News
News
వీడియోలు ఆటలు
X

Budh Shukra Yuti 2023: బుధుడు-శుక్రుడు కలయికతో అరుదైన యోగం, ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం

గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Budh Shukra Yuti 2023:  భారతీయ జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం తమ రాశిని మార్చుకుంటూ ముందుకు సాగుతుంది. గ్రహాలు రాశి మారిన ప్రతీసారీ ఆ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి ప్రతికూల ఫలితాలుంటే మరికొందరికి అనుకూల ఫలితాలుంటాయి. మే 2 న శుక్రుడు రాశిమారడంతో ఇప్పటికే మిథునంలో ఉన్న బుథుడితో కలసి సంచరిస్తున్నాడు. మిథునంలో బుధుడు మరియు శుక్రుడి కలయిక వల్ల దాదాపు 26 రోజుల పాటూ కొన్ని రాశులవారికి విశేష ఫలితాలు, మరికొన్ని రాశులవారికి సాధారణ ఫలితాలున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి, మిథున రాశి, కన్యారాశి వారికి విశేష ఫలితాలుండగా.. మేషరాశి, సింహ రాశి, తులా రాశి, మీనరాశి వారికి సాధారణ ఫలితాలున్నాయి. 

మేష రాశి

మిథునరాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వీరు చాలా డబ్బును పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆనందంగా ఉంటారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బు ఆదా చేస్తారు..నూతన పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతారు   కెరీర్ లో కొన్ని మంచి ఆఫర్లు వస్తాయి. భాగస్వామ్యంతో పనిచేయడం ద్వారా విజయం సాధిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.

Also Read: మే 3 రాశిఫలాలు, ఈ రాశివారు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు బాధపడతారు

మిథున రాశి

మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ యోగా కొత్త కెరీర్లో కొత్త మార్గాలను తెరుస్తుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వ్యక్తిగత జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది గొప్ప సమయం కాబోతోంది. మీరు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. మీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షణ పెరుగుతుంది.

సింహ రాశి

ఈ రాశివారికి లక్ష్మీనారాయణ యోగం కాదుకానీ..మిథునంలో శుక్రుడి సంచారం శుభఫలితాలనిస్తుంది. ఉద్యోగులు పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షలు, ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉండేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. 

కన్యా రాశి

లక్ష్మీనారాయణ యోగం కన్యారాశివారి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. భౌతిక సుఖాలు పొందుతారు. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: మే 5న చంద్రగ్రహణం - ఈ రాశులవారి మనసు అస్థిరంగా ఉంటుంది

తులా రాశి

తులారాశికి  శుక్రుడు అధిపతి..అందుకే వీరికి లక్ష్మీనారాణ యోగం లేకపోయినా శుక్రుడి సంచారం ప్రయోజనాలనిస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయ. మీరు కోరుకున్నది లభిస్తుంది. 

మీన రాశి

ఈ రాశివారికి కూడా శుక్రుడి సంచారం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దాంపత్య జీవితం బావుంటుంది. మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. 

బుధుడు-శుక్రుడిది సానుకూల కలయిక..ఎందుకంటే రెండు గ్రహాలు ఒకదానికొకటి స్నేహపూర్వకంగా ఉంటాయి, కళాత్మక ధోరణిని సూచిస్తాయి. అలాంటి సంయోగం కొన్ని రాశులపై మంచి ఫలితాన్నిస్తుంది. ఈ సమయంలో అందమైన దుస్తులు ధరించాలనుకుంటారు, మాటల్లో చేతల్లో చురుకుదనం కలిగిఉంటారు. వీరి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. జాతకంలో శుక్రుడు బుధునితో కలిసి ఉన్నప్పుడు, అది ఆర్థిక పరంగా, వృత్తి పరంగా అభివృద్ధి చెందేందుకు పుష్కరలమైన అవకాశాలనిస్తుంది.  టెక్నాలజీ, గణితం, సైన్స్, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల్లో మంచి పట్టు ఉండే అవకాశం ఉంది. శుక్రుడు , బుధుడు ఒకేరాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశులవారికి సంగీతం, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Published at : 03 May 2023 04:18 PM (IST) Tags: Zodiac Budh Shukra Yuti 2023 Budh shukra yuti spiritual astro budh grah shukra grah Lakshmi Narayan yoga in Gemini

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు