అన్వేషించండి

Guppedanta Manasu Serial Today January 20th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: దేవయానికి ఫోన్ చేసిన రాజీవ్ – భద్రను అనుమానించిన వసుధార

Guppedanta Manasu Today Episode: దేవయానికి రాజీవ్ ఫోన్ చేసి కలుద్దామని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: రిషిని చూడకుండా ఉండటం నా వల్ల కాదు. ఎక్కడ ఉన్నాడో చెప్పమ్మ వసుధార అని మహేంద్ర అడుగుతాడు. ఇప్పుడు వద్దు మావయ్య. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అని వసుధార అంటుంది. ఇంకెన్నాళ్లు అమ్మా అసలు నా కొడుకు ఏం తప్పు చేశాడు. ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులకు ఇంకా ఎన్నిరోజులు భయపడాలి అని మహేంద్ర అంటాడు. మరోవైపు వాళ్ల మాటలను కిటికి పక్కన ఉండి వింటుంటాడు భద్ర. ఇంతలో భద్రకు ఫోన్ వస్తుంది. దాంతో అలర్ట్ అయిన వసుధార కిటికి వైపు వెళ్లి చూస్తుంది. కానీ, అక్కడి నుంచి భద్ర వెళ్లిపోతాడు.

మహేంద్ర: ఎమరమ్మ వసుధార

వసుధార: ఎవరు లేరు మావయ్య

అనుపమ: చూశావా మహేంద్ర.. మన చుట్టూ ప్రమాదం ఎలా ఉందో. అందుకే వసుధార జాగ్రత్త పడుతుంది.

అని మహేంద్రను కన్వీన్స్‌ చేస్తుంది. మరోవైపు భద్ర ఫోన్‌ లిఫ్ట్‌ చేసి..

భద్ర: ఏంటీ సార్ మీకు అస్సలు టైమ్ సెన్స్ లేదు. మహేంద్ర వాళ్లు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటుంటే చాటుగా వింటున్నాను. ఇంతలో మీరు కాల్ చేసి ప్లాన్ అంతా చెడగొట్టారు.

శైలేంద్ర: ఏడిసావ్‌లే

భద్ర: ఏడవలేదు సార్. మీరే నా ప్లాన్ చెడగొట్టి నన్ను అంటున్నారు.  

శైలేంద్ర: ఏంట్రా అంటున్నావ్.. ప్యాకేజీ గాడివి నీకెందుకురా అంత ఇగో..

భద్ర: నేను నా పర్సనల్ పని మీద లేను. మీరు చెప్పిన పని మీదే ఉన్నాను. ఇలా ఇంకోసారి ప్యాకేజీ గాడు అని మాటలు అనడం ఆపేయండి.

శైలేంద్ర: అది సరే కానీ వసుధార వచ్చిందా?

భద్ర: వచ్చింది… ఇక్కడే ఉంది.

అని భద్ర చెప్పడంతో.. ఆ రిషి గాడి గురించి ఏమైనా తెలిసిందా అని శైలేంద్ర అడుగుతాడు. లేదు వాళ్లు వాడి గురించే మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇంతలో మీరు కాల్ చేసి చెడగొట్టారు అని భద్ర అంటాడు. నువ్ ఏం చేస్తున్నావో నాకు ఎలా తెలుస్తుందిరా అని శైలేంద్ర అంటాడు. సరే నువ్వు బాబాయ్‌తోనే ఉండు. రిషి గాడి గురించి తెలియగానే కాల్ చేయు అని శైలేంద్ర అంటాడు. మహేంద్ర సార్‌తో ఉంటే తెలుస్తుందా. అసలే మంచి ఛాన్స్ మిస్ చేసి మహేంద్ర సార్‌తో ఉంటే మాత్రం ఏమొస్తుంది అని భద్ర అంటాడు. రేయ్.. నేను చెప్పింది చేయ్. అంతే అని కోపంగా కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర.

భద్ర పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ వసుధార, మహేంద్ర, అనుపమ వాళ్లు ఉంటారు. వాళ్లను చూసి షాక్ అవుతాడు భద్ర. ఎవరు ఫోన్‌లో, ఎవరితో మాట్లాడుతున్నావ్ అని నిలదీస్తారు. కానీ, భద్ర సైలెంట్‌గా ఉండటంతో ఫోన్ లాక్కుంటుంది వసుధార. నెంబర్ చూస్తుంది. ఇది శైలేంద్ర నెంబర్ కాదని అనుకుంటుంది. మీరు ఇలా నన్ను అవమానించడం నాకు నచ్చలేదు. మీరు చెప్పిందే చేస్తున్నాను. మీరు వసుధారకు అడుగడుగునా సెక్యూరిటీగా ఉండమంటేనే అక్కడికి వెళ్లాను. అంతేగానీ నేను తిన్నింటి వాసాలు లెక్కపెట్టే టైప్ కాదంటూ ఎమోషనల్ డ్రామా ఆడతాడు. మీరు ఉండమంటే ఉంటాను లేకుంటే ఇప్పుడే వెళ్తాను అని భద్ర అంటాడు. వసుధారను ఆపిన అనుపమ సరే నీ పని చూసుకో అని అనుపమ చెబుతుంది.

మరోవైపు దేవయానికి ఏదో తెలియని నెంబర్ నుంచి కాల్ రావడం చూసిన శైలేంద్ర, దేవయానిని  పిలుస్తాడు. కానీ, దేవయాని పలకకపోవడంతో శైలేంద్రనే ఫోన్‌ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మేడమ్ జీ అని రాజీవ్‌ మాట్లాడుతాడు. ఎవర్రా నువ్వు ఇక్కడ మేడమ్ జీలు ఎవరు లేరని శైలేంద్ర ఫైర్ అవుతాడు. ఇద్దరు వాదించుకుంటారు ఇంతలో దేవయాని వచ్చి ఎవరని అడుగుతుంది. నేను రాజీవ్‌ అని చెప్పి మనం సీక్రెట్‌గా కలుద్దామని చెప్తాడు. సరే అని శైలేంద్రను తీసుకుని రాజీవ్‌ను  కలవడానికి వెళ్తుంది దేవయాని.

మరోవైపు వసుధార, చక్రపాణికి ఫోన్‌ చేసి రిషి సార్‌ను చూడాలని ఉందని చెప్తుంది. అక్కడ సిగ్నల్‌ రాదని నేను వెళ్లి వీడియో తీసి నీకు సెండ్‌  చేస్తాను చూడు అని చెప్తాడు చక్రపాణి. మరోవైపు దేవయాని, శైలేంద్ర ఒక ప్లేస్‌కి వచ్చి రాజీవ్‌ కోసం వెయిట్‌ చేస్తుంటారు. రాజీవ్‌ ఎవరని శైలేంద్ర అడిగితే.. రాజీవ్, వసుధార బావ అని రాజీవ్‌ గురించి ప్లాష్‌బ్యాక్‌ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   

Also Read: అయోధ్య ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు ఎవరెవరంటే ? 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget