Gruhalakshmi November 6th : లాస్య కుట్రను తులసి ఛేదిస్తుందా? – హనీమూన్‌కు జాను వెళ్తుందా?
సామ్రాట్ గారి కంపెనీ సీఈవోగా తులసి రంగ ప్రవేశం చేయడంతో గృహలక్ష్మీ సీరియల్ ఇవాళ్టి ఏపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
బోర్డు మీటింగ్ గురించి రత్న, ధనుంజయ్ టెన్షన్ పడుతుంటే లాస్య వాళ్లతో వెటకారంగా మాట్లాడుతుంది. నేను ఏ విషయంలోనూ టెన్షన్ పడను ఎదుటివారికి టెన్షన్ క్రియేట్ చేస్తాను అని చెప్తుంది లాస్య. ఇంతలో మేనేజర్ అక్కడికి రాగానే ధనుంజయ్ మేనేజర్‌ను ఇక్కడికి ఎందుకొచ్చావ్ అంటూ ప్రశ్నిస్తాడు.
లాస్య: పిలిచింది నేను.
రత్న: అతను నీకెలా తెలుసు?
లాస్య: నేను కూడా ఇంతకు ముందు సామ్రాట్ గారి ఆఫీసులో పని చేశాను.
అని మేనేజర్ ను చెప్పిన పని ఏమైందని అడుగుతుంది లాస్య. అంత పరెఫెక్ట్‌గా ఉందని అందరు బోర్డు మెంబర్స్ ధనుంజయ్ గారిని సీఈవో గా ఒప్పుకున్నారని చెప్తాడు. లాస్య మేడం ను నమ్ముకుంటే మీరిక ఆ దేవుడికి కూడా మొక్కాల్సిన పని ఉండదని మేనేజర్ చెప్పడంతో రత్న, ధనంజయ్ హ్యాపీగా లాస్యను పొగుడుతుంటే..
లాస్య: ఇక పొగడ్తలు ఆపండి. నాకు పెద్దగా పొగడ్తలు ఇష్టం ఉండదు. ఇక ఉంటుంది చూడండి తులసికి డబుల్ ధమాకా. రేపటి బోర్డు మీటింగ్ తో కంపెనీ దూరం. కోర్టు కేసుతో హని దూరం. గోవిందా.. గోవిందా..
అంటూ సంతోషపడుతుంటారు రత్న, లాస్య, ధనంజయ్...
మరోవైపు తులసి వాళ్ల ఇంట్లో హనీ పులి మాస్క్ వేసుకుని తులసిని భయపెడుతుంది.
హని : ఆంటీ పులి వచ్చింది. తినేస్తుంది.
తులసి: నాకు భయమేస్తుందమ్మ.. నన్నేం చేయోద్దు ప్లీజ్ పులి.
హని : పులికి జాలి ఉండదు. అది కౄర మృగమని మా టీచర్ చెప్పింది.
తులసి : నువ్వు కౄర మృగానివే కావొచ్చు నేను మంచి దాన్ని కదా.. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేను వండిపెడుతున్నాను కదా ప్లీజ్ నన్ను వదిలేయ్ అమ్మ.
సరే నా హోం వర్క్ చేసిపెట్టు అప్పుడు నిన్ను వదిలేస్తా అని హని అనగానే దొంగ పిల్ల హోంవర్క్ కోసం ఇంతకు తెగిస్తావా? అంటూ సరేలే అంటుంది తులసి. ఇంత పెద్ద సమస్య ఉన్నా చిన్న పిల్లతో హాయిగా ఆడుకుంటుంది తులసి అంటూ మాట్లాడుకుంటారు నంద, వాళ్ల అమ్మ, నాన్న. రేపే బోర్డు మీటింగ్ ఎం చేయాలో నాకు అర్థం కావడం లేదు తులసేమో అన్ని తాను చూసుకుంటానని చెప్తుంది అంటాడు నంద.
హని: ఆంటీ కోర్టు అంటే మీకన్నా పెద్దదా?
తులసి: కోర్టు అంటే నాకంటేనే కాదు అందరికంటే గొప్పది.
హని: అంటే కోర్టు చెప్పిన మాట నువ్వు కూడా వినాల్సిందేనా?
తులసి: ఎవరైనా వినాల్సిందే? కోర్టు చెప్పినట్లు చేయాల్సిందే?
హని: వినకపోతే..
తులసి: జైళ్లో పెడతారు.
అని తులసి చెప్పగానే హని భయపడుతుంది. నంద షాక్ అవుతాడు. హని భయపడుతూ కోర్టు నుంచి ఏదో నోటీసు వచ్చిందట కదా నేను ఎప్పటికైనా వాళ్ల దగ్గరకు వెళ్లాల్సిందేనా అంటూ అడుగుతుంది. నువ్వు ఇవేవీ పట్టించుకోకుండా హ్యాపీగా ఉండు అన్ని నేను చూసుకుంటాను అని చెప్తుంది తులసి.
విక్రమ్, దివ్య లగేజీ సర్దుకుని కారు దగ్గరకు వస్తారు.
దివ్య: మొదటిసారి అత్తగారింటికి వెళ్తున్న కొత్త పెళ్లికూతురులా ముఖం ఏంటి అలా పెట్టావు. మనం వెళ్లేది. హనీమూన్ కి బాబు కాస్త నవ్వు ముఖం పెట్టు.
విక్రమ్: అది కాదు దివ్య అమ్మకు చెప్పకుండా ఇంత వరకు నేను ఎక్కడికి వెళ్లలేదు. ఇదే మొదటిసారి. గిల్టీగా అనిపిస్తుంది.
దివ్య: సరే అయితే ఒక వీడియో తీసి అత్తయ్య గారికి పంపిస్తాను. అలాగే ఉండు
అంటూ దివ్య వీడియో తీయబోతుంటే విక్రమ్ వద్దు అంటూ ఆడ్డుకుంటాడు. ఇంతలో లోపలి నుంచి జాను వాళ్ల నాన్న వచ్చి అల్లుడు సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్లావు కాబట్టి నీకు చెప్పేంత వాణ్ని కాదు అంటాడు. దివ్య, విక్రమ్ బై చెప్పి వెళ్లిపోతారు. జాను తన సంగతేంటని వాళ్ల నాన్నను అడుగుతుంది. మనం కూడా వాళ్ల వెనకాలే వెళ్లి వాళ్ల హనీమూన్‌ను చెడగొట్టాలని నిర్ణయించుకుంటారు.
బోర్డు మీటింగ్ మొదలవుతుంది. అందరూ మీటింగ్ హాల్‌లో కూర్చుని ఉంటారు.
లాస్య: మేనేజర్ గారు బోర్డు మెంబర్స్ అందరికీ సిట్యూవేషన్ ఎక్స్ ప్లేన్ చేశారు కదా..
మేనేజర్: చేశాను మేడం. నేను చెప్పిన దానికి అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.
లాస్య: గుడ్ ... థాంక్యూ ఆల్.. ధనంజయ్ గారు సామ్రాట్ గారి రక్త సంబంధీకులు, ఆయన కజిన్. తమ్ముడి మరణం గురించి తెలియగానే యూఎస్‌లో తనకున్న ఆస్తులు, బిజినెస్‌లు అన్నీ వదులుకుని సామ్రాట్ గారి ఫ్యామిలీకి అండగా నిలబడటానికి వచ్చారు. సామ్రాట్ గారికి ధనంజయ్ గారికి ఉన్న అనుబంధం అలాంటిది.
అందరూ చర్చించుకుని సామ్రాట్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మన కర్తవ్యం. కాబట్టి పార్మాలిటీ కోసం రిజల్యూషన్ పాస్ చేద్దామని లాస్య సూచించగా ఇంకొక ఇంపార్టెంట్ బోర్డు డైరెక్టర్ రాలేదని వాళ్లు రాగానే రిజల్యూషన్ పాస్ చేద్దామని చెప్తారు. ఇంతలో నందగోపాల్, తులసి అక్కడకు వస్తారు. మేనేజర్ వెళ్లి వాళ్లను సగౌరవంగా మీటింగ్ హాల్‌కు తీసుకొస్తాడు. అందరూ చప్పట్లతో స్వాగతం పలుకుతారు. లాస్య, రత్న, ధనంజయ్ షాక్ అవుతారు. తులసికి మేనేజర్ ఫోన్ చేసి లాస్య, రత్న, ధనంజయ్ చేస్తున్న ప్లాన్లు మొత్తం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది తులసి.
తులసి: ఈరోజు మీటింగ్ అజెండా ఏంటో తెలుసుకోవచ్చా?
లాస్య: అది అడగటానికి నువ్వెవరు? చెప్పటానికి అతనెవరు? ఏ హక్కుతో ఈ మీటింగ్ హాల్‌లోకి నువ్వు ఎంటర్ అయ్యావు. సీఈవో సీట్లో కూర్చున్నావు.
తులసి: అడగాల్సిన ప్రశ్నలు అన్ని అయిపోయాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఇంకేం లేవని మర్యాదగా వచ్చిన దారినే వెళ్లిపో అంటూ తులసిని హెచ్చరిస్తుంది లాస్య. ధనంజయ్ గారిని ఈ కంపెనీ సీఈవోగా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని లాస్య చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ముగుస్తుంది.