ABP Desam


ఈ రాశులవారు వాహనం జాగ్రత్తగా నడపాలి
ఏప్రిల్ 21 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
ఈ రాశివారికి సోమరితనం వల్ల పనుల్లో వేగం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి.శత్రువులు మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులు త్వరలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు మీ మనస్సు రకరకాల సమస్యలతో చుట్టుముట్టి ఉంటుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు రావొచ్చు. అత్యవసరం అయితేనే ప్రయాణం చేయడం మంచిది. మౌనంగా... వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఖర్చులు పెరుగుతాయి.


ABP Desam


మిథున రాశి
ఈ రాశి అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు పడేందుకు ఈ రోజు మంచిరోజు. ఆదాయం పెరుగుతుంది.స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆలోచించి ముందడుగు వేయండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రోజు మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలు ఉంటాయి. వ్యాపారులు లాభపడతారు.కుటుంబ సభ్యులతో ఏదైనా విషయంపై చర్చించేటప్పుడు స్వచ్ఛంగా మాట్లాడతారు.


ABP Desam


సింహ రాశి
ఈ రోజు సింహరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రవర్తన తటస్థంగా ఉంటుంది. మీ లక్ష్యంపై దృష్టి పెడతారు. మతపరమైన కార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టొద్దు.


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మీరు మీ మాటతీరుని కాస్త అదుపుచేసుకోడం మంచిది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం ఉంటుంది. ఎవరితోనైనా వైరం ఏర్పడవచ్చు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి.


ABP Desam


తులా రాశి
మీ ప్రియమైనవారికోసం డబ్బు ఖర్చుచేస్తారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు కొంత సమయం కేటాయించుకోండి. ఇంటా బయటా గౌరవం పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారం బాగాసాగుతుంది.


ABP Desam


వృశ్చిక రాశి
ఇంట్లో సంతోషం సంతోషం, ప్రశాంతత కారణంగా మానసకి ఆనందాన్ని పొందుతారు. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ శత్రువులు ఎన్ని ఎత్తులువేసినా మీదే పైచేయి. ఆర్థిక ప్రయోజనం పొందుతారు


ABP Desam


ధనుస్సు రాశి
ధనస్సు రాశివారు ఈ రోజు మీరు పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కడుపులో ఏదో అసౌకర్యం ఉండవచ్చు. ఆహారం విషయంలో నియంత్రణ పాటించాలి. అనుకున్న పని పూర్తవకపోవడంతో నిరాశ చెందుతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. కార్యాలయంలో పాత వివాదం తలెత్తవచ్చు.


ABP Desam


మకర రాశి
ఈ రాశివారు ఈ రోజు వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కుటుంబ సమస్యలు మీ మనసుపై ప్రభావం చూపిస్తాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. ఒత్తిడి లేకుండా పనిచేయడం వల్ల మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.


ABP Desam


కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారి ఆరోగ్యం బావుంటుంది. మనసులో ఆందోళనలు తొలగిపోతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తోబుట్టువులతో మీ సంబంధాలు బాగానే ఉంటాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండాలి.


ABP Desam


మీన రాశి
ఈ రోజు మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనైనా మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లేదా లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో విభేదాలు బయటపడతాయి. ప్రతికూల ఆలోచనలు మనస్సును శాసిస్తాయి.