News
News
వీడియోలు ఆటలు
X

వారఫలాలు ( ఏప్రిల్ 24 నుంచి 30 ): ఏప్రిల్ ఆఖరి వారం 7 రాశులవారికి అద్భుతం - 5 రాశులవారికి కొంత నిరుత్సాహం!

Weekly Rasi Phalalu ( April 24 to 30) : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope ( April 24 to 30):   ఏప్రిల్ ఆఖరి వారంఏ రాశులవారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

మేష రాశి

ఏప్రిల్ చివరి వారం ఈ రాశివారికి శుభదాయకంగా ఉంది. గడిచిన వారంకన్నా ఈ వారం మీరు చేసే ప్రయత్నాలు మరింత విజయవంతమవుతాయి మరియు మంచి ఫలితాలను ఇస్తాయి. అయినప్పటికీ జీవితానికి సంబంధించిన సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ వారం ప్రారంభంలో ఉద్యోగులు...సీనియర్లు , జూనియర్ల నుంచి పూర్తి మద్దతు పొందుతారు..ఇది చూసుకుని మీలో గర్వం పెరగకూడదని గుర్తుంచుకోండి. వారం మధ్యలో కెరీర్-వ్యాపారానికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలనిస్తాయి. వ్యాపార సంబంధ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పరీక్ష-పోటీలకు సిద్ధమయ్యే విద్యార్థులకు వారం చివరి నాటికి కొన్ని శుభవార్తలు అందుతాయి. చిన్నచిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సూర్యభగవానుడిని ప్రార్థిస్తే మీకు ఇంకా మంచి జరుగుతుంది. 

వృషభ రాశి

ఈ వారం వృషభరాశివారు అత్యుత్సాహంతో, తొందరపాటుతో ఏ పనీ చేయకూడదు. వృత్తి లేదా వ్యాపారం ఏదైనా సరే, దానికి సంబంధించిన  నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. భావోద్వేగాలు లేదా కోపం కారణంగా తీసుకున్న నిర్ణయం కారణంగా మీరు తర్వాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఈ రాశి ఉద్యోగులు పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రావాల్సిన డబ్బు రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. వారం రెండో భాగంలో వ్యాపారం పుంజుకుంటుంది. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా అడుగు వేయండి మరియు మీ ప్రేమ భాగస్వామి యొక్క భావాలను విస్మరించకుండా ఉండండి. ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. శివుడి స్త్రోత్రాలు పఠించండి. 

మిథున రాశి 

ఈ వారం ఈ రాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి..బాధ్యతలు పెరుగుతాయి.ఉద్యోగులకు కూడా కొత్త బాధ్యతలు పెరుగుతాయి...దానిని నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి..వారు మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. గృహ, కుటుంబ విషయాల్లో సామరస్యం నెలకొంటుంది. కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్న సమస్యలు స్నేహితుడు లేదా సమర్థవంతమైన వ్యక్తి ద్వారా పరిష్కారమవుతాయి. వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి ఆశించిన ప్రయోజనం లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు చాలా కాలంగా ఒక వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్టైతే..ఈ వారం చివరి నాటికి మీ కోరిక నెరవేరుతుంది. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. నిత్యం గణేష్ చాలీసా పఠించండి.

Also Read: మేషరాశిలో బుధుడు తిరోగమనం, 4 రాశులవారికి ఊహించనంత మంచి జరుగుతుంది!

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి..మాటల్లో, ప్రవర్తనలో వినయం చాలా అవసరం. చిన్న చిన్న విషయాల గురించి ఎవరితోనూ వాదించకండి, లేకపోతే అది మీ ఇమేజ్ ను దెబ్బతీస్తుంది. ఉద్యోగం మారాలని ప్రయత్నించినట్టైతే..ఈ వారం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి.ముందడుగు వేసినప్పుడు లాభనష్టాలు రెండింటినీ బేరీజు వేసుకోండి..లేదంటే తర్వాత చింతించవలసి ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. భూములు, భవనాల క్రయవిక్రయాలలో లాభాలు ఉంటాయి. వ్యాపారంలో లాభ, పురోభివృద్ధి అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఇంట్లోకి ప్రియమైన వారి రాకతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మనసులో ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం బావుంటుంది. శివ మంత్రాన్ని పఠించండి. 

సింహ రాశి

ఈ రాశివారికి ఈ వారం అదృష్టం బావుంది.  అకస్మాత్తుగా ధన ప్రయోజనాలు ఉండొచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. అదే సమయంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యాపారాన్ని విస్తరించాలన్న ప్రణాళిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఇలా చేసేటప్పుడు, మీరు మీ ప్రియమైన వారి పూర్తి సహకారం మరియు మద్దతును కూడా పొందుతారు. స్పెక్యులేటివ్ లేదా స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనాలను పొందుతారు. విదేశాల్లో వృత్తి లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తుంటే మీ మార్గంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ వారం విదేశీ మిత్రుడి సహాయంతో కొత్త కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగే అవకాశం లభిస్తుంది. వారం ద్వితీయార్థంలో సంతానానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాలకు ఈ వారం అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రతి రోజూ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

కన్యా రాశి

ఈ రాశివారికి ఈ వారం కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో, మీరు కొన్ని పెద్ద విషయాలలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.. బడ్జెట్ కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. ఈ వారం మీరు డబ్బు మరియు ఆరోగ్యం రెండింటినీ బాగా చూసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. పని విషయంలో ఎవ్వరితోనూ వాదించవద్దు. చిన్న చిన్న విషయాలను వదిలేసి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు స్థానమార్పు సూచనలున్నాయి. వారం ద్వితీయార్ధంలో, వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించి దీర్ఘ లేదా స్వల్ప దూర ప్రయాణాలు సాధ్యమవుతాయి. ప్రయాణ సమయంలో మీ ఆరోగ్యం మరియు లగేజీ రెండింటినీ జాగ్రత్తగా చూసుకోండి. ఈ వారం ప్రేమ భాగస్వామితో ఏదో విషయంలో వివాదం తలెత్తవచ్చు. వివాదాల ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా మనసు ఆందోళన చెందుతుంది.హనుమాన్ మంత్రం నిత్యం పఠించండి.

Also Read: అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!

తులా రాశి

తులా రాశివారికి ఈ వారం శుభదాయకంగా ఉంది. వారం ప్రారంభం నుంచీ మీరు తలపెట్టిన పనిలో ఆశించిన విజయం అందుకుంటారు.  ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులు వెతుక్కుంటారు. ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇది చాలా శుభ సమయం  కానీ ఒక ప్రణాళిక లేదా వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారం మధ్యలో చేసే వృత్తి-వ్యాపార ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సమర్థవంతమైన వ్యక్తి సహాయంతో, మీరు ప్రయోజనకరమైన పథకంలో చేరే అవకాశాన్ని పొందుతారు. అధికార-ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంటుంది. విదేశీ పని లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వారం ద్వితీయార్ధంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
ప్రతిరోజూ శివచాలీశా పఠించండి 

వృశ్చిక రాశి

ఈ వారం చివర్లో తీసుకునే నిర్ణయాల విషయంలో ఈ రాశివారు మరోసారి ఆలోచించడం మంచిది. ఇతరలను గుడ్డిగా నమ్మితే పెద్ద మోసానికి గురవుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఆర్థిక లావాదేవీలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుని ముందుకు సాగండి. ఉద్యోగులు తమ పనిని ఇతరులకు వదిలేయకుండా సొంతంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. వారం ప్రారంభంలో, పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. భూమి, భవనానికి సంబంధించిన వివాదానికి సంబంధించి కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వారం ప్రేమ సంబంధాలకు మిశ్రమంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. హనుమంతుడిని ఆరాధించండి. 

ధనుస్సు రాశి 

ధనస్సు రాశివారికి ఈవారం ఆశించిన పనిలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి.వ్యాపార విస్తరణ ప్రణాళికలు పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించిన ఏ కీలక నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారం అకస్మాత్తుగా పెద్ద లాభాలను పొందవచ్చు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు నెరవేరుతాయి.  మీ ఖ్యాతి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వారం ద్వితీయార్థంలో శుభవార్త అందుతుంది. అనుకున్న చోట బదిలీ లేదా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడం వల్ల మనసు సంతోషిస్తుంది. పరీక్ష-పోటీకి సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభసమయం. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది.   వివాహం చేసుకున్న వ్యక్తులు సంతోషంగా ఉంటారు. మహావిష్ణువును తులసీ దళాలతో ఆరాధించండి. 

మకర రాశి

మకర రాశివారు ఈవారం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వారం ప్రారంభంలో ఏదైనా అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.  పనుల్లో పెద్దగా అనుకూలత కనిపించదు. ప్లాన్ ప్రకారం అత్యవసం అయిన పనులు మాత్రమే చేపట్టండి. ఉద్యోగులకు ఈ వారం పనిభారం అధికమవుతుంది. మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలు ఇల్లు మరియు కార్యాలయం మధ్య సమతుల్యతను సాధించడం కష్టం కావొచ్చు. ఈ సమయంలో మీరు మీ పని చేసేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. వ్యాపారాలతో సంబంధం ఉన్నవారు కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కష్టకాలంలో మీ జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు. రోజూ శివమంత్రాన్ని పఠించండి. 

కుంభ రాశి

ఈ వారం కుంభ రాశివారు  తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. కొంతకాలంగా మీ జీవితంలో ఉన్న సమస్యలు ఇంకా తగ్గే అవకాశం లేదు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ వృత్తి లేదా వ్యాపారం మొదలైన వాటి గురించి చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఉద్యోగులు కూడా విధినిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాల్లో చిక్కుకున్న వారు కోర్టులవరకూ వెళ్లకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఎవ్వరిపైనా మాట తూలొద్దు.. మీరు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధంలో ప్రేమ భాగస్వామి యొక్క భావాలను విస్మరించవద్దు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం..మీ బిజీ సమయం నుంచి మీ జీవిత భాగస్వామి కోసం కేటాయించండి. హనుమంతుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. 

మీన రాశి 

మీన రాశివారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మీ వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించిన శుభవార్తను పొందుతారు. ఉద్యోగస్తులు పదోన్నతి లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు వెలుగొందుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పని పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు.  ప్రియమైన వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అకస్మాత్తుగా పిక్నిక్ పార్టీలు లేదా పర్యాటక కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. మార్కెట్లో మీ ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అందిస్తారు. గృహ సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ప్రేమ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. నిత్యం నారాయణ కవచం పఠించండి. 

Published at : 23 Apr 2023 06:02 AM (IST) Tags: aries weekly horoscope astrology predictions in telugu weekly predictions zodiac signs in telugu Every Zodiac Sign's Weekly horoscope Weekly Horoscope 24 April to 30 April 24 April to 30 april rashifalalu saptahik rashifal 24th to 30th april 2023

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా