Lakshimi Raave Maa Intiki Serial Today January 2nd:సింధూకు పెళ్లి ఇష్టం లేదన్న సంగతి లక్ష్మీకి తెలిసిపోయిందా..? మ్యాడీని పాము ఎలా కాటేస్తుంది..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 2nd: సింధూ,మ్యాడీ మాట్లాడుకోవడం విన్న లక్ష్మీ ఆ విషయం గోపికి చెప్పేందుకు వెళ్తుంది. ఆమెకు తోడుగా వచ్చిన మ్యాడీని పాము కాటేస్తుంది.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: లక్ష్మీని చూసేందుకు పెళ్లికొడుకు బుల్లిరాజు కోటేశ్వరరావు ఇంటికి వస్తాడు. ఆసమయంలో లక్ష్మీ అక్కడ లేకపోవడంతో నూకాలు కంగారుపడుతుంది. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడేమోనని భయపడుతుంది. కానీ అప్పటికీ బుల్లిరాజు ఫుల్‌గా తాగిరావడం వల్ల పెద్దగా పట్టించుకోడు. లక్ష్మీకి జున్ను ఇచ్చి వెళ్లిపోతానని చెప్పడంతో ఆమె స్నానం చేస్తోందని నూకాలు అబద్ధం చెబుతుంది. దీంతో బుల్లిరాజుకు ఫోన్లు వస్తుండటం జున్ను అక్కడే పెట్టి వెళ్లిపోతాడు. ఇంతలో లక్ష్మీని తీసుకుని రమ్మని నూకాలు భర్తను పెద్దయ్య ఇంటికి పంపిస్తుంది. పెద్దయ్యు దగ్గు బాగా ఉండటంతో లక్ష్మీ కషాయం చేసి తీసుకుని వచ్చి ఇస్తుంది.
ఆస్ట్రేలియా పారిపోవడంఆగిపోవడంతో సింధూ తన గదిలో ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమెను మ్యాడీతో పాటు ప్రియంవద ఓదారుస్తారు. పెళ్లి చేసుకోవాల్సి వస్తే చావనని చస్తానని అంటుంది. ఇంతలో అక్కడికి సింధూ వాళ్ల అమ్మ హైమావతి వచ్చి ఏం జరుగుతోందని నిలదీస్తుంది. నిజంగా నువ్వు మేకప్ కిట్ కోసమే ఊరు వెళ్తున్నావా అని నిలదీస్తుంది. నిజమేనని సింధూ అనగా...ఆమె కోప్పడుతుంది. ఆ సూటుకేసులో ఉన్న బట్టలన్నీ నేనే ఐరన్ చేసి పెట్టాను..మళ్లీ మీరు ఐరన్ కోసం తీసుకెళ్తున్నారంటే నమ్మేంత పిచ్చిదాన్ని కాదని మండిపడుతుంది. ఇంతలో ప్రియంవద కల్పించుకుని...సింధూకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు కూడా తెలుసుకదా అందుకే మ్యాడీ ఆమెను ఆస్ట్రేలియా పంపించేందుకు ఇంట్లోనుంచి పారిపోవడానికి సాయం చేయబోయాడని చెబుతుంది. బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే అక్క చచ్చిపోతానంటుందని మ్యాడీ వాళ్ల అమ్మతో చెబుతాడు. ఇంకో ఐదు నిమిషాలు లక్ష్మీ రాకపోయి ఉంటే ఈ పాటికి మా అక్క వెళ్లిపోయి ఉండేదంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మీ ఈ మాటలన్నీ వింటుంది. ఆమె చేతిలోని గ్లాస్‌కిందపడిపోవడంతో అందరూ బయటకు వస్తారు. సూర్యనారాయణ వచ్చి ఏమైందని అడగ్గా...గ్లాస్ చేయిజారిపోయిందని చెప్పి వెళ్లిపోతానంటుంది. ఇంత రాత్రివేళ ఒంటరిగా ఎలా వెళ్తావని మ్యాడీని తోడుగా వెళ్లమని పెద్దయ్య చెబుతాడు.
గదిలోకి వెళ్లిన తర్వాత సింధూకు వాళ్ల అమ్మ సర్దిచెబుతుంది. నీతమ్ముడు చిన్నతనంలో తెలియక ఏదో పిచ్చిపిచ్చి సలహాలు ఇస్తుంటే...నువ్వుకూడా వాటిని ఎలా నమ్ముతున్నావని కోప్పడుతుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన దానివి ఇలా చెప్పాపెట్టకుండా పారిపోతే...ఈ ఇంటి పరువు ఏం కావాలని నిలదీస్తుంది. దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరిస్తుంది. దీంతో ప్రియంవద కల్పించుకుని వాళ్ల వదినపై అరుస్తుంది. నీకూతురు పెళ్లివద్దన ఏడుస్తుంటే...మీరేమో పరువు, ప్రతిష్ఠ అంటూ పాకులాడుతున్నారని మండిపడుతుంది. నీకన్నా నీ కొడుకే నయమని అంటుంది. ఇంతలో లక్ష్మీ గోపి దగ్గరకు వెళ్లడానికి వెళ్తుంది. సింధూకు ఈ పెళ్లి ఇష్టంలేదని అన్నయ్యకు చెప్పేయాలని అనుకుంటుంది. తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే...వెనక నుంచి మ్యాడీ వస్తాడు. ఇద్దరూ కలిసి నడుస్తుంటారు. మీ అక్క బాగా చదువుకుంది కదా ఈ పల్లెటూరు సంబంధం ఎలా ఒప్పుకుందని లక్ష్మీ ఆరా తీస్తుంది. ఇప్పుడు తెలుసుకుని నువ్వు ఏం చేస్తావు అని అంటాడు. నిజంగా మీ అక్కకు నచ్చే ఈ పెళ్లి చేసుకుటుందా లేక మీ తాతయ్య చెప్పాడని చేసుకుంటుందా అని అంటుంది. నా బుర్రతినకుండా మాట్లాడకుండా నడువు అని మందలిస్తాడు. మీరు మాట్లాడుకున్నది నేను విన్నానని చెప్పబోతుండగా...మ్యాడీని పాము కరుస్తుంది. ఇంతలో ఆమె నోటితోనే విషం బయటకు తీస్తుంది. అప్పుడే అక్కడికి కోటేశ్వరరావు వస్తాడు. మ్యాడీని పాము కాటేసిందని చెప్పడంతో వెంటనే ఆటోలో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తారు. పరీక్షించిన వైద్యులు...ఇక్కడ పాముకాటుకు వాడే మెడిసిన్ లేదని శ్రీకాకుళం నుంచి తెప్పించాలని అంటాడు.





















