అన్వేషించండి

Monthly Horoscope May 2023: మే నెలలో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది

Rasi Phalalu May 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Monthly Horoscope May 2023:  మే నెలలో  ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...

మేష రాశి

మేష రాశివారికి మే నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. జన్మరాశిలో గ్రహసంచారం వల్ల ఆరోగ్య సమస్యలుంటాయి. ఈ నెలలో మేష రాశివారు తమ పనిలో విజయం సాధిస్తారు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. నలుగురి మధ్యా గౌరవం పొందుతారు. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది.నూతన ఆదాయ మార్గాలు ఉంటాయి. ఖర్చులు నియంత్రించాలి

వృషభ రాశి

వృషభ రాశి వారికి సంవత్సరంలో ఐదో నెల మిశ్రమంగా ఉంటుంది. అదృష్టం అంతగా కలసిరాదు. డబ్బు సంపాదనలో ఇబ్బందులు ఎదురవుతాయి, ఖర్చులు పెరుగుతాయి, ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతుంది. కెరీర్లో కొత్త ఛాలెంజ్ తో అడుగేస్తే విజయం అందుకుంటారు. అనుకున్నది సాధించడానికి మరింత కష్టపడాలి. ఈ నెలలో ఒడిదొడుకులు పెరుగుతాయి. బంధుమిత్రులతో విరోధాలు, నమ్మినవారి చేతిలో మోసంపోవడం ఉంటుంది

మిథున రాశి

మిథున రాశి వారికి మే నెల శుభప్రదంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది. డబ్బు సంపాదించేందుకు చాలా అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగం సంతోషాన్నిస్తుంది. మే 15 తర్వాత పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఉద్యోగం ద్వారా విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా సఫలం అవుతుంది. ఆరోగ్యం కోసం ధనాన్ని ఖర్చుచేస్తారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతారు.

Also Read: 'మే' నెలలో మొదటి వారం ఈ రాశులవారు నిర్లక్ష్యంగా ఉంటే సక్సెస్ దూరమైపోతుంది

కర్కాటక రాశి

ఈ రాశి వారికి మే నెలలో ఒడిదొడుకులు తప్పవు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి...కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది.ప్రయాణాలకు అదనపు ఖర్చు అవుతుంది. ఏ విషయంలోనూ నిర్లక్ష్యం వహించవద్దు. భాగస్వామ్యం వ్యాపారంలో సమస్యలుంటాయి. ఈ నెలలో కుటుంబంలో కలహాలు తలెత్తే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశి వారికి మే నెల  బాగా కలిసొస్తుంది. ఈ మాసం ఆర్థిక లాభం ఉంటుంది. నూతన వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. ఈ మాసం మీకు శుభప్రదంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు కలిసొస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి మే నెల సాధారణంగా ఉంటుంది. వృత్తిలో విజయం సాధిస్తారు. ఆర్థికపరంగా మంచి సంకేతాలున్నాయి. డబ్బు పొదుపు చేయడం కొంచెం సవాలుతో కూడుకున్నది అవుతుంది. కడుపునొప్పి సమస్య వేధిస్తుంది. నూతన పనులు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ సమస్యలను కూడా అధిగమించాల్సి ఉంటుంది.

Also Read: ఈ వారం ఈ రాశులవారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది, ఇలా అనుకుంటే అలా అవుతాయ్ అన్నీ!

తులా రాశి

తులా రాశివారికి ఈ వారం సవాలుగా ఉంటుంది. సీనియర్ అధికారులు మీ సహనాన్ని చాలా పరీక్షిస్తారు. అయినప్పటికీ ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది, వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యంలో ప్రయోజనం ఉంది, కానీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి 

ఈ రాశి వారు ఈ మాసంలో పెద్ద కుటుంబ బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. సంబంధాలు మిశ్రమంగా ఉంటాయి. పనిని సకాలంలో పూర్తి చేయకపోవడం మీకు మంచిదికాదు. ఉద్యోగంలో మార్పు, వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు మబ్బులు విడినట్టు విడిపోతాయి

ధనుస్సు రాశి 

ధనుస్సు రాశి వారికి  మే నెల మేలు చేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

మకర రాశి

మే నెలలో మకర రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి.  సౌకర్యాలు కూడా తగ్గుతాయి. మీరు డబ్బు సంపాదనలో తొందరపాటును ప్రదర్శిస్తే నష్టపోతారు.  వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్యంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆస్తి విషయంలో కుటుంబంలో వివాదం తలెత్తవచ్చు. సంతానం వల్ల సంతోషం ఉంటుంది.

కుంభ రాశి

సంవత్సరంలో ఐదో నెలలో కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయానికి లోటుండదు కానీ ఖర్చులు పెరుగుతాయి, ఆధ్యాత్మిక పనుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. డబ్బు సంపాదనలో ఇబ్బందులు ఉండవచ్చు. ఆరోగ్య పరంగా ఒత్తిడికి గురవుతారు. 

మీన రాశి 

మీన రాశి వారికి ఈ నెలలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల డబ్బు ఆదా చేయడం కష్టమవుతుంది. పనిప్రాంతంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి.ఉద్యోగ మార్పులతో పాటు కెరీర్ లో ఒడిదొడుకులు ఎదురవుతాయి. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఒత్తిడి ఉండవచ్చు, వైవాహిక జీవితం బాగుంటుంది. కానీ కుటుంబంలో అనవసర వివాదాలు తలెత్తవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Tesla Y in india: ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Rambha: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget