వారం రోజుల పాటూ ఈ రాశులవారికి మానసిక ఇబ్బందులు తప్పవు
మేష రాశివారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఆవేశపడకుండా ఉండాలి. మీ ప్రత్యర్థులు అనవసరమైన విషయాల ద్వారా మీ లక్ష్యం నుంచి మీ దృష్టిని మరల్చడానికి ప్రయత్నించవచ్చు . మీ మనస్సు కొంచెం పరధ్యానంగా ఉండవచ్చు.
వృషభ రాశివారు ఈ వారం డబ్బుని, సమయాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అన్ని మూలల నుంచి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. వారం ప్రారంభంలోనే ఇంటి అలంకరణపై దృష్టి సారిస్తారు. పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కన్యా రాశివారికి ఈ వారం కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. ముఖ్యమైన పనులు నిర్వహించేందుకు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో అదనపు పనిభారం కారణంగా తొందరగా అలసిపోతారు. ఉద్యోగం చేసే స్త్రీలు పని - ఇంటిని బ్యాలెన్స్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మకర రాశి ఈ వారం భావోద్వేగాలకు లోనవుతూ లేదా అయోమయ స్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటారు. ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో మీ పనిని వేరొకరి చేతుల్లోకి వదిలేసే పొరపాటు చేయకండి. వారం మధ్యలో ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు
మీన రాశివారు ఈ వారం ఏదైనా ప్రయోజనం పొందడానికి షార్ట్‌కట్‌లను అవలంబించకూడదు..ఇలా చేస్తే చేసిన పని చెడిపోతుంది. వారం మధ్యలో, మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఏదైనా పథకం లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన డబ్బు నుంచి ప్రయోజనం పొందుతారు.
నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.