ఏప్రిల్ 20 రాశిఫలాలు
ఈ రాశివారు తమ బలహీనతలను బహిర్గతం చేయవద్దు



మేష రాశి
ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆదాయం బావుంటుంది. వ్యాపారంపై మరింత దృష్టిసారిస్తే లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.



వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.



మిథున రాశి
ఈ రాశివారికి సహోద్యోగులు, అధికారులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. మీ హోదా, గౌరవం పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదోన్నతి అవకాశాలున్నాయి. బంధువుల నుంచి బహుమతులు అందుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.



కర్కాటక రాశి
ఈ రోజు ప్రతి పని సులభంగా పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఏదో ఒక చర్చ ఉంటుంది. మీరు కొత్త పనులు చేస్తారు. మీ ప్రవర్తన చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



సింహ రాశి
మీ రోజు లాభదాయకంగా ఉంటుంది. కేవలం మీ పని మీద దృష్టి పెట్టండి. మానసిక ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది



కన్యా రాశి
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మంచి సమాచారం అందుతుంది. ఉద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. మీ పరిచయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. నూతన వస్త్రాలు, నగలు కొనుగోలు చేస్తారు. మీ బలహీనతలను ఎవ్వరి వద్దా బహిర్గతం చేయవద్దు.



తులా రాశి
రోజంతా బావుంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మాటపై సంయమనం పాటించండి.



వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. చర్చలకు దూరంగా ఉండండి. ఆర్థికపరమైన ఆందోళన ఉంటుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఆలోచనను విరమించుకోవడం మంచిది. భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.



ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారిలో ఉత్సాహం లోపిస్తుంది. కుటుంబ కలహాలు అలాగే ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో అడ్డంకులు ఎదురుకావచ్చు. ఆస్తికి సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. వివాదాలకు దూరంగా ఉండండి . కష్టసమయాన్ని ఓర్పుగా ఎదుర్కోవాలి



మకర రాశి
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలు ముందుకు సాగుతాయి.. ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులు తొలగిపోతాయి. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది.



కుంభ రాశి
ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో డైలమాకు గురవుతారు. ఏదో గందరగోళం వీరిని వెంటాడుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. మాటపై సంయమనం పాటించండి.



మీన రాశి
ఈ రాశివారికి రోజంతా ఉత్సాహం అలాగే ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించేందుకు ఈ రోజు మంచి రోజు. కుటుంబంతో, సన్నిహితులతో సంతోష సమయం గడుపుతారు. ఖర్చులు కొంతవరకూ అదుపుచేయగలుగుతారు. ఉద్యోగులకు మంచి సమయం. ఎవరి పనుల్లో జోక్యం చేసుకోకండి.