అన్వేషించండి

Guppedanta Manasu November 6th : శైలేంద్ర ప్లాన్‌ వికటించిందా? – కాలేజ్‌ సమస్య వసుధార పరిష్కరించిందా?

రిషి తను అనుకున్నది చేశాడని వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవయాని తన కొడుకు శైలేంద్రను హెచ్చరిస్తుంది. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.

చాలా సేపటి నుంచి నాకోసం వెయిట్‌ చేశావా? అంటే నేను లేట్‌ చేశానా అంటూ రిషి  అడగగానే అదేం లేదని కాలేజ్‌ లో ఇవాళ మీటింగ్‌  ఉందని త్వరగా వెళ్దామని వచ్చానని తర్వాత మనసు మార్చుకుని మీతో రావడానికి ఫిక్స్‌ అయ్యానని వసుధార చెప్పడంతో ఇద్దరూ కలిసి కారులో  వెళ్తూ..

వసుధార: ఏంటి సార్‌ కొంచెం సీరియస్‌గా ఉన్నట్లున్నారు.

రిషి : ఇది సీరియస్‌ కాదు వసుధార. దీని పేరు ఇంకేదో ఉంది. నువ్వు ఇందాక లేట్‌ అయ్యింది అన్నావ్‌ కదా అదే నా మైండ్‌లో తిరుగుతూ ఉంది.

వసుధార: మీరు అదే మనసులో పెట్టుకోకండి సార్‌ . నేను ఎందుకు అన్నానో తెలుసా సార్‌. అసలు మీరెప్పుడూ లేట్‌ చేయరు కదా.. ఎందుకు ఈరోజు ప్రత్యేకించి లేట్‌ అయిందని జస్ట్‌ కారణం తెలుసుకుందామని అనుకున్నానంతే..  అని అడగగానే తన లేటుకు కారణం చెప్తూ.. నువ్వు నాకు స్నానం చేయించుంటే లేటు అయ్యేది కాదు కదా అంటూ ఇద్దరూ హ్యాపీగా కాలేజ్‌ కి వెళ్తారు. రిషి క్లాస్‌ తీసుకుని విద్యార్థులకు పాఠాలు చెప్తుంటాడు. ఇంతలో వసుధార గదిలోకి కొంతమంది లెక్చరర్లు వస్తారు.

లెక్చరర్లు:   ఎక్స్‌కూజ్‌ మీ మేడం లోపలికి రావొచ్చా మేడం.

వసుధార: రండి. కూర్చోండి. చెప్పండి ఏ పర్పస్‌ మీద వచ్చారు.

లెక్చరర్లు: మేడం మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు మేడం.

వసుధార: ఏ నిర్ణయం.. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు.

లెక్చరర్లు: కొత్త లెక్చరర్స్‌ ని ఎందుకు తీసుకున్నారు మేడం.

వసుధార: జీతం పెంచకపోతే పాఠాలు చెప్పలేమని మీరే అన్నారు కదా?

లెక్చరర్లు: అవును మేడం మాకొక పది రూపాయలు ఎక్కువ వస్తాయని ఆశపడి అలా అన్నాం. దానికే మీరు ఫీల్‌ అయ్యి మమ్మల్ని తీసేసి వేరే లెక్చరర్స్‌ను తీసుకుంటారా?

వసుధార: మేము ఆ నిర్ణయం తీసుకునేలా చేసింది మీరు. మళ్లీ మీరే క్వశ్చన్‌ చేస్తున్నారేంటి? జీతాలు పెంచే వరకు మీరు కాలేజ్‌ కి రాకపోతే పిల్లల పాఠాలు ఆగిపోతాయి. అందుకే మేము మరో స్టెప్‌ తీసుకున్నాము.  

అని వసుధార చెప్పగానే లెక్చరర్లు కోపంగా మీరు ఈ విషయంలో తగ్గకపోతే మేము కూడా యూనియన్‌లో కంప్లైంట్‌ చేస్తామని.. కాలేజ్‌ ముందు ధర్నా చేస్తామని బెదిరిస్తారు. దీంతో రిషి  లోపలికి వచ్చి మీరెమైనా చేసుకోండని హెచ్చరిస్తాడు. దీంతో లెక్చరర్లు భయపడి తప్పైందని.. తమని మళ్లీ జాబ్‌ లోకి తీసుకోమని బతిమాలుతారు. దీంతో రిషి  వాళ్లను మళ్లీ జాయిన్‌ కామని చెప్తాడు. వాళ్లు సరే అని వెళ్లిపోతారు.

వసుధార: సార్‌ వీళ్లు తిరిగి పనిలోకి వస్తారని మీరు ముందే ఊహించారు కదా?

రిషి : రాకుండా ఎక్కడికి వెళ్తారు వసుధార. వాళ్ల బతుకుదెరువు కోసం పాఠాలు చెప్తారు. కానీ వాళ్లు కొంత డబ్బుకు ఆశపడ్డారు. ఆ తర్వాత అది తప్పు అని తెలుసుకుని తిరిగి వచ్చారు.

సార్‌ మీరు చాలా గ్రేట్‌ అంటూ పొగుడుతుంది వసుధార. అయితే నాకన్న నువ్వే గ్రేట్‌ ఎందుకంటే ఈ సీట్‌ లో కూర్చుంటే నీకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా నా మాటకు విలువిచ్చి ఈ సీటులో కూర్చున్నావు. అందుకే నువ్వు గ్రేట్‌ అంటాడు రుషి. ఇద్దరూ కలిసి కాలేజ్‌ ని ఎలా డెవలప్‌ చేయాలో ఆలోచిస్తారు.

శైలేంద్ర.. వాళ్ల అమ్మ దేవయానికి ఫోన్‌ చేస్తాడు.

దేవయాని: చెప్పు శైలేంద్ర.

శైలేంద్ర: మమ్మీ ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది. రిషి  అన్నంత పని చేశాడు. రిటైర్డ్‌ లెక్చరర్స్‌ తో పాఠాలు కొనసాగించేలా చేస్తానని  పిల్లలకు చెప్తుంటే ఏదో సెలవులకు ముందు పిల్లలను ఓదార్చేందుకు చెప్తున్నాడని అనుకున్నాను. కానీ వచ్చీ రాగానే దాన్ని ఇంప్లిమెంట్‌ చేసి ఇలా గగ్గోలు పుట్టిస్తాడని అనుకోలేదు మమ్మీ. రిషి  గాడు టుమచ్‌ డేంజర్‌ మమ్మీ.

దేవయాని: మరి రిషి  అంటే ఏమనుకున్నావ్‌. తన గురించి నీకు ఇప్పడు అర్థం అయ్యిందా?

అంటూ చిన్న చిన్న ప్లాన్లతో రిషిని నువ్వేం చేయలేవు. రిషి  చాలా మంచోడు. అ మంచితనంతోనే దెబ్బకొట్టాలి అని దేవయాని చెప్తుంది.  

రిషి  రెడీ అవుతుంటే వసుధార వచ్చి సార్‌ మీరు ఇదివరకటి రిషి  సార్‌లా ఉండటం లేదని చెప్తుంది.

రుషి : ఇదివరకు రిషి సార్‌ ఎలా ఉండేవారో?

వసుధార: స్టైల్‌ గా ఆ లుక్‌, ఆ ఐస్‌.. ప్రతిదీ ప్రతిక్షణం నన్ను చాలా డిస్టర్బ్‌ చేసేది సార్‌. కానీ ఇప్పుడు మీరు సైలెంట్‌ గా అడుగుతున్నారు కానీ. అప్పుడు నా మనసు ఎంతలా పరితపించేదో మీకేం తెలుసు? మీరు ప్రతిక్షణం నన్ను డిస్టర్బ్‌ చేస్తూనే ఉండేవారు.

అని ఇద్దరూ మాట్లాడుకుంటుండగా.. రుషికి ఫోన్‌ వస్తుంది.

రిషి :  ప్రిన్సిపాల్‌, విష్ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌.

వసుధార: మాట్లాడండి.

రిషి : సార్‌ చెప్పండి

ప్రన్సిపాల్‌ : హ్యాపీ మ్యారిడ్‌ లైఫ్‌ సార్‌

అంటూ విష్‌ చేసి రిషి , వసుధారను తమ కాలేజ్‌కు ఇన్‌వైట్‌ చేస్తాడు ప్రిన్సిపాల్‌. మేము మిమ్మల్ని ఘనంగా సన్మానించడానికి  రెడీగా ఉన్నామని చెప్తాడు ప్రిన్సిపాల్‌. రిషి  కూడా సరే వస్తామని చెప్తాడు. వసుధార, రుషి రెడీ అయి వెళ్తుంటే రిషి  వాళ్ల డాడీ మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు.  విష్‌ కాలేజ్‌కు వెళ్తున్నామని రిషి  చెప్పగానే మహేంద్ర షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత

వీడియోలు

Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
C M Nandini: బెంగళూరులో సీరియల్ నటి నందిని ఆత్మహత్య - ఆమె డైరీలో ఉన్న వాటితో సినిమానే తీయవచ్చు !
బెంగళూరులో సీరియల్ నటి నందిని ఆత్మహత్య - ఆమె డైరీలో ఉన్న వాటితో సినిమానే తీయవచ్చు !
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Mysore: ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
Embed widget