బుధుడి సంచారం ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం



గ్రహాల రాకుమారుడు బుధుడు ఏప్రిల్ 22న బుధుడు మేషరాశిలో తిరోగమనం చెందాడు. ఈ ప్రభావంతో నాలుగు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు.



ఈ తిరోగమన స్థితిలో మే 15 వరకు ఉంటారు. ముఖ్యంగా నాలుగు రాశులవారకి అత్యంత అనుకూల ఫలితాలనిస్తాడు వక్రంలో ఉన్న బుధుడు.



బుధుడిని తెలివితేటలు, తర్కం కారక గ్రహంగా భావిస్తారు. ఇది విద్య, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను సూచిస్తుంది.



మేష రాశి వారి మొదటి ఇంట్లో తిరోగమనం చెందాడు బుధుడు. ఈ ప్రభావంతో మీరు జీవితానికి సంబంధించిన నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతారు. ఉద్యోగులు పురోగతిని పొందుతారు. మీరు మీ కెరీర్ పట్ల చాలా సంతృప్తి చెందుతారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు.



మిథున రాశి నుంచి పదకొండో స్థానంలో ఉన్నాడు బుధుడు. కెరీర్ లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగ, విదేశీ ప్రయాణాలకు సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలు లభిస్తాయి. మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థికంగా బాగాలాభపడతారు.



సింహ రాశి వారికి బుధుడి తిరోగమనం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది . ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.



మేష రాశిలో బుధుడి తిరోగమనం కుంభరాశివారికి కలిసొస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు పని రంగంలో అధిక పురోగతిని సాధిస్తారు. పదోన్నతి కూడా పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ధనలాభం పొందుతారు.



నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.



Images Credit: Freepik