మే 3 రాశిఫలాలు, ఈ రాశివారు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు బాధపడతారు
Rasi Phalalu Today 3rd May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 3 రాశిఫలాలు: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు శుభప్రదం. నిలిచిపోయిన పనులు పూర్తి చేయడం సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉండవచ్చు. ఎలాంటి సంక్షోభం నుంచి అయినా విముక్తి లభిస్తుంది. కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మే 3 తేదీన ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో ఏదో ఒక విషయంలో గొడవపడతారు. సేవాకార్యక్రమాలకు సమయం వెచ్చిస్తారు.
వృషభ రాశి
ఈ రాశివారికి పురోభివృద్ధి దారులు తెరుచుకోనున్నాయి. మీరు మీ కుటుంబ సభ్యునికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. లావాదేవీకి సంబంధించిన విషయం చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే..మీ స్నేహితుల సహాయంతో వాటిని పూర్తిచేయడం మంచిది. సామాజిక రంగాలలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
మిధున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు ప్రారంభం అద్భుతంగా ఉండబోతుంది. కానీ జీవిత భాగస్వామితో అనవసర వివాదానికి దిగొద్దు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. శుభవార్తలు వినే అవకాశం ఉంది.
Also Read: మే 5న చంద్రగ్రహణం - ఈ రాశులవారి మనసు అస్థిరంగా ఉంటుంది
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మంచిరోజు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఆదాయంలో పెరుగుదలతో మీరు సంతోషంగా ఉంటారు .. కానీ.. ఖర్చులు కూడా తగ్గించినప్పుడే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. పొదుపు పథకాలపై దృష్టి సారించాలి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో అలసత్వం వద్దు.
సింహ రాశి
ఈ రాశివారు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. చట్టపరమైన విషయంలో మీకు ఎవరితోనైనా విభేదాలు ఉండవచ్చు. బంధువులతో వివాదం పెట్టుకోవద్దు. మీకు కష్టకాలంలో స్నేహితుల నుంచి మద్దతు ఉంటుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. ఒకేసారి చాలా పనులు ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. అప్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని పనుల్లో చొరవ తీసుకునే మీ అలవాటు ఈరోజు మీకు హాని కలిగిస్తుంది. మీరు పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు . మీ చుట్టూ ఉండేవారిలో మీకు ద్రోహం చేసేవారున్నారు జాగ్రత్తపడండి.
Also Read: మే నెలలో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు సాధారణంగానే ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కెరీర్‌కు సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే..ఆ విషయంలో మీరు అనుభవజ్ఞులను సంప్రదించాలి. కార్యాలయంలోని అధికారుల నుంచి శుభవార్తలు వింటారు
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. పనిచేసే ప్రదేశంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు. మానసిక సమస్యలు ఉండవచ్చు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదం. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంటుంది. మీ మనసులో ఉన్న మాటను మీ జీవితభాగస్వామితో షేర్ చేసుకోండి. పని ప్రాంతంలో బాధ్యతల గురించి జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
మకర రాశి వారికి రోజు ప్రారంభం బలహీనంగా ఉంటుంది కానీ రోజు గడిచేకొద్దీ ప్రశాంతత పెరుగుతుంది. మీరు ఈ రోజు ఏదైనా చట్టపరమైన విషయంలో తప్పనిసరిగా అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించినట్లయితే మీకు మంచి జరుగుతుంది. సన్నిహితులతో మీ సమస్యను షేర్ చేసుకోండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు సమస్యాత్మకమైన రోజు కావచ్చు. మీ గతంలో చేసిన కొన్ని తప్పుల గురించి ఇప్పుడు చింతిస్తారు. బాధ్యత తెలుసుకుని వ్యవహరించండి. మీ పని ఏదైనా చాలా కాలం పాటు నిలిచిపోయినట్లయితే అది ఈరోజు పూర్తవుతుంది. ధన సంబంధిత సహాయం తీసుకోవలసి రావచ్చు.
మీన రాశి
మీన రాశికి చెందిన వారు ఈ రోజు వారి వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు, దీని కోసం వారు వారి బంధువుల నుంచి సహాయం తీసుకోవలసి ఉంటుంది. మీ పిల్లల చదువుల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ఆగిపోయిన మీ పనులు ఈరోజు పూర్తవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి.