Chinni Serial Today January 8th: చిన్ని సీరియల్: అంగరంగ వైభవంగా మధు, మ్యాడీల పెళ్లి తంతు! లోహిత దగ్గర ఎమోషనలైన మధు!
Chinni Serial Today Episode January 8th మధు, మ్యాడీల పెళ్లి తంతు ఏర్పాటు చేయడం మధు తల్లిదండ్రులు రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode శ్రేయ బాధ పడుతూ ఉంటే నాగవల్లి సంతోషంగా ఉండమని అంటుంది. అది ఎలా అత్త నా వల్ల కాదు అని శ్రేయ అంటే.. భవిష్యత్ సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు ఉండాలి తప్పదు అని అంటుంది. ఇక దేవా బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే తిలక్ వచ్చి నమస్తే మంత్రి గారు అంటాడు. దానికి దేవా నమస్తే కంత్రీ గారు అంటాడు.
ఏమన్నావ్ అని తిలక్ అంటే మంత్రి గారు అన్నాను అంటాడు. మరి నాకేంటీ కంత్రీ అన్నట్లు వినిపించింది అని అంటే దేవా నవ్వుతాడు. నీ కొడుకు పెళ్లి అలా చేసినందుకు కోపంగా ఉన్నట్లున్నావ్ అని తిలక్ అంటే ముందు కోపం వచ్చింది కానీ వాళ్ల పెళ్లి దైవ నిర్ణయం అని నాగవల్లి చెప్పిన తర్వాత కోపం పోయింది. అయినా కోపం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మన స్నేహం మాత్రం కలకాలం ఉంటుంది. పద అని లోపలికి తీసుకెళ్తారు.
మధు రెడీ అయి రెడీ అయ్యారా శ్రీవారు అని అంటుంది. దానికి మ్యాడీ మనం భార్యాభర్తలం కాదు అని చెప్పా కదా ఇలా శ్రీవారు.. భర్త అని ఏవండి అని పిలవకు అంటాడు. నాకు అలాగే ఇష్టం అని మధు అంటుంది. అలా పిలవకు అని మ్యాడీ అంటే సరే మ్యాడీ అని పిలుస్తాలే అని చెప్పి రెడీ అవ్వమని అంటుంది. నాకు ఇష్టం లేదు నేను రెడీ అవ్వను అని మ్యాడీ అంటే ఎవరు చెప్తే నువ్వు రెడీ అవుతావో నాకు తెలుసు అని అత్తయ్యా అంటూ పిలుస్తూ బయటకు వెళ్తుంది. మ్యాడీ రెడీ అవ్వమని అంటే అవ్వడం లేదు మీరే చెప్పండి అంటే చెప్తాను అని నాగవల్లి వెళ్తుంది.
నాగవల్లి మ్యాడీతో నీ పెళ్లి తంతు చూడాలి అని మాకు కూడా ఉంటుంది కదా నాన్న.. డాడీ పరువు కూడా ముఖ్యం కదా.. త్వరగా రెడీ అవ్వు అని చెప్తుంది. మ్యాడీ సరే అంటాడు. మధు అత్తతో ఇప్పుడు మీ మాట విన్నాడు.. భవిష్యత్‌లో నా మాట వినేలా చేస్తా అంటుంది. అది ఎప్పటికీ జరగదు అని నా మాటే వింటాడు అని నాగవల్లి అంటుంది. నీ నోటి తోనే నువ్వే చిన్ని అని మ్యాడీకి చెప్పిస్తా నీ గొయ్యి నువ్వే తవ్వుకునేలా చేస్తా అని నాగవల్లి అంటుంది.
మ్యాడీ తల్లిదండ్రులు వస్తారు. మధు తల్లిదండ్రులను చూసి దేవా, నాగవల్లి కోపంగా చూస్తారు. ఇద్దరూ లోపలికి రావడంతో కోపం పక్కన పెట్టి మర్యాదగా మాట్లాడుతారు. తిలక్ వచ్చి ఎవరు అని అడిగితే వియ్యంకులు అని పరిచయం చేస్తారు. స్వరూప పేరు కూడా నాగవల్లికి తెలీకపోవడంతో అడిగి తిలక్‌కి చెప్తుంది. దాంతో పేరు కూడా తెలుసుకోకుండా వియ్యంకులు అయ్యారు అని అంటే నీ చలవే అని దేవా అంటాడు. తిలక్ సుబ్బారావుతో నా ఫోన్ నెంబరు ఇస్తా ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి అని చెప్తారు.
నాగవల్లి లోహితను పిలిచి వాళ్లని మధు దగ్గరకు తీసుకెళ్లమని చెప్తుంది. అంతా చూస్తున్న శ్రేయ అమ్మా నా కళ్ల ముందే బావ పెళ్లి తంతు ఇంకెవరితోనో జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నా అని అంటుంది. భరించే తప్పదు అని వసంత అంటుంది. మ్యాడీ పెళ్లి కొడుకులా రెడీ అవుతూ ఉంటే మధు చూస్తూ మురిసిపోతుంది. మధు, మ్యాడీ మాట్లాడుకుంటూ ఉంటే స్వరూప వాళ్లు వస్తారు. మధు మ్యాడీని ఆటపట్టించి నవ్వుతూ ఉంటే కూతురు అలా నవ్వు కోవడం చూసి మురిసి పోతారు.
మధు, మ్యాడీలను పెళ్లి తంతుకి తీసుకొస్తారు. లోహిత మధుని తీసుకొస్తుంటుంటే మధు లోహితతో మేనమామే మేనకోడలిని పెళ్లి కూతురిగా తీసుకెళ్తాడు. నాకు అదృష్టం లేకపోయినా నా మేనమామ కూతురివి నువ్వు నన్ను తీసుకెళ్తే బాగున్ను అనుకున్నా దానికి దేవుడు సహకరించినట్లున్నాడు అందుకే నాగవల్లి ఆంటీ ఈ పని నీకు అప్పగించిందని మధు అంటుంది.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















