Image Credit: Freepik
Chandra Grahan 2023: మే 5న ఏర్పడబోయే చంద్రగ్రహణం ఏ రాశులవారిపై ఎలాంటి ఫలితం చూపిస్తుందో ఇక్కడ తెలుసుకోండి
మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిచక్రంలోని ఏడవ ఇంట్లో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ ప్రభావంతో వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి ప్రమాద సూచనలున్నాయి.
వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి చంద్రగ్రహణం సమయంలో ఈ రాశివారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి. ఆగిపోయిన పనులు పూర్తిచేయగలుగుతారు. వివాదాలు, వ్యాజ్యాల నుంచి విముక్తి పొందుతారు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
మిథునరాశి వారికి ఈ గ్రహణం ఐదో స్థానంలో సంచరిస్తోంది. ఈ ప్రభావంతో మీ ఆలోచనలను ఉన్నతంగా ఎదగనివ్వండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల కారణంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది..ప్రయాణాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ రాశిచక్రంలోని నాల్గవ ఇంట్లో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీరు మీ కన్నవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చదువు, ఉద్యోగాల విషయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది.
సూర్యుడు సింహ రాశికి అధిపతి. ఈ రాశిలో మూడవ ఇంట్లో ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీరు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు కానీ అవన్నీ పరిష్కారం అవుతాయి. ఆర్థిక సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
Also Read: మే నెలలో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది
కన్యారాశి వారికి చంద్రగ్రహణం శుభప్రదమైన ఫలితాలనిస్తోంది. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయొద్దు.
తులా రాశివారు చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక , శారీరక స్థితి బలహీనంగా ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. చేయాల్సిన పనిలో నిర్లక్ష్యం వహించవద్దు. ప్రేమ సంబంధాల విషయంలో విఫలం అవుతారు.
వృశ్చికరాశి వారి మనస్సు చంద్రగ్రహణం సమయంలో అస్థిరంగా ఉంటుంది. కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ విషయాలలో సమస్యలు రావొచ్చు.
ధనుస్సు రాశివారికి గ్రహణం పదకొండో స్థానంలో ఏర్పడుతోంది. చంద్రుడు మీకు ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును, ఆనందాన్ని ఇస్తాడు. మీ స్థానం బలంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బావుంటుంది. గౌరవం పెరుగుతుంది.
మకర రాశి వారు చంద్రగ్రహణం సమయంలో రిస్క్ తీసుకోకూడదు. అడ్డంకులు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. స్నేహితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Also Read: 'మే' నెలలో మొదటి వారం ఈ రాశులవారు నిర్లక్ష్యంగా ఉంటే సక్సెస్ దూరమైపోతుంది
కుంభ రాశి వారికి తొమ్మిదో స్థానంలో ఏర్పడుతోంది చంద్రగ్రహణం. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనులను వాయిదా వేయవద్దు.
మీన రాశి వారికి ఈ గ్రహణం ప్రతికూలంగానూ, ప్రమాదకరంగానూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక, శారీరక సమస్యలు రావొచ్చు.
Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!
June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!
కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?
Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు