శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది.
చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
2023 సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం 2023 మే 5 శుక్రవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు ప్రారంభమవుతుంది. అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది.
గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమై గ్రహణం ముగియడంతో ముగుస్తుంది. ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసేస్తారు.
గర్భిణులు బయటకు రాకూడదని, నేరుగా ఎవ్వరూ గ్రహణం వీక్షించకూడదని, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని చెబుతారు.
ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు.
యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్ , హిందూ మహాసముద్రంలో ఇది కనపడుతుంది.
2023లో రెండో చంద్రగ్రహణం అక్టోబర్ 28న ఏర్పడుతుంది. ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం రోజు రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది...ఈ గ్రహణం భారత దేశంలో కనిపిస్తుంది.
గమనిక: పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, బాధ్యత వహించదని గమనించగలరు. Images Credit: Pinterest