Weekly Horoscope ( April 24 to 30)
ఏప్రిల్ ఆఖరి వారం మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసా



మేష రాశి
ఏప్రిల్ చివరి వారం ఈ రాశివారికి శుభదాయకంగా ఉంది. గడిచిన వారంకన్నా ఈ వారం మీరు చేసే ప్రయత్నాలు మరింత విజయవంతమవుతాయి మరియు మంచి ఫలితాలను ఇస్తాయి. అయినప్పటికీ జీవితానికి సంబంధించిన సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి మరికొంత సమయం పడుతుంది.



వృషభ రాశి
ఈ వారం వృషభరాశివారు అత్యుత్సాహంతో, తొందరపాటుతో ఏ పనీ చేయకూడదు. వృత్తి లేదా వ్యాపారం ఏదైనా సరే, దానికి సంబంధించిన నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. వారం రెండో భాగంలో వ్యాపారం పుంజుకుంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.



మిథున రాశి
ఈ వారం ఈ రాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి..బాధ్యతలు పెరుగుతాయి.ఉద్యోగులకు కూడా కొత్త బాధ్యతలు పెరుగుతాయి. గృహ, కుటుంబ విషయాల్లో సామరస్యం నెలకొంటుంది. వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి ఆశించిన ప్రయోజనం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.



కర్కాటక రాశి
మాటల్లో, ప్రవర్తనలో వినయం చాలా అవసరం. చిన్న చిన్న విషయాల గురించి ఎవరితోనూ వాదించకండి. ఈ వారం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం బావుంటుంది.



సింహ రాశి
ఈ రాశివారికి ఈ వారం అదృష్టం బావుంది. అకస్మాత్తుగా ధన ప్రయోజనాలు ఉండొచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యాపారాన్ని విస్తరించాలన్న ప్రణాళిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.



కన్యా రాశి
ఈ రాశివారికి ఈ వారం కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో, మీరు కొన్ని పెద్ద విషయాలలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.. బడ్జెట్ కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. డబ్బు మరియు ఆరోగ్యం రెండింటినీ బాగా చూసుకోవాలి. ఎవ్వరితోనూ వాదించవద్దు



తులా రాశి
వారం ప్రారంభం నుంచీ మీరు తలపెట్టిన పనిలో ఆశించిన విజయం అందుకుంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులు వెతుక్కుంటారు. ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది. వారం మధ్యలో చేసే వృత్తి-వ్యాపార ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.



వృశ్చిక రాశి
ఈ వారం చివర్లో తీసుకునే నిర్ణయాల విషయంలో ఈ రాశివారు మరోసారి ఆలోచించడం మంచిది. ఇతరలను గుడ్డిగా నమ్మితే పెద్ద మోసానికి గురవుతారు. ఉద్యోగులు తమ పనిని ఇతరులకు వదిలేయకుండా సొంతంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.



ధనుస్సు రాశి
ధనస్సు రాశివారికి ఈవారం ఆశించిన పనిలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు నెరవేరుతాయి. మీ ఖ్యాతి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వారం ద్వితీయార్థంలో శుభవార్త అందుతుంది.



మకర రాశి
మకర రాశివారు ఈవారం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వారం ప్రారంభంలో ఏదైనా అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. పనుల్లో పెద్దగా అనుకూలత కనిపించదు. ప్లాన్ ప్రకారం అత్యవసం అయిన పనులు మాత్రమే చేపట్టండి. ఉద్యోగులకు ఈ వారం పనిభారం అధికమవుతుంది.



కుంభ రాశి
ఈ వారం కుంభ రాశివారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. కొంతకాలంగా మీ జీవితంలో ఉన్న సమస్యలు ఇంకా తగ్గే అవకాశం లేదు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ వృత్తి లేదా వ్యాపారం మొదలైన వాటి గురించి చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఉద్యోగులు కూడా విధినిర్వహణలో జాగ్రత్త



మీన రాశి
మీన రాశివారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మీ వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించిన శుభవార్తను పొందుతారు. ఉద్యోగస్తులు పదోన్నతి లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు వెలుగొందుతాయి. నిలిచిపోయిన పని పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు.