News
News
వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu May 5th: రిషిని చంపించేందుకు శైలేంద్ర కుట్ర, వసుని అలర్ట్ చేసిన జగతి!

Guppedantha Manasu May 5th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు మే 5 ఎపిసోడ్

రిషికి నీపై ఎలాంటి అభిప్రాయం లేదు..నీకెందుకు ఈ పాకులాట అంటాడు శైలేంద్ర. నువ్వు ఆడదానిగా పుట్టిఉంటే నీకు అర్థమయ్యేది.. మా ఇద్దరి మధ్యా దూరం ఉండొచ్చు కానీ మా మనసులు దగ్గరగా ఉన్నాయి. నన్ను అమ్మా అని పిలవకపోవచ్చు కానీ మేడం అనే పిలుపులో ఆ ప్రేమ ఆప్యాయత కనిపిస్తాయని స్ట్రాంగ్ గా చెప్పి వెళ్లిపోతుంది. జగతి వెళ్లిపోయిన తర్వాత మిస్టర్ రిషి..నీకు మీ అమ్మలో ఉన్నంత పట్టుదల వచ్చింది అదే నీ బలం..అన్నీ సెట్ చేస్తాను అనుకుంటాడు శైలేంద్ర. మరోవైపు జగతి రూమ్ కి వెళ్లి శైలేంద్ర మాటలు తలుచుకుని బాధపడుతుంది. ఇంతలో మహేంద్ర వచ్చి ఏమైందని అడిగితే ఏం లేదు అనేస్తుంది.  
మహేంద్ర: పిల్లలు పుట్టినప్పుడు కన్నా వాళ్లు పెద్దయి, ప్రయోజకులు అయితే సంతోషం ఉంటుంది. రిషి మనకు పుట్టడం మనం చేసుకున్న అదృష్టం..నా ఆనందానికి హద్దుల్లేవు..ఇప్పుడు బయటకు వెళ్లి ఆ మూమెంట్ ని ఆస్వాదిద్దాం..
జగతి: నాకు తలనొప్పిగా ఉంది నేను ఎక్కడికీ రాలేను..కాసేపు పడుకుంటాను
మహేంద్ర: హాస్పిటల్ కి వెళతామా అంటే వద్దంటుంది..అయితే వసుధారతో కాఫీ పంపిస్తానని చెప్పి వెళ్లిపోతాడు...

Also Read: వసు-జగతిని టార్గెట్ చేసిన శైలేంద్ర, అడుగడుగునా చెక్ పెడుతున్న రిషి!

ఇంతలో వచ్చిన వసుధార..మేడం ఏమైందని అడుగుతుంది.. డోర్ క్లోజ్ చేసి రా అంటుంది వసుధార...
జగతి: ప్రమాదం తలపెట్టే మనుషులు పక్కనే ఉన్నప్పుడు డోర్ క్లోజ్ చేసుకుని మాట్లాడాలి... వసు..ఇప్పుడు మనిద్దరి మధ్యా చాలా భారం , బాధ్యత ఉన్నాయి
వసు: అర్థం కాలేదు మేడం ..ఏం మాట్లాడుతున్నారు..
జగతి: నా కొడుకుని కాపాడుకోవడానిక నేను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తాను..నువ్వు మాత్రం తనని ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉండు
వసు: సార్ బాగానే ఉన్నారు కదా..తాను అనుకున్నట్టు చేస్తున్నారు కదా..అందుకు డాక్టర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు
జగతి: వసు..రిషి విషయంలో నాకెందుకో భయంగా ఉంది..నా మనసులో ఏవేవో లేనిపోని ఆలోచనలు ఎవరికి చెప్పాలో ఏమని చెప్పాలో తెలియడం లేదు.. అక్కయ్య నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టినప్పుడు, ఒంటరిగా బతికినప్పుడు బాధపడ్డాను కానీ భయపడలేదు.. ఈ రోజు నా జీవితంలో ఫస్ట్ టైమ్ భయం వేస్తోంది..శత్రువులు రిషికి ఎటునుంచి ఏ అపాయం తలపెడతారో అని ఆందోళనగా ఉంది. 
వసు: ఎంతమంది శత్రువులు వచ్చినా పర్వాలేదు..తను హ్యాండిల్ చేయగలరు..తనదాకా రానంతవరకే ఏదైనా.. తనవరకూ వస్తే తాట తీసే రకం.. మీరేం భయపడొద్దు..నేను రిషి సార్ పక్కనుండగా తనకు ఏ హానీ జరగదు..చిన్న ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను.. అది నా బాధ్యత. మీరు ధైర్యంగా ఉండండి
జగతి..వసుధారని హగ్ చేసుకుని ఏడుస్తుంది...నా కొడుక్కి నేనివ్వలేని ప్రేమను వెయ్యింతలు చేసి నువ్విస్తున్నావు..అమ్మగా రిషిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను..ఇన్నాళ్లూ వాటిని అణిచిపెట్టాను..ఈ జన్మలో ఆ పిలుపుకి నోచుకోలేని తల్లిని నేను.. రిషిని కన్నానే కానీ ప్రేమపంచి పెంచలేదు.. తను నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు కానీ రిషి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి వసు..నేను కోరుకునేది అదొక్కటే
వసు: మీరు ఎందుకింతలా ఎమోషన్ అవుతున్నారు...ఏం జరిగింది..
జగతి: జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలా అనిపిస్తోంది..
వసు: మీర ఏదైనా దాస్తున్నారా..
జగతి: పరిస్థితుల ప్రభావం..
ముందు కాఫీ తాగండి అని ధైర్యం చెబుతుంది వసుధార.. అన్నీ అవేసర్దుకుంటాయంటుంది.. కానీజగతి మనసులో ఏదో బాధ ఉంటుంది

Also Read: మే 5 రాశిఫలాలు, ఈ రాశివారు అత్యుత్సాహం తగ్గించుకోవడం మంచిది

శైలేంద్ర-దేవయాని
మనం అనుకున్నది నెరేవుతుంది..అందుకు నేను చేయాల్సింది నేను చేస్తున్నాను..నువ్వు చేయాల్సింది కూడా ఉంది.. నువ్వు చిరునవ్వుతో అయినా కన్నీళ్లతో అయినా రిషిని మన గుప్పిట్లో పెట్టుకోవాలని శైలేంద్ర చెబితే.. నేను నీ తల్లిని ...నీ బుద్ధులు నాకు రాలేదు..నా బుద్ధులు నీకు వచ్చాయి అంటుంది. మన ప్లాన్ పిన్నికి తెలిసిపోయిందేమో అని అనుమానంగా ఉందని శైలేంద్ర అంటే.. తను చూపులతోనే పసిగట్టగల మేధావి...జగతిని అంత తేలిగ్గా తీసుకోవద్దు..తనకి బిడ్డ ప్రేమ దక్కకుండా చేశాను,రిషికి అమ్మ ప్రేమ లేకుండా చేశాను..  అయినా జగతి తొణకలేదు.. రిషికి తల్లిపై కోపం పోయి ప్రేమ పుట్టుకొస్తోంది..రోజు రోజుకీ వాళ్లిద్దరి మధ్యా బంధం బలపడుతోందని దేవయాని అంటే.. నేనున్నాను కదా అని శైలేంద్ర అంటే.. జగతితో పాటూ వసుధార కూడా ముఖ్యం.. వాళ్లిద్దరినీ దాటేస్తే రిషిని ఈజీగా దెబ్బకొట్టొచ్చు అంటుంది.. వీళ్లిద్దరి మాటలు వింటుంది ధరణి... ఎందుకొచ్చావ్...ఎప్పుడొచ్చావ్..వచ్చాక పిలవాలి కదా అని ఫైర్ అవుతాడు శైలేంద్ర. దేవయాని కూడా మండి పడుతుంది. నీ కన్నీళ్లకు ఎవ్వరూ కరిగిపోరు ఇక్కడి నుంచి వెళ్లు అని పంపించేస్తారు..నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు నీ కోడలు మనకు పనికిరాని తెలివితేటలు చాలా ఉన్నాయని తల్లిని హెచ్చరిస్తాడు శైలేంద్ర. రిషి-వసుధార బయటకు వెళ్లడం చూసి..శైలేంద్ర-దేవయాని మాట్లాడుకుంటారు. వెళ్లనీ మమ్మీ వెళ్లేటప్పుడు ఉన్న ఉత్సాహం వచ్చేటప్పుడు ఉండదులే అని క్రూరంగా నవ్వుతాడు శైలేంద్ర.

రిషి-వసు
మీకు ఇంతకుముందుకన్నా ధైర్యం పెరిగిందని వసు అంటే..ఇంతకు ముందు ఇలా లేనా అని అడుగుతాడు. గతంలో జింటిల్మెన్ రేషియో ఎక్కువ లవర్ బాయ్ రేషియో తక్కువ ఉండేది..కానీ ఇప్పుడు రివర్సైంది అంటుంది. ఎక్కడికి అని అడగవా అని రిషి అంటే..అడిగినా కూడా మీరు చెప్పరు కదా ఎందుకు అడగడం అంటుంది. బాగా అర్థం చేసుకున్నావ్ అన్న రిషి..కాలేజీ దగ్గర కారు ఆపుతాడు. ఎందుకు ఇక్కడికి వచ్చాం అని అడిగితే..రా అంటాడు రిషి. ఈ మధ్య సర్ ప్రైజెస్ ఎక్కువైపోతున్నాయ్ అంటుంది వసుధార..

గుప్పెడంతమనసు మే 6 ఎపిసోడ్ 
కాలేజీ బయట నిల్చుని మాట్లాడుకుంటారు రిషి-వసుధార. కారు వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి రిషిని కత్తితో పొడవబోతాడు..అప్పుడు వసుధార అలా వెళ్దాం రండి సార్ అనడంతో ముందుకు కదులుతాడు రిషి.. పొడవబోయిన ఆ వ్యక్తి ముందుకు తూలి పడి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. మరోవైపు ఇంటి బయట శైలేంద్ర ఎవరికో డబ్బులివ్వడం చూస్తుంది జగతి. ఏదో అనుమానం మొదలువుతుంది.. రిషి ఇంటికి చేరుకోగానే పరుగున వెళ్లి హగ్ చేసుకుని ఏడుస్తుంది...ఏమైంది మేడం అని రిషి అడిగినా ఏడుస్తూ ఉండిపోతుంది జగతి... 

Published at : 05 May 2023 08:59 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial May 5th Episode

సంబంధిత కథనాలు

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

Gruhalakshmi May 31st: తులసి ప్లాన్ ఫెయిల్, నందుకి ఐదేళ్ల జైలు శిక్ష- దివ్యని ఇరికించేందుకు పక్కా స్కెచ్ వేసిన రాజ్యలక్ష్మి

Gruhalakshmi May 31st: తులసి ప్లాన్ ఫెయిల్, నందుకి ఐదేళ్ల జైలు శిక్ష- దివ్యని ఇరికించేందుకు పక్కా స్కెచ్ వేసిన రాజ్యలక్ష్మి

Krishna Mukunda Murari May 31st: కృష్ణ మీద అనుమానపడిన ముకుంద- తల్లికి తన ప్రేమ తెలిసిపోయిందని టెన్షన్ పడిన మురారీ

Krishna Mukunda Murari May 31st: కృష్ణ మీద అనుమానపడిన ముకుంద- తల్లికి తన ప్రేమ తెలిసిపోయిందని టెన్షన్ పడిన మురారీ

Brahmamudi May 31st: కావ్యనా మజాకా, రాహుల్ గుట్టు సంపాదించేసింది- ఇక వెన్నెలతో నిశ్చితార్థం అవుట్

Brahmamudi May 31st: కావ్యనా మజాకా, రాహుల్ గుట్టు సంపాదించేసింది- ఇక వెన్నెలతో నిశ్చితార్థం అవుట్

Guppedanta Manasu May 31st: శైలేంద్రకు జ‌గ‌తి స్ట్రాంగ్ వార్నింగ్‌ - రిషిని కలిశాక మహేంద్రకు నిజం తెలుస్తుందా!

Guppedanta Manasu May 31st: శైలేంద్రకు జ‌గ‌తి స్ట్రాంగ్ వార్నింగ్‌ - రిషిని కలిశాక మహేంద్రకు నిజం తెలుస్తుందా!

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!