Illu Illalu Pillalu Serial Today January 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: పారిపోయిన భాగ్యం, ఇడ్లీబాబాయ్! ప్రేమకు వల్లీ మీద డౌట్‌కి కారణమేంటి?
Illu Illalu Pillalu Serial Today Episode January 3rd నర్మద, ప్రేమలకు అమూల్య ప్రేమ వెనక ఎవరో ఉన్నారని అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode భాగ్యం తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి చలిలో ఇద్దరికీ చల్లని నీరు చల్లుకునేలా చేస్తుంది. మీ వల్లే విశ్వ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అంటుంది. నర్మదకు నువ్వు సలహా ఇవ్వడం వల్లే ఇదంతా అని.. అయినా మళ్లీ మనం ఎలా గెలవాలా అని చూడాలి కానీ తల్లిదండ్రులకు టార్చర్ పెట్టుకూడదు అని భాగ్యం అంటుంది.
వల్లీ కోపం తగ్గపకపోవడంతో మళ్లీ ఇద్దరి మీద చల్లని నీళ్లు పడేస్తుంది. పాపం భాగ్యం, ఇడ్లీబాబాయ్ గజగజ వణికిపోతారు. భాగ్యం సలహా ఇస్తాను అని విశ్వ, అమూల్యలకు పెళ్లి చేసేయాలని అంటుంది. వల్లీ కోపంతో ఇద్దరి మీద మళ్లీ చల్లని నీరు పోసేస్తుంది. నర్మద, ప్రేమలకు ప్రేమ రాయబారిని అని తెలిస్తే నన్ను చంపేస్తారు. ప్రస్తుతం మనకు ఉన్న ఒకే ఒక మార్గం ఆ బండోడు నుంచి తప్పించుకోవడం.. మీరు ప్రస్తుతానికి ఎక్కడికైనా పారిపోండి అని అంటుంది. మేం పారిపోతాం కానీ నీ సంగతి ఏంటి మరి ఎదురింటిలోనే ఉంటావ్ కదే అని అంటే వాడు మా ఇంట్లోకి రాలేడు.. ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయను అని అంటుంది.
వల్లీ ఇచ్చిన ఐడియాతో భాగ్యం, ఇడ్లీబాబాయ్ వెళ్లిపోతారు. ప్రేమ ఇంట్లో దూపం వేస్తూ ఉంటుంది. ధీరజ్‌కి సారీ చెప్తూ ప్రతీ చోట సారీ సారీ అని పేపర్ల మీద రాసి అతికించి ఉంటుంది. వాటిని చూసి ధీరజ్ చిరాకు పడి చింపేస్తూ ఉంటాడు. ఎన్ని చేసినా తగ్గడం లేదు ఏం చేయాలా అని అనుకుంటూ చిరాకుగా నర్మద దగ్గరకు వెళ్తుంది. ఏంటి సిస్టర్ చాలా హుషారుగా ఉన్నావ్ అని అంటుంది. అక్కా అని ప్రేమ అంటుంది. ఏంటి అక్క అసలే ధీరజ్ నాతో మాట్లాడటం లేదని నేను ఫీలవుతుంటే నువ్వు జోకులు వేస్తున్నావ్ అంటుంది. జరిగిన గొడవ చిన్నది కాదు కదా ధీరజ్ మాట్లాడాలి అంటే కాస్త టైం పడుతుందని నర్మద అంటుంది.
ప్రేమ బాధ పడుతూ నేను చాలా చిల్లరగా ప్రవర్తించాను అక్క. మా అన్నయ్య నాతో అమూల్య లవ్ చేసింది అంటే గుడ్డిగా నమ్మేశాను.. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.. అమూల్య ప్రేమించింది అంటే నాకు అస్సలు నమ్మకం కుదరడం లేదు అక్క.. ఈ విషయంలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అక్కా అని ప్రేమ అంటుంది. వల్లీ వెనకనుంచి మొత్తం వింటూ ఉంటుంది. అనుమానాలు ఏంటి అని నర్మద అడుగుతుంది.
అమూల్యకి మా వాడు అంటే ఇష్టమే లేదు అక్క ఇంత వరకు వాడితో మాట్లాడనే లేదు.. కచ్చితంగా ఎవరో ఒకరు అమూల్యని మార్చేసి ఉంటారు అక్క. అమూల్యని ట్రాప్ చేసుంటారక్కా.. అని అంటుంది. అవును ప్రేమ నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది. విశ్వని ప్రేమించమని అమూల్యకి ఎవరు చెప్పుంటారు అని నర్మద అంటుంది. ఇద్దరినీ డైవర్ట్ చేయాలి అని వల్లీ మధ్యలో దూరి అందరిలాగే వాళ్లు ప్రేమించుకొని ఉంటారు అని వల్లీ అంటుంది. అందరూ వేరు అమూల్య వేరు అక్క రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు ఉన్నాయి అని తెలిసి అమూల్య అలా ఎలా చేస్తుంది అని నర్మద అంటుంది.
ప్రేమ, ధీరజ్‌లకు తెలీదా మరి వాళ్లు ప్రేమించుకోలేదా వీళ్లు పెళ్లి చేసుకోలేదా అని అడుగుతుంది. ఇంట్లో అందరూ బాధ పడుతున్నారు కదా హ్యాపీ చేద్దాం పదండి అని అంటుంది. వల్లీ టాపిక్ డైవర్ట్ చేయడం ప్రేమకి అర్థమై అక్క నువ్వు ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తుంటే నాకు ఎందుకో నీ మీద అనుమానం వస్తుందని అంటుంది. నాలాంటి మంచిదాన్ని అనుమానిస్తే మీ కళ్లు పోతాయ్ అని చెప్తుంది.
వల్లీ ఇంట్లో అందరిని పిలుస్తుంది. అందరినీ జంటలుగా కూర్చొపెడుతుంది. అమూల్యని కూడా తీసుకొచ్చి కూర్చొపెడుతుంది. అందరం అంత్యాక్షరి ఆడుకుందామని అంటుంది. వేదవతి కోపంగా అందరూ బాధగా ఉంటే నీకు ఇలాంటి ఆటలు కావాలా అని తిడుతుంది. దానిని వల్లీ ఇంట్లో అందరూ బాధ పడుతుంటే బాలేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















