైలేంద్ర సరే అంటాడు. ఫోన్‌ కట్‌ చేసి ఇక డీబీఎస్టీ కాలేజీ ఎండీని నేనే అని హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు రంగ, వసుధారతో మాట్లాడుతుంటాడు.

రంగ: సరేలే మేడం అవన్నీ పక్కన పెట్టండి మీరు కాలేజీ ఎండీ అన్నారు కదా? ఉన్నపళంగా ఆ పదవిని ఎందుకు వదిలేసి వచ్చారు. ఎండీగా ఉంటే బాగుండేది కదా మేడం గారు.

వసు: అక్కడ నన్ను ముంచడానికి ప్రయత్నించేవాళ్లే కానీ తేరుకోనిచ్చే వాళ్లే లేరు సర్‌.

రంగ: మీ కోపం కాలేజీ మీదనా? మనుషుల మీదనా?

వసు: మనుషుల మీద సర్‌

రంగ: మరి కాలేజీ ఎం చేసింది మేడం గారు. ఎందుకు మీ కోపాన్ని కాలేజీ మీద చూపించారు. ఆ కాలేజీ మీ రిసి సార్‌ సామ్రాజ్యం అన్నారు కదా? ఆ కాలేజీ అంటే తనకు ప్రాణం అని చెప్పారు కదా? మీ మీద ఎంతో నమ్మకంతో ఆ కాలేజీ బాధ్యతలు మీకు అప్పజెప్పారని అన్నారు కదా?

వసు: అవును సర్‌ అన్నాను.

రంగ: మరి మీ రిషి సార్‌ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేశారు మేడం గారు. ఇదే ప్రశ్న రేపు మీ రిషి సార్‌ వచ్చి అడిగితే మీరేం సమాధానం చెప్తారు.

    అని రంగ అడగ్గానే నా రిషి సర్‌ వచ్చి అడిగితే చెప్తాను. పోనీ మీరే రిషి సర్‌ అని ఒప్పుకోండి ఇప్పుడే చెప్తాను. అనగానే రంగ కోపంగా తిడతాడు. మీరు రిషి సర్‌ అంటూ కాలేజీకి అన్యాయం చేస్తున్నారు అంటూ మందలిస్తాడు. మీరు మీ కాలేజీ గురించి కానీ మీ మామయ్య గురించి కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మిమ్మల్ని మీ రిషి సార్‌ను నమ్ముకున్న  ఆ విద్యార్థుల జీవితాలు ఏమైపోతాయో ఏమో అనగానే వసుధార బుజ్జి ఫోన్‌ తీసుకుని కాలేజీకి ఫోన్‌ చేసి ఎండీతో మాట్లాడాలని అడుగుతుంది. దీంతో కాలేజీలో ఫోన్‌ ఎత్తిన ప్రిన్సిపాల్‌ ఎండీ ఎవరు లేరని రేపు ఈ కాలేజీని గవర్నమెంట్‌ హ్యండోవర్‌ చేసుకుంటుంది అని చెప్పగానే వసుధార షాక్‌ అవుతుంది. తర్వాత రంగ దగ్గరకు సంజీవ వస్తాడు.

రంగ: వడ్డీ డబ్బుల కోసం వచ్చారా మామయ్యా

సంజీవ: లేదురా అయినా వాటికి ఇంకా టైం ఉందిలేరా?

రంగ: మరి ఏ పనిమీద వచ్చారు మామయ్యా.. సరోజ కోసం వచ్చారా? సరోజ ఇక్కడ లేదు.

సంజీవ: తెలుసులేరా అది మా ఇంట్లోనే ఉంది. అసలు ఏం జరుగుతుందిరా? నా కూతురు జీవితం గురించి ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది.  

    అంటూ పెళ్లి వాళ్లకు నీ మీద ఇంకా అనుమానంగా ఉన్నట్లు ఉందిరా వాళ్లు మళ్లీ నీతో మాట్లాడాలి అంటున్నారు. అనగానే ఆరోజే చెప్పాను కదా అంతా అర్థం అయ్యింది అన్నారు ఇప్పుడేంటి మళ్లీ ఇలా... అనగానే ఇంతలో వసుధార వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దని రంగ అంటాడు. సంజీవ, రంగ కలిసి శైలేంద్ర దగ్గరకు వెళ్తారు. వసుధార అన్ని విషయాలు ఆలోచిస్తుంది. పెళ్లిచూపులకు వచ్చింది దేవయాని, శైలేంద్రనేనా అని అనుమానిస్తుంది. మరోవైపు శైలేంద్ర దగ్గరకు వెళ్లిన రంగాకు రిషి ఫోటో చూపిస్తాడు శైలేంద్ర. ఫోటో చూసిన రంగా షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget