Guppedanta Manasu May 24th: గుప్పెడంతమనసులో ఉప్పెన, కాలేజీ నుంచి రిషి ఔట్ - కొడుకుపై నిందవేసిన జగతి!
Guppedantha Manasu May 24th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు మే 24 ఎపిసోడ్
రిషికి ఏం జరుగుతుందో అనే టెన్షన్లో ఉన్న జగతి...కొడకు నిద్రపోతుండగా రూమ్ కి వెళుతుంది. రిషిని ప్రేమగా చూసి వెనక్కు తిరిగి వచ్చేస్తుండగా నిద్రలేచిన రిషి పిలుస్తాడు.
రిషి: నా గురించి మీరు ఏదో టెన్షన్ పడుతున్నారని అర్థమైంది..ఏదైనా చెప్పలేక బాధపడుతున్నారా..నాకేమైనా సమస్య ఉందా..
జగతి: అదేం లేదు రిషి
రిషి: మీ ప్రాబ్లెమ్ ఏంటి..ఈ టైమ్ లో నా రూమ్ కి.. మీరు టెన్షన్ పడుతున్నది కనస్ట్రక్షన్ కి సంబంధించిన చెక్ గురించా..దానిగురించి మీరు టెన్షన్ పడొద్దు..నాలుగైదు రోజుల్లో డబ్బు రిలీజ్ చేస్తాను.. రేపటి కోసం ఎదురుచూస్తున్నాను..నేను డీబీఎస్టీ మెడికల్ కాలేజీ బాధ్యతలు చేపడుతున్నది రేపే..చాలా ఆనందంగా ఉంది..మీరు నా పక్కనున్నంతవరకూ నాకు ఏ హానీ జరగదు..మీరు జగరగనివ్వరు ఆ నమ్మకం నాకుంది.. ఏవేవో ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దు..అంతా మంచే జరుగుతుంది..మీరు కోరుకున్నట్టే నేను బావుంటాను...
రిషి మాటలు వింటూ ఏడుస్తుంటుంది జగతి..సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది... బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది.. అప్పుడే కిచన్లో నీళ్లు తాగేందుకు వచ్చిన వసుధార చూస్తుంది.
వసు: ఏంటి మేడం రిషి సార్ రూమ్ లోంచి వస్తున్నారని అడుగుతుంది...
ఓసారి నాతో రా అని జగతి వసుని రూమ్ లోకి తీసుకెళుతుంది... చెక్ గురించి మినిస్టర్ గారిదగ్గరకు వెళ్లారుకదా ఏదైనా ప్లాబ్లెమా..అని అడుగుతుంది వసు
జగతి: నేను చెక్ గురించి రిషికి చెప్పలేదు..నువ్వు కూడా చెప్పకు తెలిస్తే బాధపడతాడని చెప్పి..గురుదక్షిణగా నేను ఎది అడిగినా ఇస్తావా అని వసుధారను కోరుతుంది
వసు: మీకోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధం.
జగతి: ఆ ప్రాణాలు రిషి సొంతం..అదేలా అడగ్గలనని ఎమోషనల్ అవుతుంది.
వసు: మీరు నా జీవితం నిలబెట్టిన దేవత. రిషిని నాకు ఇచ్చినందుకు ఆజన్మాంతం మీకు రుణపడిపోయా. గురుదక్షిణతో పాటు మీరు ఏది అడిగినా కాదనకుండా ఇస్తానని జగతికి వసుధార మాటిస్తుంది.
Also Read: మే 24 రాశిఫలాలు, ఈ రాశులవారు ఈరోజు అనుకోని ప్రయోజనం పొందుతారు
డీబీఎస్‌టీ మెడికల్ కాలేజీ ఎండీగా ఫస్ట్‌టైమ్ రిషి మీడియా ముందుకు రాబోతుండటంతో ఫణీంద్ర, జగతితో పాటు అందరూ ఆనందంలో ఉంటారు.. డీబీఎస్‌టీ మెడికల్ కాలేజీ ఎండీగా బాధ్యతల్ని స్వీకరిస్తోన్నానని, ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని రిషి అంటాడు. దేవయాని, శైలేంద్ర కూడా రిషికి కంగ్రాట్స్ చెబుతారు. నువ్వు చాలా గ్రేట్ రిషి అంటూ శైలేంద్ర అతడిని పొగడ్తల్లో ముంచుతాడు. అందరూ కాలేజీకి వెళ్లడానికి బయలుదేరుతారు. శైలేంద్ర మాత్రం తనకు మరో పని ఉందని ఆగిపోతాడు. జగతికి శైలేంద్ర మెసేజ్ చేస్తాడు. ఇదే నీకు చివరి అవకాశం అంటూ వార్నింగ్ ఇస్తాడు.
రిషి కారులోనే జగతి కూడా కాలేజీకి బయలుదేరుతుంది. కాలేజీకి వెళుతుండగా ఎప్పుడూ రిషి వెంట ఉండాలని వసుధారతో చెబుతుంది.రిషి ఏదైనా మాట జారినా అర్థం చేసుకోమని కోరుతుంది. రిషి కోప్పడినా బాధపడవద్దని, కోపానికి కారణం ఏంటో తెలుసుకుని తప్పులు సరిదిద్దుకోమని వసుధారకు జాగ్రత్తలు చెబుతుంది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారని జగతిని రిషి అడుగుతాడు. ఏమీలేదని మాటమార్చేస్తుంది. నీ మేలు కోరుకునే నేను పరోక్షంగా కీడు చేస్తున్నానని మనసులోనే బాధపడుతుంది జగతి. ప్రెస్‌మీట్‌ను నిర్వహించ బాధ్యతను జగతికి అప్పగిస్తాడు రిషి. జగతి మాత్రం ఆ ప్రెస్‌మీట్‌ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకుంటుంది.
Also Read: తెగించేసిన శైలేంద్ర, తలొంచిన జగతి, కాలేజీకి దూరమైపోనున్న రిషి!
జగతి-వసుధార
జగతి దగ్గరకు వసుధార రావడంతో తనకు గురుదక్షిణగా ఇచ్చిన మాటను గుర్తుచేస్తుంది జగతి. ఆ సమయంలో జగతి గురుదక్షిణ కోరడంతో వసుధార షాక్ అవుతుంది.
వసు: మేడం ఏంటిది
జగతి: నేను గురుదక్షిణగా అడిగేది ఇదే..నాకు ఈ ఒక్కసాయం చేయి వసు..లేదంటే రిషి ప్రాణాలకే ప్రమాదం
వసు: సార్ కి ఏం కాదు..
జగతి: శైలేంద్ర...రిషి ప్రాణాలను తీస్తాడు..అక్కడివరకూ రాకుండా రిషి కాలేజీ నుంచి వెళ్లిపోవడమే కరెక్ట్. శైలేంద్ర టైమ్ పెట్టాడు.. రిషి ప్రాణం కోసం ఈ పని చేయడమే కరెక్ట్
వసు: మెడికల్ కాలేజీ ఫండ్స్ మిషన్ ఎడ్యుకేషన్ కోసం వాడడమా..రిషిసార్ తప్పుచేశారంటే ఎవరూ నమ్మరు
జగతి: చట్టాలకి నమ్మకాలతో పనిలేదు ఆధారాలుంటే చాలు..
వసు: నేను చెప్పలేను అంటుంది
గుప్పెడంతమనసు మే 25 ఎపిసోడ్ లో
కోటి రూపాయల చెక్ ఎందుకిచ్చారని జగతి అడుగుతుంది.. పక్కాగా ఆధారాలున్నాయని చూపిస్తుంది..
మిషన్ ఎడ్యుకేషన్ చెక్ పవర్ మీ ఇద్దరిది..మీకు చెప్పకుండా ఎలా బయటకువస్తుందని మినిస్టర్ అడుగుతారు
చెప్పు వసుధారా..మనం ఇచ్చామా ఆ చెక్ అని రిషి నిలదీస్తాడు..వసు ఏమీమాట్లాడలేక ఆగిపోతుంది..కానీ జగతికి ఇచ్చిన మాట గుర్తుచేసుకుంటుంది.