Chinni Serial Today October 28th: చిన్ని సీరియల్: మ్యాడీ కోసం నాగవల్లి కన్నీళ్లు.. దీపావళికి అసలు ట్విస్ట్ ఇదే!
Chinni Serial Today Episode October 28th మ్యాడీ కోసం నాగవల్లి చాలా బాధపడటం వసంత నాగవల్లికి సారీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి ఏడుస్తూ శ్రీకృష్ణుడికి దండం పెట్టుకుంటుంది. నేను మ్యాడీని కనకపోయినా యశోదమ్మ నిన్ను పెంచుకున్నట్లు నేను మ్యాడీని పెంచుకున్నాను.. మ్యాడీ దూరం అయినందుకు నేను చాలా చాలా బాధపడుతున్నాను.. తట్టుకోలేకపోతున్నా.. వీలైనంత త్వరగా నా బిడ్డ నా ఇంటికి వచ్చినట్లు దీవించు అని కోరుకుంటుంది.
వసంత మొత్తం విని నాగవల్లి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తుంది. నా కొడుకు చేసిన తప్పునకు మీ కొడుకు మీకు దూరం అయ్యాడు.. మేం మీ ఇంటికి రాకపోయి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. మేం రోడ్డున పడి అడుక్కుతిని ఉన్నా మీతో పాటే మ్యాడీ ఉండేవాడు.. మా వల్ల మీకు అన్నయ్యకు మ్యాడీ దూరం అయినా మీరు పళ్లెత్తి మాట కూడా అనడం లేదు నాకు మీరు శిక్షించాలి అని వసంత కొట్టుకుంటుంది. 
నాగవల్లి వసంతని ఓదార్చుతుంది. తలరాత మనం మార్చలేం కదా.. మ్యాడీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత మొదటి దీపావళి వాడితో గ్రాండ్‌గా చేసుకోవాలి అనుకున్నాకానీ ఇలా అయిపోయింది.. శాంతి యాగం ఫలిస్తుంది మ్యాడీ తిరిగి వస్తాడు అందరం కలిసి సంతోషంగా దీపావళి చేసుకుంటాం అని సంబర పడిపోయాను.. నేను ఇంటికి వెళ్లి బతిమాలినోడు ఇంకెలా వస్తాడు అని ఏడుస్తుంది. మ్యాడీ కచ్చితంగా వస్తాడు బామ్మర్ది గారు ఆలోచిస్తున్నారు అని ప్రమీల అంటుంది.
శ్రేయ తల్లిని పట్టుకొని మామయ్య బావని తీసుకురావడానికే వెళ్తున్నట్లున్నారు.. మామయ్య అనుకుంటే కచ్చితంగా అవుతుంది బావ మన ఇంటికి వస్తే మనకు అసలైన దీపావళి పండగే అని శ్రేయ అంటుంది. 
మధు మ్యాడీ ఇంకా తను ఇచ్చిన కొత్త డ్రస్‌లో రాలేదేంటా అని చూస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ బయటకు రావడం చూసి హీరోలా ఉన్నాడు అనుకుంటుంది. మ్యాడీకి ఓ జలక్ ఇవ్వాలి అనుకొని పూలు గుమ్మానికి కడుతున్న మధు కుర్చీ మీద నుంచి పడిపోయినట్లు నటిస్తుంది. దాంతో మ్యాడీ వెళ్లి మధుని పట్టుకుంటాడు. ఒకరిని ఒకరు కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటారు.
లోహిత చూసి కోపంగా ఏయ్ మధు మ్యాడీ ఇంకా ఎంత సేపు అలా పట్టుకుంటాడు ఇక లెగు అని అంటుంది. తర్వాత మధు, మ్యాడీ ఇద్దరూ పువ్వులు కడతారు. మధు మ్యాడీనే చూస్తూ సిగ్గు పడుతుంది. స్వరూప పూజ చేసి అందరినీ హారతి తీసుకోవడానికి పిలుస్తుంది. అందరూ హారతి తీసుకుంటారు. మ్యాడీకి మధు బొట్టు పెడుతుంది. లోహిత వరుణ్‌కి బొట్టు పెడుతుంది. 
మ్యాడీ నాగవల్లిని గుర్తు చేసుకొని బాధ పడతాడు. వరుణ్ అందరితో ప్రతీ దీపావళికి మా అత్తయ్య మ్యాడీకి పూజ చూపించి ఇలాగే హారతి ఇచ్చేది.. అమెరికా వెళ్లిన తర్వాత వీడియో కాల్‌లో చూపించేది..ఈ సారి మ్యాడీ దగ్గరుండి హారతి తీసుకుంటా అని అత్తయ్యతో చెప్పాడు.. అని వరుణ్ చెప్పడంతో మధు వాళ్లు చాలా ఫీలవుతారు. మా అత్తయ్య కూడా ఈసారి గ్రాండ్‌గా దీపావళి చేసుకోవాలి అనుకుంది దీనికి నేనే కారణం అని వరుణ్ బాధ పడతాడు. మధు మనసులో ఎలా అయినా ఈరోజు మ్యాడీ వాళ్ల అమ్మానాన్నలతో సంతోషంగా ఉండేలా చేయాలి అనుకుంటుంది.
దేవేంద్ర వర్మ మ్యాడీని గుర్తు చేసుకొని బాధ పడతాడు. ఏంటి మ్యాడీ ఇది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే అమ్మానాన్నని కాదని ఇలా బాధ పెట్టడం ఏంటి అని అనుకుంటాడు. మరో వ్యక్తి దేవాకి కాల్ చేసి మినిస్టర్ కూతురి పెళ్లి ఆగిపోయినందుకు ఆయన మీ మీద పగ పట్టాడు సార్ ఏదో చేయాలి అని చూస్తున్నాడు అని అంటాడు. దేవా మనసులో మ్యాడీ నువ్వు వరుణ్ పెళ్లి చేయడం వల్ల నా మిత్రువులే శత్రువులు అయిపోయారు అనుకుంటాడు.
మధు మ్యాడీని తీసుకొని స్కూటీలో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే మధు చెప్పదు.. నీతో కష్టం మధు అని మ్యాడీ అంటే ఇప్పుడే నాతో కష్టం అంటున్నావ్ జీవితాంతం ఎలా భరిస్తావ్ అంటుంది. అదేంటి అని మ్యాడీ అంటే అదే ఫ్రెండ్‌గా జీవితాంతం ఎలా భరిస్తావ్ అన్నాను అంటుంది. ఇష్టంగా భరిస్తాలే అని మ్యాడీ చెప్తాడు. 
మ్యాడీ మధుని టైలరింగ్ ఎక్కడ నేర్చుకున్నావ్ అంటే కావేరిని గుర్తు చేసుకొని మా అమ్మ నేర్పింది అంటుంది. ఇక మ్యాడీ రూట్ చూసి మా ఇంటి వైపు ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ల ఇళ్లు ఇటు వైపే అని అంటుంది. మ్యాడీని ఓ చోట ఆపి నేను మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్తా నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది. నాగవల్లి గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. దేవా రావడంతో మ్యాడీ వచ్చాడని నాగవల్లి సంతోషపడుతుంది. కానీ మ్యాడీ రాడు. నాగవల్లి చాలా బాధపడుతుంది. దేవా కోపంగా ఇటు ఇంట్లో అటు ఆఫీస్‌లో ఎక్కడా మనస్శాంతిగా లేను అని అంటాడు. మధు మ్యాడీ వాళ్ల ఇంట్లోకి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















