అన్వేషించండి

Guppedanta Manasu May 3rd: వసుని బుజ్జగించిన ఈగో మాస్టర్, మెడికల్ కాలేజీ విషయంలో శైలేంద్ర షాకిచ్చిన రిషి!

Guppedantha Manasu May 3rd Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుప్పెడంతమనసు మే3 ఎపిసోడ్

శైలేంద్రని ఎండీ సీట్లో కూర్చోబెట్టడం చూసి వసుధార తట్టుకోలేకపోతుంది..అందరూ వెళ్లిపోయిన తర్వాత రిషిని తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెడుతుంది
వసు: ఈ సీట్లో మీరు తప్ప ఇంకెవ్వరూ కూర్చోవద్దు..ఇందులో కూర్చునే అర్హత మీకే ఉంది...ఇప్పుడే నా క్యాబిన్ సార్ కి ఇచ్చేస్తాను మీ క్యాబిన్లోనే ఉంటాను..మీపక్కన ఉంటే చాలు
రిషి: ఒక్క నిముషం అన్నయ్య కూర్చుంటే తట్టుకోలేకపోయావ్..అంతకుమించి ఏదైనా జరిగితే..
వసు: అదేంటి సార్ అలా అంటారు..
రిషి:  ఓ మంచిపని చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు ఉంటాయి...కొన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది..ఏం జరిగినా తట్టుకునేలా ఉండాలి
వసు: ఈ కాలేజీ ప్రతిష్టమీరు..ఇందులో మీరే కూర్చోవాలి..నా మాటకు కట్టుబడి ఉండాలి..

రూమ్ లో జగతి-మహేంద్ర ఇద్దరూ డిస్కషన్ పెడతారు.. కాలేజీలో శైలేంద్ర మాటలు తలుచుకుంటుంది జగతి..
మహేంద్ర: భూషణ్ ఫ్యామిలీకి రిషి గర్వకారణం తనెప్పుడూ అలాగే ఉండాలి
జగతి: క్యాబిన్ విషయంలో శైలంద్ర మాటల్లో తేడా గుర్తించలేదా..కావాలనే ఇదంతా చేసినట్టులేదా
మహేందర్: తనేదో క్యాజువల్ గా అన్నాడు..నువ్వెందుకు సీరియస్ గా తీసుకుంటున్నావ్
జగతి: క్యాజువల్ గా అయితే అంతలా క్వశ్చన్ చేస్తున్నావ్
మహేంద్ర: నీ కొడుకుపై ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావ్..శైలేంద్ర గురించి నీకు సందేహం వద్దు..తను వదినలా కాదు.. ఫణీంద్ర అన్నయ్యలా చాల మంచివాడు
జగతి: ఆవిడలా కావొద్దని ఆశిద్దాం...సరే ధరణి కిచెన్లో ఉన్నట్టుంది నేను వెళ్లి సహాయం చేస్తాను...

Also Read: ఎండీ సీట్లో ఎప్పుడూ రిషి ఉండాలన్న వసు, త్వరలోనే దక్కించకుంటానన్న శైలేంద్ర


మేడం ఎప్పుడూ వంటగదిలోనే ఉంటారా అంటుంది వసుధార..రిషి కూడా ఆ వెనుకే వెళతాడు...
వసు: ఏప్పుడు చూసినా ఏదో పని చేస్తుంటారేంటి మేడం..ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది..కాసేపు సరదాగా బయటకు వెళ్లొచ్చుకదా
శైలేంద్ర: లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో ధరణికి నేర్పించవచ్చుకదా..కావాలంటే ధరణికి నువ్వు నేర్పించినందుకు ఫీజు పే చేస్తాను...
రిషి: వసుధార పర్ ఫెక్ట్ గురు..నాక్కూడా తనే అన్నీ నేర్పించింది..
శైలేంద్ర: అవునా..ఏం నేర్పించింది..
రిషి: లైఫ్ లో సిట్యయేషన్స్ ని బట్టి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి మాత్రమే కాదు..బయటప్రపంచం ఏంటో తెలియజేసింది
శైలేంద్ర: వసుధార దగ్గర నేను ఊహించిన దానికన్నా ఎక్కువ జ్ఞానమే ఉందన్నమాట..నేనుకూడా తనదగ్గరనుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట...
వసుధార కోపంగా వెళ్లిపోతుంది.. 
ధరణి: నాకు అన్నీ మీ అన్నయ్య నేర్పుతారులే..వసుధార వెళ్లింది కదా నువ్వూ వెళ్లు అంటుంది
రిషి కూడా వెళ్లిపోతాడు...
శైలేంద్ర: నీకు ప్రేమను పంచుకునే అవకాశం ఎలాగూ లేదు..కనీసం సరిగ్గా నటించు..మనిద్దరి మధ్యా దూరం మనమధ్యే ఉండాలి.. అంతేకానీ కాదు కూడదని బయటపెడితే అది నీకే మంచిదికాదు..గుర్తుపెట్టుకో... 
( అప్పుడే వంటగదిలోకి వచ్చిన జగతి ఆ మాటలు వింటుంది) శైలేంద్ర వెళ్లిపోయిన తర్వాత వంటగదిలోకి వద్దాం అనుకుని వెనక్కు వెళ్లిపోతుంది.

Also Read: మే 3 రాశిఫలాలు, ఈ రాశివారు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు బాధపడతారు

రూమ్ లో కూర్చున్న రిషి..వసుధార గురించి ఆలోచిస్తాడు..ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఇంకా గుడ్ నైట్ చెప్పలేదు అనుకుంటూ రిషినే మెసేజ్ పెడతాడు..
రిషి: గుడ్ నైట్ ఏది
వసు: నో గుడ్ నైట్ యాంగ్రీ నైట్ సార్ అని రిప్లై ఇస్తుంది.నా కోపానికి కారణం తెలుసుకని తగ్గించండి
రిషి: నేను ఏమీ అనలేదు కదా..ఎందుకు హర్టైంది
వసు: చూద్దాం..సార్ తెలుసుకుంటారో లేదో
రిషి: తెలియడం లేదు..చెప్పొచ్చుకదా
వసు: మీరు జెంటిల్మెన్ కదా సార్ కనుక్కోండి చూద్దాం
ఏమై ఉంటుందని ఆలోచనలో పడతాడు రిషి...గతంలో వసుధార ఇచ్చిన గోళీల బాటిల్ తీసుకుని ఆ గోళీలన్నీ మంచంపై పేరుస్తాడు.. sorry అని..నీకు కోపం ఎందుకొచ్చినా పోగొట్టడం నా బాధ్యత అంటూ గోళీలకు ఫొటో తీసి పంపిస్తాడు..
వసు: అది చూసిమురిసిపోతుంది వసుధార... వీడియో కాల్ చేస్తుంది..
రిషి: ఏంటి మేడం కోపం తగ్గిందా...
వసు: అసలు నాకు కోపం ఎందుకొచ్చిందో తెలుసా..మీరు దొంగ సార్..మీరే సార్
రిషి: మరి నేను జెంటిల్మెన్, ఎండీ, సీరియస్ సింహం అన్నావ్...
వసు: అన్నాను కానీ..ఇప్పుడు చోర్ అన్నాను..లేకపోతే పెళ్లిపీటల నుంచి చదువుకోసం పారిపోయి వచ్చిన అమ్మాయిని ప్రేమతో బంధించేస్తారా.. ఈ వసుధారని ప్రపంచం మరిచిపోయి మీరే ప్రంపంచంగా మార్చేస్తారా.. ప్రేమ ఎంత బలమైన బంధమో నేర్పింది మీరు..మరి మీకు నేనునేర్పించాననిఅన్నయ్యతో అన్నారు కదా
రిషి: దీనికా కోపం వచ్చింది....వసుధారా..నిన్ను చూస్తుంటే ఏమనాలో కూడా తెలియడం లేదు.. 
నవ్వుతూ ఉన్న రిషిని చూస్తూ ఉండిపోతుంది...మీరు నవ్వు ఆపకండి..నవ్వుతుంటే చూడాలని ఉంది అంటుంది..
గుడ్ నైట్ చెప్పేసుకుని నిద్రపోతారు...

కాలేజీలో మెడికల్ కాలేజీ టెండర్స్ గురించి మీటింగ్ పెడతారు.. పదికోట్లు అవుతుందన్న రిషి..ఏడుకోట్లు ఉంది.. ముందుగా టెండర్లు పిలుద్దాం అంటాడు. మొత్తం డబ్బులు చూసుకుని ముందుకు వెళదాం అంటుంది జగతి..ముందు అడ్వాన్స్ ఇచ్చి పని మొదలుపెడదాం అంటాడు రిషి. ఇంతలో మినిస్టర్ కాల్ చేయడంతో..ఫ్రీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకుంటున్నానని చెబుతాడు రిషి. ఎంతమంచి ప్లాన్ అయినా ఫ్రీ మెడికల్ ఎడ్యుకేషన్ అయినా కష్టం అని మినిస్టర్ అంటే..నా దగ్గర ప్లాన్ ఉందని చెబుతాడు. ఫ్రీ మెడికల్ ఎడ్యుకేషన్ సాధ్యమేనా అని అంతా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. నా దగ్గర ఓ ఐడియా ఉంది..అదే ఆలోచిస్తున్నా అంటాడు రిషి.

రిషి: డాక్టర్ మేక్స్ డాక్టర్ అనే థీమ్ తో చాలామంది డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను..మనదేశంలో ఎంతోమంది సెటిలైన డాక్టర్స్ ఉన్నారు.. వాళ్లు ఒక్కొక్కరు ఓక్కో పేద విద్యార్థిని సపోర్ట్ చేస్తే చాలన్నాను..అందుకు అందరూ సరే అన్నారు.. కచ్చితంగా సపోర్ట్ చేస్తారు...
రిషి ఆలోచన విని శైలేంద్ర షాక్ అవుతాడు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Embed widget