Guppedanta Manasu Serial Today April 10th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మనును శైలేంద్రే ఆఫీసుకు తీసుకురావాలని ఆర్డర్ వేసిన ఫణీంద్ర – మరో కొత్త ప్లాన్ వేసిన దేవయాని
Guppedanta Manasu Today Episode: మనును ఆఫీసుకు తీసుకురాకపోతే ఫణీంత్ర సెక్యూరిటీ గార్డు జాబ్ చేయాలని ఫణీంద్ర చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: బోర్డు మీటింగ్‌కు మను ఎందుకు రాలేదని శైలేంద్ర వెటకారంగా అడగ్గానే ఫణీంద్ర సీరియస్ అవుతాడు. తను రాలేదు కాబట్టి నువ్వు వెళ్లీ తీసుకురా అని చెప్పగానే శైలేంద్ర షాక్ అవుతాడు. నేనా నేను వెళ్లి తీసుకురావడం ఎంటి అంటూ ప్రశ్నించడంతో.. అవును నువ్వే వెళ్లి తీసుకురావాలి లేదంటే గేటు దగ్గర సెక్యూరిటీ డ్యూటీ చేసుకోవాలి అంటాడు ఫణీంద్ర దీంతో అందరూ షాకింగ్‌గా చూస్తుంటారు. అందరూ హెచ్‌వోడీలతో టచ్‌లో ఉండండి అంటూ చెప్పి బోర్డు మీటింగ్ లోంచి వెళ్లిపోతుంది వసుధార. అందరూ వెళ్లిపోయాక శైలేంద్ర సెక్యురిటీ గార్డులా ఎలా ఉంటాడో ఊహించుకుంటాడు. ఇంతలో వసుధార వస్తుంది.
వసు: శైలేంద్ర గారు మీరు ఒకవేళ మను గారిని తీసుకుని రాకపోతే సెక్యూరిటీ గార్డులాగానే చేయాల్సి వస్తుంది.
శైలేంద్ర: ఏయ్ వసుధార ఏం మాట్లాడుతున్నావు.
వసు: ఆ ఏంటి కోపం వచ్చిందా? ఆ మాట నేను అనలేదు. ఫణీంద్ర సార్ అన్నారు. అయినా.. ఎలాగూ నువ్వు చేసేది సెక్యూరిటీ పనే కదా? అదే మేం ఎం చేస్తున్నాం ఏంటి అని కాపలా కాయడమే కదా మీరు చేసేది అదేదో గేటు దగ్గర చేస్తే బాగుంటుంది. అదే మీకు కరెక్టుగా ఉంటుందేమో
అనగానే శైలేంద్ర కోపంగా చూస్తుంటాడు. తర్వాత వసుధారకు అనౌన్ కాల్ వస్తుంది. రిషి నార్సింగ్ దగ్గర ఉన్నారని చెప్పడంతో వసుధార వెంటనే వెళ్లిపోతుంది. హ్యాపీగా కారులో వెళ్తూ రిషితో ఉన్న జ్ఙాపకాలను గుర్తుచేసుకుంటూ వెళ్తుంది. అనౌన్‌పర్సన్ చెప్పిన లోకేషన్‌లో కారు ఆపి రిషి సార్ అంటూ పిలుస్తుంది. ఇంతలో రాజీవ్ వస్తాడు.
రాజీవ్: ఎవరికోసమో నీ కళ్లు ఆరాటపడుతున్నాయి. ఎవరికోసమో నీ ప్రాణం విలవలలాడుతున్నాయి. చెప్పు మరదలు పిల్ల. ఎవరికోసమో వెతుకుతున్నావు.. రిషి కోసమో కదా?
వసు: నువ్వు ఇక్కడ ఉన్నావేంటి?
రాజీవ్: ఏం ఉండకూడదా?
వసు: నేను ఇక్కడికి వస్తున్నట్లు నీకు ముందే తెలుసా?
రాజీవ్: నీకు ఫోన్ చేసిందే నేను. వాడు కనిపించాడని చెప్పగానే చాలా సంతోషించినట్టు ఉన్నావు. వాడికోసం చాలా హ్యాపీగా వచ్చినట్టు ఉన్నావుగా కానీ వాడిక్కడ లేడు. ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు.
వసు: రిషి సార్ పేరు చెప్పి ఎందుకు పిలిచావు.
రాజీవ్: నాకోసం
వసు: నీకెంత ధైర్యం నన్ను ఇలా ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తావా? అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు.
రాజీవ్: నీకోసం
అంటూ తాళి తీస్తాడు రాజీవ్. నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం అనగానే వసు తిడుతుంది. ఒక ఆడపిల్లను ఇలా వేధిస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా? అనగానే నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే నిజంగానే పిచ్చిపడుతుంది. అంటూ రొమాంటిక్‌గా చూస్తూ ఈరోజు నా నుంచి ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. ఒకవేళ రిషి వచ్చినా వాడిని చంపైనా నీ మెడలో ఈ తాళి కడతాను. అంటూ వసుధారను లాక్కుని వెళ్తుంటే.. మను వచ్చి రాజీవ్‌ను కాలుస్తాడు. దీంతో బుల్లెట్ రాజీవ్‌కు మిస్ అవుతుంది. దీంతో రాజీవ్ షాక్ అవుతాడు. మను దగ్గరకు వచ్చి
మను: మిస్ అయ్యిందనుకున్నావా? మిస్ చేశా.. అయినా నీకెప్పుడు ఇదే పనేనారా?
రాజీవ్: అయినా నీకు కూడా ఎప్పుడూ ఇదే పనారా? గన్ చూపించడాలు, బెదిరించడాలు.
అనగానే మను కోపంగా రాజీవ్‌కు వార్నింగ్ ఇస్తాడు. దీంతో రాజీవ్ వెళ్లిపోతాడు. మరోవైపు శైలేంద్ర కోపంగా దేవయానిని తిడుతుంటాడు. మమ్మీ ఇప్పుడు నీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు టార్గెట్టే కంప్లీట్‌గా వేరే అయిపోయింది. ఏం చేసినా ఇక నేనే చేస్తాను అంటూ శైలేద్ర అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'విశ్వంభర' సెట్స్‌లో పవర్ స్టార్ - మెగా బ్రదర్స్‌ను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు