Chinni Serial Today January 3rd: చిన్ని సీరియల్: మధు జీవితంలో ఊహించని మలుపు! నాగవల్లి షాకింగ్ నిర్ణయం.. మధుకి మంచిరోజులు వచ్చాయా!!
Chinni Serial Today Episode January 3rd నాగవల్లి మధు, మ్యాడీలకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీ ఇంట్లోకి వస్తుంటే దేవా ఆపి మధుని షూట్ చేయడానికి గన్ గురి పెడతాడు. మధు తల్లిదండ్రులు దేవా కాళ్లు పట్టుకొని ఏం జరిగిందో మీకు తెలుసు కదా బాబు.. మా అమ్మాయి తప్పు ఏం లేదు.. తనని ఏం చేయొద్దని అంటారు. ఎవరిది తప్పో ఎవరికి ఒప్పో నాకు బాగా తెలుసు తప్పుకోండి అని అంటాడు.
మధుకి అడ్డంగా మ్యాడీ వచ్చి తప్పు నాది డాడీ నన్ను చంపేయ్ డాడీ.. చావు అన్నది నన్ను దాటాకే మధు దగ్గరకు వెళ్లాలి అంటుంది. మధు మ్యాడీని తప్పించి.. నా వల్ల తప్పు జరిగిందని.. మీ డాడీ అంటున్నారు కదా.. నా వల్లే మీ ఫ్యామిలీ బాధ పడుతున్నారు కదా.. మీ అందరి సంతోషం కోసం నేను హ్యాపీగా చచ్చిపోతా అని అంటుంది. శ్రేయ మామతో నా మెడలో తాళి కట్టాల్సిన బావతో తాళి కట్టించుకుంది.. చంపేయ్ మామయ్య అంటుంది. అందరూ దేవాకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంతలో నాగవల్లి హారతి పళ్లెంతో వచ్చి అందరికీ షాక్ ఇస్తుంది.
మధు అయితే బిత్తరపోతుంది. దేవా చేతిలో గన్ పక్కకి పెట్టి శుభకార్యం జరిగిన చోటు అశుభం జరగకూడదు అని అంటుంది. శ్రేయ జీవితం నాశనం అయింది కదా అని దేవా అంటే శ్రేయ జీవితం నాశనం అయింది అని ఎందుకు అనుకుంటావ్ బావ.. దానికి మ్యాడీ కంటే మంచి భర్త వస్తాడేమో.. ఏ విషయంలో అయినా కూడా మనుషులం ప్రయత్నం మాత్రమే చేయగలం. దేవుడు మాత్రం అనుకున్నది చేసేస్తాడు.. చేసేశాడు.. అయినా మధుకి ఏం తక్కువ బంగారు బొమ్మలా ఉంటుంది. మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్‌లా ఉంటుంది. హెల్పింగ్ నేచర్‌కి పర్మినెంట్ అడ్రస్‌లా ఉంటుంది. పైగా మన మ్యాడీకి బెస్ట్ ఫ్రెండ్.. సో మనం అందరం ఈ పెళ్లిని అంగీకరించాలి.. కొత్త కోడలిని ఇంటికి వెల్ కమ్ చెప్పాలి అని చెప్పి దిష్టి తీస్తుంది.
దేవా కోపంగా వెళ్లిపోతాడు. నాగవల్లి మహి, మధులకు హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్తుంది. దేవా నాగవల్లితో నాకు అస్సలు నచ్చలేదు.. ఆ మధుని అక్కడే చంపేస్తానంటే నువ్వు అడ్డుకున్నావ్.. అసలు ఇదంతా ఆ తిలక్ గాడి వల్ల రాజకీయంగా నన్ను ఎదుర్కొలేక నా కొడుకు జీవితం నాశనం చేశాడు. వాడిని వాడికి సపోర్ట్ చేసిన ఆ ఊరి జనాన్ని వదలను.. ఊరి మొత్తాన్ని తగలబెట్టేస్తా అని ఆవేశపడతాడు. నాగవల్లి దేవాని ఆపి తొందరపడొద్దని చెప్తుంది. మధు, మ్యాడీల పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడు నువ్వు ఏం చేసినా నెగిటివ్ అయిపోతుంది. నీ రాజకీయ జీవితం నాశనం అయిపోతుంది. నాకు మధు మన కోడలు అవ్వడం ఇష్టం లేదు.. కానీ అందరి దృష్టిలో మధుని అంగీకరించినట్లే ఉండాలి.. గుడి సంప్రదాయాన్ని అంగీకరించినట్లే ఉండాలి. ఇక మధు అంటావా అది మ్యాడీతో కాపురం చేయడానికి రాలేదు.. చావడానికి వచ్చింది.. తొందర్లోనే మధు చావుకి ముహూర్తం పెట్టి దాని అడ్డు తప్పిస్తా.. శ్రేయ పెళ్లి కూడా మ్యాడీతో చేయిస్తా..ఇదంతా మన చేతికి మట్టి అంటకుండా చేస్తా నువ్వు ఆవేశపడకు అని చెప్తుంది.
మధు తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. చిన్నిగా మ్యాడీ మనసు గెలుచుకోవాలి అనుకున్నావ్,, కానీ మధులా అతని భార్య అయిపోయావ్.. ఇప్పుడు నువ్వే చిన్ని అని తెలిస్తే నీ జీవితం ఏమైపోతుంది అని అంటారు. నా గురించి బాధ పడొద్దు ఇంత కాలానికి దేవుడు నా కష్టాలు తప్పించడానికి ఈ పెళ్లి చేశాడు.. అని మధు అంటుంది. దేవా అంకుల్ కూడా మంచోళ్లే అని మధు అంటుంది. ఇక స్వప్న ఆంటీతో జాగ్రత్తనే తనకి కోపం ఎక్కువ అని అంటుంది. ఆవిడ కూడా మంచోళ్లేనే అందుకే మా పెళ్లిని అంగీకరించారు అని అంటుంది. ఇంతలో నాగవల్లి వస్తుంది. మధుతో ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావ్,, నా తర్వాత ఈ ఇంటి యజమానివి నువ్వే.. మీరు టెన్షన్ పడకండి.. ఇప్పుడు మనం వియ్యంకులం అని నాగవల్లి అంటుంది.
స్వరూప నాగవల్లితో మీతో వియ్యం అందుకునే స్థాయి మాది కాదు కానీ మీరు ఆ హోదా మాకు ఇచ్చారు అని అంటుంది. ఇంతలో నాగవల్లి అవునమ్మా మధు మీ ఆయన ఎక్కడ అని అడుగుతుంది. ఇంతలో మ్యాడీ వస్తాడు. మీ నాన్న కోపంగా ఉన్నారు ఏం అనుకోకు అంటుంది. నాకు తెలుసు అమ్మా నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని అంటుంది. ఇక స్వరూప మధు చేతిని నాగవల్లి చేతిలో పెట్టి మధుని జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. మధుకి జాగ్రత్తలు చెప్తారు. తల్లిదండ్రులు వెళ్లిపోవడంతో మధు చాలా ఏడుస్తుంది. నాగవల్లి మధుతో అమ్మ వెళ్లిపోయిందని బాధ పడకు అమ్మలా చూసుకునే ఈ అత్త ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















