Gruhalakshmi Serial Today January 4Th: ‘గృహలక్ష్మీ’ సీరియల్: పరంధామయ్యను చంపేస్తానన్న లాస్య – ఎస్సైతో అబద్దం చెప్పించిన రాజ్యలక్ష్మీ
Gruhalakshmi Today Episode: తను చెప్పినట్లు తులసి వినకపోతే పరంధామయ్యను చంపేసి నువ్వే చంపావని అందరిని నమ్మిస్తానని లాస్య అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ జరిగింది.
Gruhalakshmi Serial Today Episode: నువ్వు చెబితే తప్పా.. నీకు చెప్పకుండా ఒక్క పని కూడా చేయని నీ ముద్దుల కొడుకు ఎంతలా మారిపోయాడో చూస్తున్నావా అక్కయ్య అంటూ బసవయ్య వెటకారంగా రాజ్యలక్ష్మీని అంటాడు. యాక్సిడెంట్ మాయ, అమ్మాయి చనిపోవడం మాయ అంటూ మనతో ఉన్న నీ అమాయక చక్రవర్తి లటక్కున పార్టీ మార్చేశాడు అంటూ బసవయ్య అనడంతో..
ప్రసూనాంబ: అవును చాలా ఆశ్చర్యంగా ఉంది వదిన ఇటు మనతో ఉన్నట్లు నటిస్తూ.. అటు దివ్యతో ఉన్నట్లు నమ్మిస్తూ… రెండు పడవల ప్రయాణం ఎందుకు చేస్తున్నట్లో..తన మనసులో ఏముందో ఓపెన్‌గా చెప్పేయొచ్చు కదా..
బసవయ్య: ఏం చేస్తాడు పాపం ఇటు అమ్మను వదులుకోలేడు అటు భార్యని వదులుకోలేడు.
అంటూ లేనిపోని కట్టుకథలు అల్లి రాజ్యలక్ష్మీని రెచ్చగొడతారు బసవయ్య, ప్రసూనాంబ. దీంతో చాలా కూల్‌గా
రాజ్యలక్ష్మీ: వాణ్ణి ఎక్కడ ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. ఆ విషయం పక్కన పెట్టండి. ప్రస్తుతం మనల్ని టెన్షన్ పెడుతున్న విషయం చందనని వాళ్ల కంట పడకుండా కాపాడుకోవడం.
అనగానే బసవయ్య మరి ఏం చేద్దాం అని అడుగుతాడు. చందనని ఇప్పుడు ఇంట్లోంచి పంపిచేయాలి అంటుంది రాజ్యలక్ష్మీ. దీంతో స్టోర్ రూం తాళం తీయగానే దెయ్యం రూపంలో ఉన్న చందన బయటకు రాగానే నువ్వు ఇప్పుడు వెళ్లిపో అవసరం అనుకుంటే మళ్లీ పిలుస్తామని రాజ్యలక్ష్మీ చెప్పగానే చందన వెళ్లిపోతుంది. అయితే దూరం నుంచి ఫోన్ మాట్లాడుతున్న విక్రమ్ స్టోర్ రూం వైపు చూస్తాడు. అప్పటికే చందన వెళ్లిపోయి ఉంటుంది. కానీ విక్రమ్ చందనను చూశాడేమోనని రాజ్యలక్ష్మీ, బసవయ్య, ప్రసూనాంబ బయపడుతుంటారు. అయితే విక్రమ్ దగ్గరకు వచ్చి స్టోర్ రూం దగ్గర ఏం చేస్తున్నారని అడిగి వెళ్లిపోతాడు. దీంతో వాళ్లు విక్రమ్ చందనను చూడలేదని ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు లాస్య, డాక్టర్ కలిసి పరంధామయ్యకు తులసి నరరూప రాక్షసురాలని, లాస్య ఈ ఇంటి కోడలని.. తులసికి నరకం చూపించాలని హిప్నటైజ్ చేస్తారు. ఇంతలో కాఫీ తీసుకుని తులసి రావడంతో లాస్య తులసిని ఆపి బయటకు గెంటివేస్తుంది. లోపలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తుంది.
లాస్య: లోపలికి వెళ్లితే ఆయన నిన్ను చీ కొడతారు. గొడవ పడితే మెడపట్టి బయటకు తోస్తారు. ఇంకా అరిస్తే టెన్షన్‌తో చనిపోతారు. నందు మీ అమ్మ చావుకు కారణమయ్యాడని నువ్వు వాళ్ల నాన్నను చంపేశావని ప్రచారం చేస్తాను. అప్పుడు నందుతో సహా అందరూ నమ్ముతారు.
తులసి: ఎందుకు ఎందుకు నా మీద ఇంత పగ పట్టావు. దయచేసి నన్ను మామయ్య నుంచి దూరం చేయకు. నాకీ ప్రపంచంలో మిగిలింది కేవలం అత్తయ్య, మామయ్య మాత్రమే..
అంటూ తులసి బాధపడుతుంటే నువ్వు నందూను నా నుంచి దూరం చేశావు. అప్పుడు నీకు కనీసం మామయ్య, అత్తయ్య ఉన్నారు. కానీ నందు నాకు దూరం అయ్యాక నేను ఒక్కదాన్నే ఉన్నాను. అనుభవించు అంటూ లాస్య తిడుతుంది. దీంతో తులసి బాధపడుతూ వెళ్లిపోతుంది. చందన ఫోటో తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన విక్రమ్, దివ్యలకు ఎస్పై ఏదో ఎక్వైరీ చేసినట్లు చేసి అసలు ఈ అమ్మాయే లేదు మీకు డాక్టర్ చెప్పినట్లు నిజంగానే పిచ్చి ఉన్నట్లుంది అంటాడు. దీంతో విక్రమ్, దివ్య నిరాశగా వెళ్లిపోతారు. ఎస్పై రాజ్యలక్ష్మీకి ఫోన్ చేసి మీ అబ్బాయి కోడలు వచ్చారు. మీరు చెప్పమ్మన్నట్లే చెప్పాను అంటాడు. రాజ్యలక్ష్మీ ఎస్సైకి థాంక్స్ చెప్పి డబ్బులు పంపిస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు వ్రతం చేసుకోవడానికి లాస్య హడావిడి చేస్తుంటే.. నంద కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లాస్యను ఒక్కదానివే వ్రతం చేసుకోమని చెప్తాడు నంద. దీంతో పరంధామయ్య నంద మీద కోప్పడితే.. నేను ఆయనకు నచ్చజెప్తాను మీరు టెన్షన్ పడొద్దు మామయ్య అంటుంది. దీంతో పరంధామయ్య కోపంగా ప్రతి దానికి వారి మధ్యలో దూరుతున్నావు అసలు నీకు సిగ్గుందా అంటూ తులసిని తిడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.