News
News
వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu May 6th: రిషి ప్రాణాలా కాలేజీ బాధ్యతలా అని జగతికి శైలేంద్ర వార్నింగ్ - మీరుండగా నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరన్న రిషి

Guppedantha Manasu May 6th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు మే 6 ఎపిసోడ్

వ‌సుధార‌తో క‌లిసి నైట్‌డ్రైవ్‌కు వెళ్లిన రిషి..కాలేజీ దగ్గరకు తీసుకెళ్తాడు. ఫస్ట్ టైమ్ కాలేజీలో వసుధారని కలసిన ప్లేస్ తీసుకెళ్లిన రిషి.. ఆ ప్లేస్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు. అప్పట్లో గెటౌట్ అన్నవాళ్లే ఇప్పుడు ఇక్కడకు తీసుకొచ్చారని వసుధార అంటే.. ప్రేమ గురించి గొప్పగా చెబుతాడు రిషి. ప్రేమగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ చెబుతుంది వసుధార. ఇంతలో ఎవరో వ్యక్తి నీడ తనపై పడడంతో అలెర్ట్ అయిన రిషి బయటకు వెళ్లి చూద్దాం పద అని తీసుకెళ్తాడు. కారు దగ్గర నిల్చుని చుట్టూ గమనిస్తుంటాడు. ముసుగు వేసుకున్న వ్యక్తికారు వెనుక నుంచి వచ్చి రిషిని కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తాడు...అప్పుడే వసుధార ఆ వైపు వెళ్లి చూద్దాంఅనేసరికి రిషి ముందుకు కదులుతాడు..కత్తి పోటు నుంచి తప్పించుకుంటాడు. రిషి-వసుధార వాడి వెనుక పరిగెడతారు కానీ వాడు తప్పించుకుని పారిపోతాడు.. వాచ్ మెన్ అని అరిచిన వసుధార వాడెవడో చూడండి అని చెబుతుంది.. రిషిని చూసి కంగారుపడుతుంది..ఎవరై ఉంటారో అర్థంకావడం లేదనుకుంటారు. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం సార్ అని రిషిని తీసుకెళ్లిపోతుంది. ఇద్దరూ కార్లో బయలుదేరుతారు.  శ‌త్రువుల నుంచి రిషికి అపాయం ఉంద‌ని జ‌గ‌తి చెప్పిన మాట‌ల‌ు గుర్తుచేసుకున్న వసుధార..కారు ఆపమని చెప్పి రిషిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. నాకేం కాలేదు కదా..ఈ రోజు నీ వల్లే సేవ్ అయ్యాను కదా అంటాడు.ఈ మధ్య నువ్వు ఎక్కువగా ఏడుస్తున్నావు..ఆడపిల్ల ఏడవకూడదు..నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు.

Also Read: రిషిని చంపించేందుకు శైలేంద్ర కుట్ర, వసుని అలర్ట్ చేసిన జగతి!

రిషి మీద అటాక్ జ‌రిగిన విష‌యం తెలిసి అంద‌రికంటే తొంద‌ర‌గా దేవ‌యాని రియాక్ట్ అవుతుంది. అటాక్ చేయించింది శైలేంద్ర అనే విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా డ్రామా చేస్తుంది. రిషమీద అటాక్ జరిగిందా..అది కూడా మనకాలేజీలో ఇంతకన్నా దారుణం ఉందా..కాలేజీ అయిపోయాక ఇంట్లోనే ఉండొచ్చు కదా నువ్వేమో చీటికిమాటికి బయటకు వెళుతుంటావు ..వ‌సుధార ప‌క్క‌నుండ‌గా నాకు ఏం జ‌ర‌గద‌ని ఎప్పుడూ చెబుతుంటావు. ఇప్పుడు ఆమె ప‌క్క‌నుండ‌గానే నీపై దాడి జ‌రిగింది..నీకేమైనా అయితే ఏంటి పరిస్థితి తనేమైనా కాపాడుతుందా...
ఫణీంద్ర: దేవయాని నువ్వు సైలెంటుగా ఉంటావా...జరిగిన దానికి కారణాలు తెలుసుకోవాలి కానీ వాళ్లకారణంగా వీళ్ల కారణంగా జరిగిందంటావేంటి. రిషిని టార్గెట్ చేసి దాడిచేయాలి అనుకున్నారు...
శైలేంద్ర:మమ్మీ నువ్వు కొంచెంసైలెంటుగా ఉండు 
ఇది చిన్న విషయం కాదు..దీన్ని సీరియస్ గా తీసుకోవాలని ఫణీంద్ర అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు మహేంద్ర కూడా.. రిషి వద్దంటాడు కానీ ఇప్పుడే ఐజీ గారికి కాల్ చేస్తానంటాడు. 
జగతి: మనం ఊరుకోకూడదు..ఏదో ఒకటి చేయాలి.. నిన్నుచంపడానికి ప్రయత్నించారంటే వాళ్లు ఎంతదూరం వెళ్లి ఉంటారు..మనం బాగా ఆలోచించాల్సిన విషయం
శైలేంద్ర: రిషిమీద దాడి చేయడం ఏంటి..రిషికి శత్రువులు కూడా ఉన్నారా..
మహేంద్ర: ఓ సారి స్పాట్ వాల్యూషన్ విషయంలో బుక్ చేయాలని చూశారు ఫెయిల్ అయ్యారు... ఆ తర్వాత రిషి-వసుధారని కిడ్నాప్ చేశారు ఫెయిలయ్యారు..ఇప్పుడు ఇలా చేశారు
జగతి: నువ్వు మంచి మనసులో ఆలోచించి వదిలేశావ్..కానీ..నీ మంచితనం గుర్తించడం లేదు.. నువ్వు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదని తెలిసి ఈజీ టార్గెట్ అయిపోయావ్..ఈసారి కంప్లైంట్ ఇద్దాం..
రిషి: వద్దు మేడం.. స్టూడెంట్స్ కోసం చెబుతున్నాను..మన కాలేజీ పేరు పోలీస్ స్టేషన్ వరకూ వెళితే స్టూడెంట్స్ భవిష్యత్ పాడైపోతుంది.. వారి పేరెంట్స్ ఆందోళనకు గురవుతారు..ఇది పరీక్షల టైమ్..ఈ టైమ్ లో కాలేజీలో చిన్న ఇబ్బంది జరిగినా స్టూడెంట్స్ కి స్టడీస్ పై కాన్సన్ ట్రేషన్ పోతుంది.. వాళ్ల స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది..మనం పోలీస్ స్టేషన్ మెట్లెక్కామని తెలిస్తే శత్రువులు జాగ్రత్తపడతారు.. దీని గురించి మీరంతా వదిలేయండి..

Also Read: మే 6 రాశిఫలాలు, ఈ రాశివారు గందరగోళంగా ఉండే వ్యక్తులకు దూరంగా ఉండాలి!

శైలేంద్ర కోసం అత‌డి ఇంటి బ‌య‌ట రిషిపై క‌త్తితో దాడిచేసిన వ్య‌క్తి వెయిట్ చేస్తుంటాడు. అత‌డిని శైలేంద్ర వ‌చ్చి క‌లుస్తాడు. రిషి జ‌స్ట్‌లో మిస్స‌య్యాడ‌ని అత‌డు శైలేంద్రతో చెప్ప‌గా....మిస్ అవ్వ‌డం కూడా ఒక ర‌కంగా మంచిదే అంటాడు. అత‌డికి ఫుల్ పేమెంట్ ఇస్తాడు. ఈ విష‌యం ఎక్క‌డ బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌టానికే ఈ డ‌బ్బు ఇచ్చాన‌ని, ఈ సారి రిషిని ఫినిష్ చేయ‌డానికే పిలుస్తాన‌ని అంటాడు. ఆ మాట‌ల‌ను జ‌గ‌తి వింటుంది.

దేవయాని-ఫణీంద్ర
మరోవైపు ఈ అటాక్ నుంచి రిషి బ‌య‌ట‌ప‌డ‌టంతో దేవ‌యాని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తుంది. రియాక్టైన శైలేంద్ర...రిషిపై అటాక్ మిస్ అవుతుంద‌ని  ముందే తెలుసు కానీ దీని వ‌ల్ల‌ రిషితో పాటు జ‌గ‌తి, వ‌సుధార, మ‌హేంద్ర‌ల‌లో భ‌యం మొద‌ల‌వుతుంద‌ని, ఆ భ‌యాన్ని పెంచుతూ ఈ ప‌ద‌వులు మాకు వ‌ద్దు అంటూ అనేలా చేస్తాన‌ని చెబుతాడు. నాకు అనుకున్న‌ది ద‌క్క‌ని రోజు రిషిని ఈ చేతుల‌తోనే చంపేస్తాను అంటాడు శైలేంద్ర‌. ఆ మాటలు విన్న జగతి ఆవేశంగా రూమ్ లోకి వస్తుంది
జగతి:అసలు మీరు మనుషులేనా.. తల్లి కొడుకులు నా కొడుకుని చంపడానికి కుట్రలు చేస్తున్నారా..నేనుండగా రిషికి ఏమీ జరగనివ్వను..
శైలేంద్ర: అందుకే ఇంత ఓపెన్ గా మాట్లాడుకోవద్దని నేనంటాను... జరిగింది మొత్తం పిన్నికి తెలిసిపోయింది.. 
జగతి: నువ్వు ఆ వెధవకి డబ్బులివ్వడం కూడా చూశాను..నీపై మొదట్నుంచీ సందేహంగా ఉంది ఈ రోజు పూర్తి క్లారిటీ వచ్చింది.. ఇప్పుడే మీ నిజస్వరూపం రిషికి అర్థమయ్యేలా చేస్తాను

గుప్పెడంతమనసు మే 7 ఎపిసోడ్ లో
రిషి ప్రాణాలతో ఉండాలంటే కాలేజీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని షరతు పెడతారు దేవయాని-శైలేంద్ర... ఆ పని నువ్వే చేయాలంటారు. ఆ తర్వాత జగతి...మహేంద్ర-వసు-రిషితో..మాట్లాడుతుంది.. ఏమైంది మేడం మీరుండగా నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు అంటాడు రిషి. 

Published at : 06 May 2023 09:05 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial May 6th Episode

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham June 1st: వేద ఆంటీ చాలా మంచిదన్న ఆదిత్య- యష్ కాపురంలో చిచ్చు పెట్టేందుకు సిద్ధమైన మాళవిక

Ennenno Janmalabandham June 1st: వేద ఆంటీ చాలా మంచిదన్న ఆదిత్య- యష్ కాపురంలో చిచ్చు పెట్టేందుకు సిద్ధమైన మాళవిక

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

Gruhalakshmi May 31st: తులసి ప్లాన్ ఫెయిల్, నందుకి ఐదేళ్ల జైలు శిక్ష- దివ్యని ఇరికించేందుకు పక్కా స్కెచ్ వేసిన రాజ్యలక్ష్మి

Gruhalakshmi May 31st: తులసి ప్లాన్ ఫెయిల్, నందుకి ఐదేళ్ల జైలు శిక్ష- దివ్యని ఇరికించేందుకు పక్కా స్కెచ్ వేసిన రాజ్యలక్ష్మి

Krishna Mukunda Murari May 31st: కృష్ణ మీద అనుమానపడిన ముకుంద- తల్లికి తన ప్రేమ తెలిసిపోయిందని టెన్షన్ పడిన మురారీ

Krishna Mukunda Murari May 31st: కృష్ణ మీద అనుమానపడిన ముకుంద- తల్లికి తన ప్రేమ తెలిసిపోయిందని టెన్షన్ పడిన మురారీ

Brahmamudi May 31st: కావ్యనా మజాకా, రాహుల్ గుట్టు సంపాదించేసింది- ఇక వెన్నెలతో నిశ్చితార్థం అవుట్

Brahmamudi May 31st: కావ్యనా మజాకా, రాహుల్ గుట్టు సంపాదించేసింది- ఇక వెన్నెలతో నిశ్చితార్థం అవుట్

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు