ఈ రాశివారికి ఆనందం-బాధ రెండూ ఉంటాయి



మేష రాశి
ఈ రాశి వ్యాపారులకు ఈ రోజు లాభాలొస్తాయి. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. వివాహితుల బంధం బలంగా ఉంటుంది. స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. కష్టానికి తగిన ఫలితం అందుకోలేరు. సహనంగా వ్యవహరించాలి..తొందరగా అలసిపోతారు.



వృషభ రాశి
ధార్మిక మరియు సామాజిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. బంధువులు, స్నేహితులతో వివాదాలు ఉండొచ్చు.ఈ రోజు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అధికారులు మీ పని పట్ల సంతోషిస్తారు.



మిథున రాశి
ఈరోజు మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త లక్ష్యాన్ని పొందుతారు. జీవితంలో ఆనందం పెరుగుతుంది అదే సమయంలో ఏదో చిన్న బాధ మీ మనసుని తొలిచేస్తుంటుంది.



కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. మనసులో ఉన్న ఏదో సందిగ్ధతకు తెరపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మీరహస్య శత్రువులు మీకు హానిచేయలేరు.



సింహ రాశి
ఈ రాశి వ్యాపారులకు అనుకూలమైన రోజు. గృహ జీవితంలో సంక్లిష్టమైన ప్రశ్నలు పరిష్కారమవుతాయి. శాశ్వత ఆస్తికి సంబంధించిన వివాదంలో విజయం మీవైపు వస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రేమ సంబంధాలు కొనసాగుతాయి. శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందుతారు.



కన్యా రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు . స్థిరాస్తుల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాలి. సానుకూల శక్తి మీలో ఉంటుంది..ఈ కారణంగా మీ లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు.



తులా రాశి
ఈ రాశివారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వీరికి కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టమైన పనులు పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారమవుతాయి.



వృశ్చిక రాశి
భాగస్వామ్య వ్యాపారం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు. ఆదాయం పెరగడంతో కొన్ని చికాకులు దూరమవుతాయి. మంచి దుస్తులు, మంచి భోజనంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటారు.



ధనుస్సు రాశి
ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. మిత్రుల సాంగత్యం వల్ల ఆనందం రెట్టింపు అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రసంగం తీవ్రంగా మారకూడదని గుర్తుంచుకోండి. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు మంచిది కాదు.



మకర రాశి
ఈ రోజు మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ మనస్సు నుంచి ప్రతికూల ఆలోచనలు తొలగిపోయినప్పుడు తేలికగా ఉంటారు. అనైతిక పని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. వీలైతే వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు.



కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారు వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేసేందుకు ప్రయత్నిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. సోమరితనం , ఆందోళన ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగవద్దు. అగ్ని మరియు నీరు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. .



మీన రాశి
ప్రయాణానికి ఈరోజు మంచి రోజు. వ్యాపార సంబంధిత పనులలో లాభదాయకమైన ప్రారంభం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. షేర్ స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. పెట్టుబడికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు.