వారఫలాలు (1st to 7th May)



మేష రాశి
ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. మీ ప్రవర్తనపై చాలా నియంత్రణ అవసరం. చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటారు. ఆఫీసులో అనుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలంటే అందర్నీ కలుపుకుని పోవాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.



వృషభ రాశి
వారం ప్రారంభంలో ఒడిదొడుకులు ఉంటాయి. మీరు బాగా చేయలేని పనిని చేపట్టడం మానెయ్యడమే మంచిది..లేదంటే మీరు మీ ప్రియమైన వారినుంచి కూడా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు.



మిథున రాశి
ఈ వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కార్యాలయంలో అందరి నుంచి పూర్తి సహకారం ఉంటుంది. దాని వల్ల మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవారు కూడా బయటపడతారు. అనుకున్న పనిని సకాలంలో పూర్తిచేయడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.



కర్కాటక రాశి
వారం ప్రారంభంలో మీరు ఏ పనిలోనైనా నిర్లక్ష్యం లేదా సోమరితనానికి దూరంగా ఉండాలి..లేదంటే సక్సెస్ మీ వరకూ వచ్చి వెనక్కు పోతుంది. నిరుగ్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది...దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.



సింహ రాశి
ఈ వారం ప్రారంభంలో మీరు ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే సమయానికి మీ ముందుకి మరో సమస్య తలెత్తుతుంది. ఉద్యోగులు ఈ వారం బిజీగా ఉండవచ్చు. కార్యాలయంలో మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది



కన్యా రాశి
వారం ప్రారంభంలో మాటతీరు, ప్రవర్తనను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. మీ మాటలు విషయాలను మరింత దిగజార్చేలా ఉంటాయి. ఇతరుల చిన్న విషయాలను చర్చించే బదులు వాటిని విస్మరించడం మంచిది. ఖర్చులు తగ్గించండి



తులా రాశి
వారం ప్రారంభంలో సంతోషం ఉంటుంది. చాలా కాలంగా మీ వృత్తి వ్యాపారంలో మంచి సమయం కోసం వేచి ఉంటే త్వరలో మంచి ఫలితాలొస్తాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపార విస్తరణకు సంబందించిన ప్రణాళిక రూపొందిస్తారు.



వృశ్చిక రాశి
ఈ రాశివారు వారం ప్రారంభంలో మీరు అనుకున్న పనిని పూర్తి చేయడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆఫీసులో తరచూ మీ పనికి ఆటంకం కలిగించే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు సరైనది కాదు.



ధనుస్సు రాశి
వారం ప్రారంభంలో, ఏదైనా పని చేసేటప్పుడు సహనం పాటించడం చాలా అవసరం. డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఉద్యోగస్తులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.



మకర రాశి
మకర రాశివారికి వారం ప్రారంభంలో ఊహించిన దానికంటే కొంచెం తక్కువ విజయం ఉంటుంది. మీరు స్నేహితులు,కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు పొందుతారు..కష్టమైన పనులు సులభంగా పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులుంటాయి



కుంభ రాశి
ఈ వారం అదృష్టం మీవెంటే ఉంటుంది. ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. వృత్తి , వ్యాపారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు సీనియర్లు, జూనియర్ల నుంచి మంచి సహకారం లభిస్తుంది.



మీన రాశి
ఈ రాశివారికి వారం ప్రారంభం అంతా మంచి జరుగుతుంది. ఒక పెద్ద విజయం మీ ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయవనరులు అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగం చేసే మహిళలకు ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.