Image Credit: Pixabay
Sun Transit 2023: ప్రతి గ్రహం 12 రాశుల్లోనూ వరుసగా సంచరిస్తాయి. దాదాపు నెలకోసారి రాశి మారుతుంటాయి. ఆయా సమయంలో ఆ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ప్రభావం ఉంటే మరికొందరికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడి సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. హిందూమతంలో సంక్రాంతి రోజు స్నానానికి, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మే నెల 15న సూర్యుడు మేష రాశినుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలో సూర్య సంచారం చాలా రాశులకు మంచి జరుగుతుంది. ఆ రాశులవారెవరో చూద్దాం..
వృషభ రాశిలో సూర్య సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు పోటీ పరీక్ష రాస్తే మీరు విజయం సాధించే అవకాశం ఉంది. అయితే కుటుంబ వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
సూర్యుడు మీ రాశిలోనే మొదటి ఇంటిలోనే సంచరిస్తాడు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులకు మంచి జరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కెరీర్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
Also Read: బుధుడు-శుక్రుడు కలయికతో అరుదైన యోగం, ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం
మీ రాశినుంచి సూర్యుడు 11వ స్థానంలో సంచరిస్తాడు. ఈ ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృషభ రాశిలో సూర్య సంచారం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాడు. ఈ రాశి వారి జీవితంలో శుభ సమయం ప్రారంభమవుతుంది. కుటుంబంలో, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో గొప్ప విజయం సాధిస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.
Also Read: మే 5న చంద్రగ్రహణం - ఈ రాశులవారి మనసు అస్థిరంగా ఉంటుంది
కన్యా రాశి వారికి ఈ సూర్య సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. సూర్యుడు ఈ రాశిలోని తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీనిని అదృష్టంగా భావిస్తారు. ఈ సమయంలో మీ మనస్సుకు అనుగుణంగా పని జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు శుభసమయం.
వృషభ రాశిలో సూర్య సంచారం అంటే మీన రాశినుంచి మూడో స్థానంలో సంచరిస్తున్నట్టు. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు
Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!
మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది
NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!
Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !