Guppedanta Manasu May 4th: వసు-జగతిని టార్గెట్ చేసిన శైలేంద్ర, అడుగడుగునా చెక్ పెడుతున్న రిషి!
Guppedantha Manasu May 4th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు మే 4 ఎపిసోడ్
డాక్టర్ మేక్స్ డాక్టర్ అనే థీమ్ తో చాలామంది డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను..మనదేశంలో ఎంతోమంది సెటిలైన డాక్టర్స్ ఉన్నారు.. వాళ్లు ఒక్కొక్కరు ఓక్కో పేద విద్యార్థిని సపోర్ట్ చేస్తే చాలన్నాను..అందుకు అందరూ సరే అన్నారు.. కచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నారని రిషి తన ఆలోచన చెబుతాడు. ప్రతీ స్టూడెంట్ ని ఓ డాక్టర్ చదివించాలి ఇది స్పాన్సర్ చేయడం కాదు సపోర్ట్ అని ముగిస్తాడు. రిషి చెప్పింది విని బోర్డులో సభ్యులంతా మెచ్చుకుంటారు. డాక్టర్స్ మేక్స్ డాక్టర్ అనే క్యాప్షన్ అద్భుతంగా ఉందంటుంది జగతి... ఫణీంద్ర, మహేంద్ర కూడా మెచ్చుకుంటారు. శైలేంద్ర మాత్రం కుళ్లుకుంటాడు. ఇక్కడ సెటిలైన డాక్టర్స్ సపోర్ట్ మాత్రమే కాకుండా ఫారిన్లో సెటిలైన డాక్టర్స్ సపోర్ట్ కూడా ఉంటే బావుంటుందని వసుధార చెబుతుంది. ఆల్రెడీ అదే పనే ఉన్నానంటాడు రిషి. ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ ప్లాన్ గురించి మీడియాకు తెలియడంతో డీబీఎస్టీ కాలేజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తారంతా. ఈ న్యూస్ అంతా పాకడంతో అందరూ ఫోన్ చేసి రిషిని అభినందిస్తుంటారు. రిషిని అంతా ఆకాశానికి ఎత్తేయడం చూసి కోపంతో రగిలిపోతుంటాడు శైలేంద్ర. ఏదోకటి చేయాలనుకుంటాడు..
Also Read: వసుని బుజ్జగించిన ఈగో మాస్టర్, మెడికల్ కాలేజీ విషయంలో శైలేంద్ర షాకిచ్చిన రిషి!
వసుధార-జగతి ఇద్దరూ కలసి రిషి సార్ గ్రేట్ అని అంటుంటారు. మహేంద్ర సార్ సంతోషం చూడండి అని వసుధార అంటే.. కొడుకు అభివృద్ధిలోకి వస్తే ఏ తండ్రికి సంతోషంగా ఉండదు అంటుంది జగతి. ఇద్దరూ రిషిని పొగుడుతూ ఉంటారు...అవన్నీ విని కోపంతో బయటకు వచ్చిన శైలేంద్ర... గ్రేట్ కాదు వరస్ట్ అని నిరూపిస్తా.. ఎవరైతే బ్రహ్మరథం పడుతుంటారో వారి చేతే రాళ్లు విసిరేలా చేస్తా అనుకుంటాడు.
శైలేంద్ర: రిషికి చాలా మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ తమ ఫ్యామిలీ మెంబర్‌లాగా, సొంత బ్రదర్‌లా చూస్తున్నారు. తను హీరో అయిపోయాడు. రిషిని కాకుండా ఆ స్థానంలో వేరొకరిని ఊహించలేరు.. కానీ ఆ స్థానం నాకు కావాలి అనుకుంటూ ఫోన్ తీసి సౌజన్యారావుకి కాల్ చేస్తాడు. అంతా గమనించాను.. ఎలా, ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో ఆలోచించాను. నువ్వు వచ్చే సమయం ఆసన్నమైంది. చెప్పినప్పుడు సిద్ధంగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
శైలేంద్ర-జగతి
అప్పుడే ఎంట్రీ ఇచ్చిన జగతి..ఎక్స్‌క్యూజ్ మీ అంటూ శైలేంద్రను పలకరిస్తుంది.
శైలేంద్ర: మీరా పిన్నీ అని పలకరిస్తాడు
జగతి: ఇక్కడ కూర్చున్నావేంటి
శైలేంద్ర:కాసేపు ఒంటరిగా కూర్చోవాలనిపించిందని, అందుకే కూర్చున్నాను. మీకేమైనా అభ్యంతరమా లేక ఎండీ గారి పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా ఎంతైనా నేను గెస్టును కదా అని వెటకారంగా మాట్లాడతాడు
జగతీ: నువ్వు గెస్టువేంటి శైలేంద్ర.. నువ్వు ఈ కాలేజ్ ఎండీ రిషి అన్నవి.. అలా అని నువ్వు అనుకోవడం లేదా ఏంటి
శైలేంద్ర: ఎందుకు అనుకోను...అంతటితో సరిపెట్టుకోమంటారా ఏంటి.. ఎనీ వే రిషి సకెస్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాడి విజయానికి కారణమేంటాని ఆలోచిస్తే మీరు, వసుధార సపోర్ట్‌గా ఉండి వాడికి బలాన్నిస్తున్నారని చెబుతాడు.
జగతి: పొరపాటుగా ఆలోచిస్తున్నావ్ శైలేంద్ర..అతడే మాకు శక్తి.. తన ఆలోచనలతో తనంతటా తాను ఎదిగిన ఓ చెట్టు లాంటి వాడు. తనకు వేర్లే కానీ.. కొమ్మలు కావు. మేము కొమ్మలు లాంటివాళ్లమని చెబుతుంది.
ఇంతలో రిషి వచ్చి దేని గురించి మాట్లాడుకుంటున్నారు.. కాలేజ్ గురించా అని అడుగుతారు
శైలేంద్ర: పిన్నికి నీ గురించి మాట్లాడితే వచ్చే ఆనందం.. ఇంక దేని గురించి రాదు . కరెక్టేనా పిన్ని అనగా..
శైలేంద్ర: చాలా కరెక్టుగా చెప్పావ్ శైలేంద్ర. నాకు రిషి, కాలేజ్ రెండు వేర్వేరుగా కనిపించవు
ఇంతలో రిషి కలగజేసుకుంటూ బిల్డింగ్ వర్క్ గురించి డిస్కస్ చేద్దామని పిలుస్తాడు. దీంతో శైలేంద్ర నాకు తెలిసిన ఓ బిల్డర్ ఉన్నాడు.. పిలవమంటావా అని శైలేంద్ర అనగా.. పిలువు అన్నయ్య అని రిషి అంటాడు. ఎందుకు రిషి.. పాత బిల్డరు ఉన్నాడుగా అతడినే సంప్రదించవచ్చుకదా అని అంటుంది. లేదు మేడమ్ అన్నయ్యకు తెలిసిన వ్యక్తి అయితే నమ్మకంగా పనిచేస్తాడు కదా అని జగతీతో అంటాడు.
Also Read: బుధుడు-శుక్రుడు కలయికతో అరుదైన యోగం, ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం
ఇంట్లో రిషి-వసు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు.
శైలేంద్ర: వసుకు పని భారం ఎక్కువవుతుందని, కాస్త నాకు కూడా ఇవ్వు అంటాడు.
రిషి : ఎవరిని గురించి ఏం మాట్లాడుతున్నావ్.. ఎంతటి కష్టమైన పనైనా వసు సునాయసంగా చేసేస్తుందని వసు గురించి పొగడ్తలు కురిపిస్తాడు. ఈ విషయంలో మనం వసుధార గురించి కంగారు పడాల్సిన పనిలేదు అంటాడు.
శైలేంద్ర: నాకు ఏదైనా పని ఇవ్వు అంటే నీకెందుకులే అన్నయ్యా అంటాడు.. ఖాళీగా ఉంటే నాకు ఏవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని, నాకు ఏదైనా పని ఇవ్వమని శైలేంద్ర పదే పదే అడుగడంతో సరే అంటాడు రిషి. ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ పక్కాగా అమలు కావాలని రిషి అంటే.. అది చాలా కష్టం రిషి.. మెడికల్ కాస్ట్‌లీ విద్య అది నువ్వెలా ఫ్రీగా ఇస్తావ్
రిషి: నేను ఆల్రెడీ చెప్పానుగా డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అనే మార్గం ఉంది కదా
శైలేంద్ర: లేదు రిషి..మాట వరుసకు అంటారు కానీ.. చేసేటప్పుడు వెనకడుగు వేస్తారు
రిషి: లేదు అన్నయ్య నేను చాలా మందితో మాట్లాడాను వారందరూ నన్ను మెచ్చుకున్నారు. ఇది సాధ్యపడుతుంది, మీరు వర్రీ కావొద్దని.. అవన్నీ నేను చూసుకుంటాను
శైలేంద్ర: నువ్వు అనుకున్నది చేయి.. మేమంతా నీ వెనకే ఉంటాము అంటూ నటన మొదలుపెట్టి..రేయ్ రిషి నువ్వు ఇక్కడే దొరికిపోయావు.. నువ్వు పేదవారికి ఫ్రీ ఎడ్యూకేషన్ ఇద్దామనుకుంటున్నావ్.. నేను అదే అవకాశంగా మార్చుకుంటాను అని అనుకుంటాడు.
ఇంతలో ఫైల్ తీసుకుని జగతీ ఎంట్రీ ఇస్తుంది. రిషి ఇప్పుడే ఎందుకు వాటన్నింటి గురించి మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. ఇందుకు శైలేంద్ర.. జగతీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఏమైంది పిన్ని అని ప్రశ్నిస్తాడు
జగతి: ఏం లేదు శైలేంద్ర నీకు ఈ ఫీల్డ్‌లో అనుభవం లేదు కదా.. ఇప్పుడే చెప్పడం ఎందుకు? మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత తెలుసుకుంటే బాగుంటుంది
శైలేంద్ర: అదేముంది పిన్ని రిషి అన్నీ అర్థమయ్యేలా చెబుతాడు అంటూనే...పిన్నికి నువ్వంటే చాలా ఇష్టమని రిషికి పదే పదే గుచ్చుకునేలా మాట్లాడుతాడు. శైలేంద్ర ఆంతర్యం వసు-జగతీలకు అర్థమవడంతో అనుమానంగా చూస్తుంటారు.నీ ఆనందమే పిన్ని సంతోషం, ప్రతి విషయంలోనూ నీకు వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తుంది. కొడుకు చేత అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాట పడుతుంది తల్లి మనసు అంటాడు
జగతీ-వసు కంగారు పడుతుంటారు. పిన్నిని నువ్వు మేడమ్ అని పిలవడం నాకు నచ్చలేదు రిషి.. తనను నువ్వు అమ్మ అని పిలవొచ్చు కదా అని రిషికి సూచిస్తాడు శైలేంద్ర.
జగతీ : శైలేంద్ర ప్లీజ్ ఈ విషయంలో రిషిని ఇబ్బంది పెట్టవద్దు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
శైలేంద్ర కూడా రిషికి సారి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు