Podharillu Serial Today January 8th: ప్రతాప్ మనుషులకు మహా,చక్రి దొరికిపోయారా..? మహా వెళ్లిపోవడంతో ఇప్పుడు భూషణ్ పరిస్థితి ఏంటి..?
Podharillu Serial Today Episode January 8th: మహాను వెతకమని ప్రతాప్ తన మనుషులను పంపిస్తాడు. ఓచోట మహా కారును అడ్డగించిన రౌడీలను తప్పించుకుని చక్రి కారు తీసుకుని పారిపోతాడు.

Podharillu Serial Today Episode: మహా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులంతాఎంతో కంగారుపడుతుంటారు. చక్రి కూడా లేకపోవడంతో వాడే మహాను తీసుకెళ్లి ఉంటాడని అనుకుంటారు. ఇంతలో ప్రతాప్,ఆది ఫోన్లు లిప్ట్ చేయకపోయేసరికి భూషణ్ నేరుగా ప్రతాప్ వాళ్ల ఇంటికి వచ్చేస్తాడు. మహా ఎక్కడని నిలదీస్తాడు.అసలు ఇంట్లో ఉందా లేక ఎవరితోనో వెళ్లిపోయిందా అంటూ ప్రశ్నిస్తాడు. భూషణ్ మాటలకు నిహారికకు కోపం వస్తుంది..నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తుంది.అసలు నీ టార్చర్ భరించలేకే మహా ఇల్లు వదిలి వెళ్లిపోయిందని....చదవుకున్న అమ్మాయతో ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలియదని అంటుంది. ఎవరైనా ఫోన్ లిప్ట్ చేయకపోతే అర్థరాత్రి 200సార్లు మిస్‌కాల్ ఇస్తారా అంటూ నిలదీస్తుంది. దీనికి భూషణ్ మరింత మండిపడిపోతాడు. రేపు పెళ్లిపెట్టుకుని ఇవాళ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిన దానిని వెనకేసుకుని వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మీరు ఏం చేస్తారా నాకు తెలియదని...తెల్లారేసరికి అమ్మాయి పెళ్లిమండపంలో ఉండాలని భూషణ్ అంటాడు. దీనికి ప్రతాప్ కూడా సమాధానమిస్తాడు. పెళ్లి ఆగిపోయిందంటే నా ఇంటిపరువు కూడా పోతుందని....కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో తెల్లారేసరికి మహాను ఇంటికి తీసుకొస్తామంటూ బయలుదేరతారు.వారి వెంట భూషణ్ కూడా వెళ్తాడు.
కారులో వెళ్తూ మరోసారి ఫోన్‌లో సీసీకెమెరా ఫుటేజ్ చూస్తారు ప్రతాప్. కెమెరాలు ఆపకముందు ఉన్న వీడీయోచూసి ఆశ్చర్యపోతారు. మహా ఇంట్లో నుంచి సూటుకేసు తీసుకుని వచ్చి చక్రికి ఇవ్వడం చూసి భూషణ్ మరింత రెచ్చిపోతాడు. మీ అమ్మాయి డ్రైవర్‌తో లేచిపోయిందని అనడంతో ప్రతాప్‌కు కోపం వస్తుంది. మర్యాదగా మాట్లాడకుంటే ఏం చేస్తానో నాకే తెలియదని అంటాడు. నీతో పెళ్లి ఇష్టం లేదని నా కూతురు మొదటి నుంచి చెబుతూనే ఉందని...మేమే బలవంతంగా ఆమెను పెళ్లికి ఒప్పించామని అంటాడు. పెళ్లి ఇష్టం లేక డ్రైవర్ హెల్ఫ్ తీసుకుని వెళ్లిపోయిందని...నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని చెబుతాడు. దీంతో భూషణ్ మరింత వాదిస్తాడు. డ్రైవర్‌తో లవ్‌లో ఉందని తెలసి..తొందరపడి నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని అంటాడు. అసలు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోందని అంటాడు. ఇంతలో ప్రతాప్ వాళ్ల మనుషులకు ఫోన్ చేసి మహాను వెతకమని చెబుతాడు. దారిలో ఉన్న వాళ్ల దుకాణాల ముందు ఉండే సెక్యూరిటీని రోడ్డుమీదకు పంపి అన్ని కార్లు చెక్ చేయమని చెబుతాడు. ఇంతలో కారులో భూషణ్ ఆది, ప్రతాప్‌ను విసిగిస్తూనే ఉంటాడు. చక్రి మహా కోసమే మన ఇంట్లో చేరాడని..కావాలనే నా కారు ఢీకొట్టి ఇంట్లో చోటు సంపాదించాడని అంటాడు. అంతకు ముందు నుంచే మహాకు, చక్రికి పరిచయం ఉందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాడు. భూషణ్ మాటలకు ప్రతాప్, ఆదికి విసుగొస్తుంటుంది. అసలు నీప్రవర్తన నచ్చకే వెళ్లిపోయిందని...ఇలా విసిగిస్తుంటే ఏ ఆడపిల్ల మాత్రం నీతో పెళ్లికి ఒప్పుకుంటుందని ప్రతాప్ తీవ్రస్థాయిలో మండిపడతాడు. ఇంకోసారి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని అంటాడు. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే...కన్న కూతురు అని కూడా చూడనని ఇద్దరినీ చంపేస్తానని అంటాడు. ఇంతలో తన మనుషులకు ఫోన్ చేసి వాళ్లిద్దరూ ఎక్కడ కనిపించినా ఆ డ్రైవర్‌ను చంపేసి నా కూతురుని తీసుకుని రమ్మని తన మనుషులను పురమాయిస్తాడు. ఇంతలో ప్రతాప్ మనుషులు మహా వాళ్లను అడ్డగిస్తారు. కానీ చక్రి వాళ్లను తప్పించుకుని కారు ముందుకు తీసుకెళ్లిపోతాడు. దీంతో రౌడీలు మహాను తరుముతుంటారు.





















