అన్వేషించండి

Chandra Grahan 2023: మే మొదటివారం చంద్రగ్రహణం, ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి

Lunar Eclipse 2023 in india: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Chandra Grahan 2023:  శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది. ఆరోజు వైశాఖ పౌర్ణమి.  చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటుంది. మే 5న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంది. గ్రహణం సమయంలో ఆయా రాశులపై ఉండే ప్రభావం దాదాపు 15 రోజులు ఉంటుంది.

మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేష రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహణం చూడకూడదు.  అలాగే చంద్రగ్రహణం ప్రారంభం నుంచి 15 రోజులపాటు వీరికి ఆస్థితిలో మార్పుల కారణంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోతారు. అపరిచితులకు అప్పు ఇవ్వవద్దు. రిస్కీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. గ్రహణం రోజున శివ పంచాక్షరి పఠించాలి..చీమలకు పంచదార వేయాలి.

Also Read: మే 5న చంద్ర గ్రహణం, భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుంది

కర్కాటక రాశి (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశి కూడా చంద్రగ్రహణం వల్ల చాలా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.  అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు వచ్చే ప్రమాదం ఉంది.  ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇతరులతో వివాదాలకు వాదనకు దిగవద్దు. అనవసర విషయాలతో జోక్యం చేసుకోవద్దు. గ్రహణం అనంతరం ఆంజనేయ స్వామి గుడిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి.  

తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

తులా రాశి వారు కూడా చంద్రగ్రహణం రోజు దూర ప్రయాణాలు చేయవద్దు. అంతేకాదు.. చంద్రగ్రహణం తర్వాత 15 రోజుల పాటు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీటు బెల్టు లేకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దు. ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. గ్రహణం అనంతరం శివాలయానికి వెళ్లి పాలాభిషేకం చేయండి. 

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాాదాలు)

మకర రాశి వారు చంద్రగ్రహణం రోజు నీటిలో ప్రయాణానికి దూరంగా ఉండాలి. చంద్రగ్రహణం అనంతరం 15 రోజులపాటు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ ఉండేవారే మోసం చేసే ప్రమాదం ఉంది జాగ్రత్త. ముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండండి.  ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.  గ్రహణం అనంతరం అమ్మవారి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టండి.  

Also Read: ఏప్రిల్ ఆఖరి వారం 7 రాశులవారికి అద్భుతం - 5 రాశులవారికి కొంత నిరుత్సాహం!

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాాదాలు)

కుంభ రాశివారు కూడా గ్రహణం రోజు నుంచి రెండు వారాల పాటు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ఆలోచన  ఫలిస్తుంది. భార్య భర్తల మధ్య అనుమానాలు తలెత్తే అవకాసం  ఉంది..జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చదవడం మంచిది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Embed widget