ABP Desam


ఈ రాశివారికి ఈ రోజు మానసిక ఆందోళన తప్పదు
(17-04-2023)


ABP Desam


మేష రాశి
ఈ రోజు మీరు స్నేహితులతో చాలా బిజీగా ఉంటారు. పనుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వ పనుల్లో విజయం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది


ABP Desam


వృషభ రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన వార్తలు అందుకుంటారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ముందుకుసాగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ పడిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంది. మీ ప్రియమైన వ్యక్తితో సమయం స్పెండ్ చేస్తారు.


ABP Desam


మిథున రాశి
మీ రోజు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. మానసిక ఆందోళన ఉంటుంది. పనిచేయాలనే ధ్యాస ఉండదు. కార్యాలయంలో అధికారుల, సహోద్యోగుల ప్రవర్తన కూడా సరిగా ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. పిల్లలతో విభేదాలు రావొచ్చు. పొంచిఉన్న శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.


ABP Desam


కర్కాటకం
ఈ రోజు ఈ రాశివారు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అనవసర వాదన పెట్టుకోవద్దు. కోపాన్ని అదుపుచేయండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. నిబంధనలకు విరుద్ధంగా ఏ పనీ చేయవద్దు. భగవంతుని స్మరణ మీకు మనశ్శాంతిని ఇస్తుంది.


ABP Desam


సింహ రాశి
ఈ రోజు మీకు ఫలవంతమైన రోజు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. వ్యాపారంలో కూడా భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. అనవసర ఖర్చులున్నాయి జాగ్రత్తపడండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది.కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. మనసు కూడా ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. సహోద్యోగుల పూర్తి సహకారం లభిస్తుంది.


ABP Desam


తులా రాశి
మీ రోజు సాధారణంగా ఉంటుంది. చదువులో ఆటంకాలు ఏర్పడవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించవద్దు. మీరు సన్నిహితులను కలుస్తారు. మీకున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఉద్యోగులు తమపనిపై మాత్రమే దృష్టిపెట్టాలి.


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రోజు ఏదో విషయంలో భయపడతారు. కుటుంబ సభ్యులు లేదా బంధువులతో వివాద సూచనలున్నాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తిపత్రాలు జాగ్రత్తగా ఉంచాలి. ఉద్యోగులు ఈరోజు పనిచేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ఆధ్యాత్మికత విషయాలపై ఆసక్తి చూపిస్తారు. కొత్త ప్రణాళికలు అమలుచేయడంలో ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ మనసు సంతోషంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.


ABP Desam


మకర రాశి
ఈరోజు స్నేహితునితో వాదోపవాదాలు జరగవచ్చు. మాటపై నిగ్రహం మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. స్టాక్ మార్కెట్‌లో మూలధనాన్ని పెట్టుబడి పెట్టగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కంప్యూటర్లతో పనిచేసే వ్యక్తులు సమస్యలను ఎదుర్కొంటారు.


ABP Desam


కుంభ రాశి
ఆర్థికపరంగా ఈరోజు మీకు మంచిరోజు. మంచి భోజనాన్ని ఆస్వాదిస్తారు. స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటంది. రోజంతా ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు కష్టానికి తగిన ఫలితం అందుతుంది.


ABP Desam


మీన రాశి
ఈ రోజు మీ మనసులో ఏదో గందరగోళం నెలకొంటుంది. ఆర్థికపరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి..వాటిని నియంత్రించాలి. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మాటతీరు మార్చుకోకుంటే ఇబ్బందిపడాల్సి ఉంటుంది.