News
News
వీడియోలు ఆటలు
X

Weekly Horoscope 01-07 May 2023: ఈ వారం ఈ రాశులవారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది, ఇలా అనుకుంటే అలా అవుతాయ్ అన్నీ!

Weekly horoscope 1 to 7 May : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope 01-07 May April 2023: మే నెలలో మొదటి వారం ఈ రాశులవారికి శుభ ఫలితాలున్నాయి...

మిథున రాశి

ఈ వారం ప్రారంభం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కార్యాలయంలో వర్కర్లు, సీనియర్లు, జూనియర్ల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. దాని వల్ల మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవారు కూడా బయటపడతారు. అనుకున్న పనిని సకాలంలో పూర్తిచేయడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచైనా పెద్ద మొత్తంలో డబ్బు లభించే అవకాశం ఉంది.  దీర్ఘకాలంగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. కోర్టు-కోర్టు వెలుపల భూ-భవన వివాదం పరిష్కారం అవుతాయి. వారం మధ్యలో పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద విజయం మీ సంతోషాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు..వారి సహాయంతో భవిష్యత్తులో ఒక పెద్ద ప్రయోజనకరమైన పథకంలో చేరే అవకాశం లభిస్తుంది. ప్రేమ బంధంలో మాధుర్యం ఉంటుంది. ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

Also Read: మే మొదటివారం చంద్రగ్రహణం, ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి

తులా రాశి

ఈ రాశివారికి వారం ప్రారంభంలో సంతోషం ఉంటుంది. చాలా కాలంగా మీ వృత్తి వ్యాపారంలో మంచి సమయం కోసం వేచి ఉంటే త్వరలో మంచి ఫలితాలొస్తాయి. పలుకుబడి ఉన్న వ్యక్తి లేదా స్నేహితుడి సహాయంతో జీవనోపాధి కోరిక నెరవేరుతుంది. వ్యాపార విస్తరణకు సంబందించిన ప్రణాళిక రూపొందిస్తారు. వారం మధ్యలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఆస్తి క్రయవిక్రయాలలో లాభాలు ఉంటాయి. మీరు చాలా కాలంగా మీ ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తుంటే వారాంతంలో మీకు ఎక్కడి నుంచైనా మంచి ఆఫర్ లభిస్తుంది. పోటీ  పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొన్ని ఆహ్లాదకరమైన వార్తలు లభిస్తాయి. సంతానం సాధించిన విజయం కుటుంబంలో సంతోషానికి పెద్ద కారణం అవుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

ఈ రాశివారు వారం ప్రారంభంలో మీరు అనుకున్న పనిని పూర్తి చేయడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆఫీసులో తరచూ మీ పనికి ఆటంకం కలిగించే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. మీరు కోరుకున్న చోట బదిలీ లేదా ఉద్యోగం మార్చడానికి ప్రయత్నిస్తుంటే, దీని కోసం మీరు మరికొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. కోర్టులో నడుస్తున్న కేసులను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది..పొడిగిస్తే మీరే నష్టపోతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయం సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇతరుల నుంచి అప్పులు అడగకుండా తెలివిగా డబ్బు ఖర్చు చేయాలి. మంచి ప్రేమ సంబంధాన్ని కొనసాగించాలంటే తొందరపాటు తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో వివాదం ఉండవచ్చు, అటువంటి పరిస్థితిలో వివాదానికి బదులుగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి..లేకపోతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవు.

ధనుస్సు రాశి

వారం ప్రారంభంలో, ఏదైనా పని చేసేటప్పుడు సహనం పాటించడం చాలా అవసరం. మీరు పెద్ద స్కీమ్ లేదా ప్రాపర్టీ క్రయవిక్రయాలలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి.ఉద్యోగస్తులు కార్యాలయంలో దాగివున్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి..పని విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా బాస్ ఆగ్రహానికి గురికాకతప్పదు. వారం మధ్యలో అకస్మాత్తుగా స్వల్ప లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదైనా ధార్మిక లేదా శుభకార్యంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి, మీ సంబంధంలో నిజాయితీగా ఉండండి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మీ జీవిత భాగస్వామి కోసం కొన్ని క్షణాలు కేటాయించండి.

Also Read: వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగిన స్థలాలు అస్సలు కొనకూడదు

మకర రాశి 

మకర రాశివారికి వారం ప్రారంభంలో ఊహించిన దానికంటే కొంచెం తక్కువ విజయం ఉంటుంది. మీరు స్నేహితులు,కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు పొందుతారు..కష్టమైన పనులు సులభంగా పూర్తిచేస్తారు. ఈ రాశివారు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే భావోద్వేగాలు లేదా కోపంతో ఈ ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం సరిగా లేకపోవడం మీకు ఆందోళన కలిగిస్తుంది. మీరు డబ్బు కొరతను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్థులు ఆశించిన విజయాన్ని సాధించడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాల దృష్ట్యా ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు జీవిత భాగస్వామి మీతో అంచెలంచెలుగా నడుస్తారు.

మీన రాశి

ఈ రాశివారికి వారం ప్రారంభం అంతా మంచి జరుగుతుంది. ఒక పెద్ద విజయం మీ ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ ప్రభావంతో  కార్యాలయంలో మీ ఉత్తమమైన పనిని  ఇవ్వగలుగుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయవనరులు అందుబాటులోకి వస్తాయి...కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.  మీరు చాలా కాలంగా మీ పూర్వీకుల వ్యాపారాన్ని కొనసాగించాలని ఆలోచిస్తుంటే..ఇప్పుడు ముందడుగు వేయండి. ఆస్తి సంబంధ సమస్యలు పరిష్కారమైనప్పుడు ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయ నాయకులకు ఈ వారం శుభసమయం...దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Published at : 30 Apr 2023 06:01 AM (IST) Tags: Horoscope Weekly Horoscope Saptahik Rashifal rashifal weekly horoscope in telugu saptahik rashifal 1 to 7 may 2023

సంబంధిత కథనాలు

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!