మే 15న వృషభ రాశిలోకి సూర్యుడు , ఈ రాశులవారికి డబ్బే డబ్బు



మే నెల 15న సూర్యుడు మేష రాశినుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలో సూర్య సంచారం చాలా రాశులకు మంచి జరుగుతుంది.



మేష రాశి
వృషభ రాశిలో సూర్య సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.



వృషభ రాశి
సూర్యుడు మీ రాశిలోనే మొదటి ఇంటిలోనే సంచరిస్తాడు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులకు మంచి జరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కెరీర్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.



కర్కాటక రాశి
మీ రాశినుంచి సూర్యుడు 11వ స్థానంలో సంచరిస్తాడు. ఈ ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.



సింహ రాశి
వృషభ రాశిలో సూర్య సంచారం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాడు. ఈ రాశి వారి జీవితంలో శుభ సమయం ప్రారంభమవుతుంది. కుటుంబంలో, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.



కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ సూర్య సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. సూర్యుడు ఈ రాశిలోని తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీనిని అదృష్టంగా భావిస్తారు. ఈ సమయంలో మీ మనస్సుకు అనుగుణంగా పని జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.



మీన రాశి
వృషభ రాశిలో సూర్య సంచారం అంటే మీన రాశినుంచి మూడో స్థానంలో సంచరిస్తున్నట్టు. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.



ప్రతి గ్రహం 12 రాశుల్లోనూ వరుసగా సంచరిస్తాయి. దాదాపు నెలకోసారి రాశి మారుతుంటాయి. ఆయా సమయంలో ఆ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది.



గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.



Image Credit: Pixabay