Guppedanta Manasu May 2nd: ఎండీ సీట్లో ఎప్పుడూ రిషి ఉండాలన్న వసు, త్వరలోనే దక్కించకుంటానన్న శైలేంద్ర
Guppedantha Manasu May 2nd Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు మే 2 ఎపిసోడ్
మెడికల్ కాలేజీ లోగోని జగతి-వసుధార ఆవిష్కరించాలంటూ శైలేంద్రకు షాక్ ఇస్తాడు రిషి. జగతి-వసుధార ఇద్దరూ రిషి దగ్గరకు వెళ్లి ఇది మీ చేతులమీదుగా ఓపెన్ చేయమని అంటుంది. అప్పుడు ముగ్గురం కలసి ఓపెన్ చేద్దాం అంటాడు..జగతి-వసు-రిషి ముగ్గురూ కలసి మెడికల్ కాలేజీ లోగో ఓపెన్ చేస్తారు... మహేంద్ర సంతోషిస్తాడు. ఇదంతా చూసిన శైలేంద్రలో కడుపుమంటతో...వీళ్లిద్దరే నీ బలం అన్నమాట...ముందు వీళ్ల అడ్డు తప్పిస్తే నీ పతనం మొదలవుతుందన్నమాట అనుకుంటాడు. అందరూవెళ్లిపోతారు..ఆ తర్వాత రిషి కూడా వెళుతుండగా ఆగమని అడుగుతుంది వసుధార..మీకో గిఫ్ట్ ఇవ్వాలనుందంటుంది. కళ్లుమూసుకోమని చెప్పి..చేతికి బ్రాస్ లెట్ పెడుతుంది. అది చూసి రిషి షాక్ అవుతాడు..చాలా సంతోషిస్తాడు..
వసు: ఇది బ్రాస్ లెట్ మాత్రమే కాదు..మీ లైఫ్ లో చేసే ప్రతి సంతకంలో వసుధార ఉండాలి..మీరు ఏ పని చేసినా నేను మీకు గుర్తురావాలి.
రిషి: ఈ బ్రాస్ లెట్ ఉన్నా లేకపోయినా నువ్వు ప్రతిక్షణం గుర్తుంటావు.. థ్యాంక్యూ వెరీ మచ్
వసు హ్యాపీగా ఫీలవుతుంది..
Also Read: కాలేజ్ లో శైలేంద్రకి షాకుల మీద షాకులు- ఎండీ సీట్ లో అన్నయ్యని కూర్చోబెట్టిన రిషి
అతర్వాత శైలేంద్రను తీసుకెళ్లి మెడికల్ కాలేజీ బిల్డింగ్ కట్టే ప్లేస్ చూపిస్తాడు. అడ్మిషన్ స్టార్ట్ అయ్యేలోగా బిల్డింగ్ రెడీ అవుతుందా అని అడిగితే.. పూర్తవకపోతే ఈ లోగా పాత బిల్డింగ్ లో క్లాసులు నడిపి..ఆ తర్వాత ఇక్కడకు షిప్ట్ చేస్తానంటాడు. శైలేంద్ర మాత్రం మనసులో ఈ బిల్డింగ్ ఎలా పూర్తిచేస్తావో చూస్తాను అనుకుంటాడు. ఇంతలో రిషి ఫైల్ శైలేంద్ర చేతికిచ్చి చూడమంటాడు... శైలేంద్ర ఫోన్ రిషి చేతిలో ఉంటుంది.. అవాక్కైన శైలేంద్ర ఆ ఫోన్ తీసుకుని దూరంగా వెళ్లిపోయి సౌజన్యారావుకి క్లాస్ వేస్తాడు. కాల్ కట్ చేసేసరికి వసుధార వెనక్కు నిలబడి ఫోన్లో ఎవరు సార్ అని అడుగుతుంది..
శైలేంద్ర: ఇలా వచ్చావేంటి
వసు: మీరు మా అతిథి కదా మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను
వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రిషి అక్కడకు వస్తాడు..ఏంటి ఇక్కడ కూడా బిజినెస్ గురించేనా అని అడుగుతాడు...
శైలేంద్ర: వసుధార మనకోసం వచ్చింది..ముఖ్యంగా నీకోసం
వసు: మీరు ఇంతసేపు ఎండలో ఉంటే ఎలా అని గొడుగు వేస్తుంది
రిషి: అన్నయ్య ఉన్నాడు
శైలేంద్ర: నేనేం అనుకోను..త్వరగా రండి..అనేసి వెళ్లిపోతుంటే వసు గొడుగు ఇస్తుంది..అది చూసి..తనకు అతిథి మర్యాదలు చాలా తెలుసు అనేసి వెళ్లిపోతూ.. ఇద్దరూ కలసి ఎక్కువ రోజులు ఉండరులే అనుకుంటాడు
Also Read: మే 2 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి
లోపలకు వెళ్లిన శైలేంద్రని..కాలేజీ ఎలా ఉందని అడిగితే.. రెండు కళ్లు సరిపోవు..రిషి కాలేజీ మొత్తం దగ్గరుండి చూపించాడు.. రిషిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది.. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మిస్టర్ రిషీంద్ర భూషణ్ అంటాడు.. కానీ శైలేంద్ర మాటలు విని జగతి-వసు మనసులో ఏదో అనుమానం మొదలవుతుంది..
శైలేంద్ర: డాడ్ మీ క్యాబిన్ ఏది
ఫణీంద్ర: నాకు క్యాబిన్ లేదు
శైలేంద్ర: అందరకీ క్యాబిన్ ఉంది..వసుధారకి కూడా క్యాబిన్ ఉంది..మీకు లేదు
ఫణీంద్ర: కాలేజీ వ్యవహారాలన్నీ వాళ్లే చూసుకుంటారు..నాకెందుకు క్యాబిన్
మహేంద్ర: అంతఅవసరం అయినప్పుడు నా క్యాబిన్ వాడుకుంటారు
ఫణీంద్ర: మీకంటూ ఓ క్యాబిన్ లేదా..అని హడావుడి చేస్తాడు
జగతి: రిషిని బాధపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడని అర్థమై.. నా క్యాబిన్ బావగారికి ఇవ్వండి..నేను మహేంద్ర , వసు క్యాబిన్స్ లో అడ్జెస్ట్ అవుతాను
ఫణీంద్ర: అంత అవసరం అయితే రిషి తన సీటిస్తాడు..
రిషి: మీకే కాదు పెదనాన్న..ఈ సీటు అన్నయ్యకు కూడా...అనేసి శైలేంద్రను తీసుకెళ్లి సీట్లో కూర్చోబెడతాడు.. ఈ సీట్లో నిన్ను చూస్తుంటే రాజులా ఉన్నావ్..
శైలేంద్ర: థ్యాంక్యూ రిషి..కానీ..మన సామ్రాజ్యానికి రాజు ఒక్కడే...
మహేంద్ర: మీ ఇద్దర్నీ చూస్తుంటే సంతోషంగా గర్వంగా ఉంది..
శైలేంద్ర: నేను మీ అందరిమధ్యా నిప్పు రాజేద్దాం అనుకుంటే రిషి చల్లార్చాడు...రిషి తెలివైనవాడే..అనుకుంటూ.. ఎండీ బోర్డువైపు క్రూరంగా చూస్తాడు...
ధరణి వంట చేస్తుంటే దేవయాని వచ్చి ఎప్పటిలా సూటిపోటి మాటలు మాట్లాడుతుంది. నువ్వుకాలజీకి వెళ్లడానికి పనికిరావు, ఎక్కడికీ వెళ్లడానికి పనికిరావు..ఒకవేళ వెళ్లే అవకాశం వచ్చినా ఎప్పుడూ వెళ్లకు, ఇకపై వంట విషయం తప్ప ఇంకే విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు.. చేసుకున్నా నీ మట్టిబుర్రకు ఏమీ అర్థంకాదులే అంటుంది దేవయాని. మీకు ఆకలేస్తోందా అన్నం పెట్టాలా అని అడిగితే ఫైర్ అవుతంది దేవయాని. మీ మొగుడికి ఏం ఇష్టమో నేర్చుకో..జగతి వసుధారతో మాటలు తగ్గించు..నీ పరిధి ఏంటో ఆలోచించి మాట్లాడు...అనేసి వెళ్లిపోతుంది..
మరోవైపు రిషిని చేయిపట్టి లాక్కొచ్చిన వసుధార..ఎండీ సీట్లో కూర్చోబెడుతుంది..ఈ సీట్లో మీరు తప్ప ఎవ్వరూ కూర్చోకూడదు..ఈ సీట్లో కూర్చునే అర్హత మీకు మాత్రమే ఉంది అంటుంది.
గుప్పెడంతమనసు మే 3 ఎపిసోడ్ లో
ఏంటి మేడం ఇంకా కిచెన్లోనే వంట చేసుకుంటారా అని వసుధార అడుగుతుంది.. రిషి అక్కడే ఉంటాడు..ఇంతలో శైలేంద్ర వచ్చి నేను కూడా అదే అంటున్నా అంటాడు. అవును అన్నయ్యా వసుధార పర్ ఫెక్ట్ గురువు..నాక్కూడా అన్నీ తనే నేర్పించింది అంటాడు. నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట అంటాడు శైలేంద్ర. వసు-రిషి అక్కడినుంచి వెళ్లిపోతారు..జగతి వంటగదిలోకి వస్తూ ఆగిపోతుంది... మనమధ్య దూరం మనమధ్యే ఉండాలి గుర్తుపెట్టుకో అని ధరణిని శైలేంద్ర బెదిరించడం చూస్తుంది జగతి..