2023 ఏప్రిల్ 6 నుంచి మే 3 వరకూ ఈ 6 రాశులవారికి మహర్థశ



సుఖ, సంతోషాలనిచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావంతో ఆరు రాశులవారికి అదృష్టమే అదృష్టం



సుఖ సంతోషాలనిచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభరాశిలోకి ప్రవేశించాడు. మే 2వ తేదీ వరకూ వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను సూచిస్తోంది..ఆ రాశులేంటంటే..



మేష రాశి
మేషరాశి వారికి రెండో స్థానంలో శుక్ర సంచారం కలిసొస్తుంది. మెరుగైన జీవన శైలి లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరికీ శుభసమయం



వృషభ రాశి
వృషభ రాశిలోనే శుక్రసంచారం జరుగుతోంది. ఈ సమయంలో ఈ రాశివారు చాలా సానుకూల మార్పులు చూస్తారు. జీవిత భాగస్వామితో బంధం మెరుగుపడుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. సౌలభ్యాలు పెరుగుతాయి..పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.



కర్కాటక రాశి
శుక్రుడు సౌఖ్యం , విలాసానికి అధిపతి. ఈ రాశి నుంచి 11 వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీకు అంతా మంచే జరుగుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.



కన్యా రాశి
శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నందున ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మతపరమైన ప్రదేశాలు సందర్శిస్తారు. కుటుంబ సంబంధాలు సాధారణంగా ఉంటాయి.



మకరరాశి
మకరరాశి వారికి శుక్రుడు 5, 10 గృహాలకు అధిపతి. ప్రస్తుతం ఈ రాశి నుంచి శుక్రుడు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీరు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారు. పని సామర్థ్యంలో అభివృద్ధి ఉంటుంది.



కుంభ రాశి
కుంభ రాశి వారికి శుక్రుడు 4, 9 గృహాలకు అధిపతి. ప్రస్తుతం కుంభ రాశివారికి శుక్రసంచారం నాలుగో స్థానంలో ఉంది.విలాసాలు, శారీరక సుఖాలు ఉంటాయి. వాహనం, ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచిస్తారు. కెరీర్‌లో రాణిస్తారు. పనిలో యజమానిని మెప్పించగలుగుతారు



నోట్: ఆయా రాశుల్లో ఫలితాలు ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.



Images Credit: Pixabay