మే 6 రాశిఫలాలు, ఈ రాశివారు గందరగోళంగా ఉండే వ్యక్తులకు దూరంగా ఉండాలి!
Rasi Phalalu Today 6th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 6 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన రోజు. స్నేహితులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. మితిమీరిన ఉత్సాహంతో పని చెడిపోవచ్చు. భూమి-ఆస్తి సంబంధ వివాదాలు పరిష్కారమవుతాయి.
వృషభ రాశి
ఈ రాశివారు ఈరోజంతా ఆనందంగా ఉంటారు. మీరు కొత్త పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ శత్రువులు మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. బిజీగా ఉన్నప్పటికీ మీకోసం మీరు కొంత సమయం కేటాయిస్తారు.
మిథున రాశి
ఈ రాశికి చెందిన ప్రైవేట్ కంపెనీలో పని చేసే వారికి ఉద్యోగం విషయంలో ఆందోళన ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీరు రహస్య శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
Also Read: వృషభంలోకి సూర్యుడు, ఈ రాశులవారి జీవితాల్లో వెలుగొస్తుంది
కర్కాటక రాశి
ఈ రాశివారు పనిలో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలి. పరిపాలనలో ఉన్న వ్యక్తులతో మీకు కొంత ఇబ్బంది ఉండవచ్చు. కలిసి పనిచేసే ఉద్యోగుల సహకారం చాలా బాగుంటుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. వాతావరణం కారణంగా ఇబ్బందులు ఉండవచ్చు. మిమ్మల్ని కోపం డామినేట్ చేయకుండా చూసుకోవడం మంచిది.
సింహ రాశి
ఈ రాశివారు ఈరోజు కష్టపడితనే ఫలితం పొందుతారు. ఈ రోజు పెద్ద ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంది. కోర్టు సంబంధిత విషయాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది.ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి.
కన్యా రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సంభాషణ సమయంలో పదాలను జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు వ్యాపారంలో కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
తులా రాశి
ఈ రాశివారు వ్యాపారం కోసం అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తుల ఇమేజ్ చాలా బాగుంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది. ఉద్యోగులు పనిపై దృష్టి సారించాలి
వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులతో అనుచితంగా ప్రవర్తించవద్దు. అంతా అయింది అనుకున్న పని చివరి క్షణంలో చెడిపోయే అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉండవచ్చు. గందరగోళంగా ఉండే వ్యక్తులను దూరం ఉంచండి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు
ధనుస్సు రాశి
ఈ రాశివారు వ్యాపారంలో లాభం సాధిస్తారు. అనుకున్నపనులన్నీ ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆనందం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అన్నదమ్ముల నుంచి వ్యతిరేకత రావచ్చు. మీ విషయంలో అందరూ మంచి వైఖరి కలిగిఉంటారు. కార్యాలయంలో లక్ష్యాన్ని సాధించడం ద్వారా ఆనందం పెరుగుతుంది.
Also Read: భార్య వ్యవహారాలు భర్తే చూసుకోవాలి.!
మకర రాశి
ఈ రాశివారు వ్యాపారంలో పెద్ద మార్పులు చేయవచ్చు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీ భావజాలం చాలామందిని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగులు తమ పనితీరుతో కార్యాలయంలో పెద్దలను మెప్పిస్తారు.
కుంభ రాశి
ఈ రాశివారు బంధాలకు విలువనిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో వాగ్వాదం జరగొచ్చు. ఈ రాశి వ్యాపారులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులు పెరగడం వల్ల మీ పనిలో కొంత ప్రభావం ఉంటుంది. దురాశకు దూరంగా ఉండాలి.
మీన రాశి
ఈ రాశివారు స్త్రీలపట్ల సరిగ్గా ప్రవర్తించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరుపాటు వద్దు. విలువైన వస్తువు మిస్ అయ్యే అవకాశం ఉంది. పాత వ్యాధులు తిరగబెట్టే ప్రమాదం ఉంది. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ పెట్టాలి.