ABP Desam


చంద్రగ్రహణం- ఈ రాశులవారికి ప్రతికూల ఫలితాలనిస్తోంది


ABP Desam


శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి.


ABP Desam


మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది. ఆరోజు వైశాఖ పౌర్ణమి. చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.


ABP Desam


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటుంది.


ABP Desam


మే 5న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంది. గ్రహణం సమయంలో ఆయా రాశులపై ఉండే ప్రభావం దాదాపు 15 రోజులు ఉంటుంది.


ABP Desam


మేష రాశి
మేష రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహణం చూడకూడదు. ఆర్థికంగా నష్టపోతారు. అపరిచితులకు అప్పు ఇవ్వవద్దు. రిస్కీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. గ్రహణం రోజున శివ పంచాక్షరి పఠించాలి..చీమలకు పంచదార వేయాలి.


ABP Desam


కర్కాటక రాశి
కర్కాటక రాశి కూడా చంద్రగ్రహణం వల్ల చాలా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. కుటుంబంలో కలహాలు వచ్చే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇతరులతో వివాదాలకు వాదనకు దిగవద్దు. అనవసర విషయాలతో జోక్యం చేసుకోవద్దు. గ్ర


ABP Desam


తులా రాశి
తులా రాశి వారు చంద్రగ్రహణం రోజు దూర ప్రయాణాలు చేయవద్దు. 15 రోజుల పాటు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు.


ABP Desam


మకర రాశి
చంద్రగ్రహణం అనంతరం 15 రోజులపాటు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ ఉండేవారే మోసం చేసే ప్రమాదం ఉంది జాగ్రత్త. ముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండండి.


ABP Desam


కుంభ రాశి
కుంభ రాశివారు కూడా గ్రహణం రోజు నుంచి రెండు వారాల పాటు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ఆలోచన ఫలిస్తుంది. భార్య భర్తల మధ్య అనుమానాలు తలెత్తే అవకాసం ఉంది..జాగ్రత్తగా ఉండండి.


ABP Desam


నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.