Chinni Serial Today December 4th: చిన్ని సీరియల్: మధు వల్ల తూగిన మ్యాడీ.. శ్రేయ కన్నీళ్లు! అసలు ట్విస్ట్ ఏంటంటే!
Chinni Serial Today Episode December 4th మహికి జరిగిన తులాభారంలో మధు తులసి దళం వేసి మహికి చిన్నిని గుర్తు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహికి తులాభారం జరుగుతుంది. నగలు, బంగారం, డబ్బు ఇలా అన్నీ వేస్తారు అయినా మహి తూగడు. నాగవల్లి, దేవాలు కూడా తన ఒంటి మీద బంగారం వేసినా మహి తూగడు. ఇక మధు పంతుల్ని అడిగి నేను ప్రయత్నిస్తా అని అంటుంది. తనకి ఈ ఇంటికి ఏం సంబంధం లేదు అని లోహిత అంటే నేను మ్యాడీ ఫ్రెండ్‌ని అని మధు అంటుంది.
పంతులు దానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు స్నేహితులకు ఎంత విలువ ఇస్తాడో మనకు తెలుసు కదా.. అటుకులు తెచ్చిన స్నేహితుడు కుచేలుడికి ఐశ్వర్యం ప్రసాదించాడు ఆ మహానుభావుడు నీ ప్రయత్నం నువ్వు చేయమ్మా అని అంటారు. మధు సరే అని కృష్ణుడి దగ్గర తులసీదళం తీసుకొని దండం పెట్టి వేస్తుంది. దాంతో మహి ఒక్కసారిగా తూగుతాడు. మధు చాలా సంతోషపడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. మహి మనసులో చిన్ని నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అప్పుడు తూగింది.. ఇప్పుడు మధు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు తూగింది అనుకుంటాడు. ఇద్దరి మధ్య నిజంగా అంత మంచి స్నేహం ఉందన్నమాట అని దేవా అనుకుంటాడు. ఇది చిన్ని కాబట్టి తూగిందని నాగవల్లి అనుకుంటుంది.
మహి కోపంగా గదిలోకి వెళ్లి చిన్ని విషయంలో ఎలా జరిగిందో ఇప్పుడు మధు విషయంలో అలాగే జరిగింది ఏంటి అని కోపంగా పెళ్లి కూతురి బొమ్మని పట్టుకొని కిందకి విసిరికొట్టాలి అనుకున్నప్పుడు మధు అడ్డుకుంటుంది. ఆవేశంలో చిన్నప్పటి జ్ఞాపకాలు పోగొడుతున్నావని అమ్మానాన్న మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది అలా అని వాళ్లతో ఉన్న జ్ఞాపకాలు పోగొట్టేస్తావా.. మా అలక కోపం పోయాక వాళ్ల దగ్గరకు వెళ్లిపోతాం కదా.. చిన్ని విషయంలోనూ నువ్వు అలాగే ఆలోచించావు.. మళ్లీ చిన్ని నీ జీవితంలోకి వస్తుందని అంటుంది.
చిన్ని ఎప్పటికీ నా జీవితంలోకి రాదు అని మహి అంటే అలా ఎలా చెప్తావ్ మ్యాడీ. భవిష్యత్ మనకు తెలీదు అని ఎగిరే గుర్రం కథ చెప్తుంది. భవిష్యత్‌లో కోపం పోవచ్చు.. ప్రేమ కలగొచ్చు.. లేదంటే చిన్ని వాళ్ల అమ్మ నిర్దోషి అని తేలొచ్చు.. అని అంటుంది. మధు మాటలకు మ్యాడీ ఆ బొమ్మని పగలగొట్టదని అంటాడు. బొమ్మని పట్టుకొని చూస్తాడు.
నాగవల్లి తులాభారం గురించి ఆలోచిస్తుంటే లోహిత వెళ్లి మధు ఇలా చేస్తుందని తనే చిన్ని అని తెలిసేలా చేస్తుందని నాకు తెలుసు ఆంటీ.. ఆ చిన్ని అలియాస్ మధు చాలా ముదురు.. మ్యాడీని కన్విన్స్ చేసి కరిగించేస్తుంది. భవిష్యత్‌లో ఇలాగే జరుగొచ్చు మీరే ఏదో ఒకటి చేసి చిన్నిని మ్యాడీ జీవితం నుంచి కట్ చేయాలి అని అంటుంది. మ్యాడీ, శ్రేయ ఇద్దరూ నా ఫ్రెండ్స్ ఆంటీ ఇద్దరూ సంతోషంగా ఉండటం నాకు కావాలి అంటుంది. మేం కూడా అదే ఉద్దేశంలో ఉన్నాం.. శ్రేయ నా కోడలు అని చిన్నప్పుడే అనుకున్నాం.. ఎన్ని అడ్డుంకులు వచ్చినా శ్రేయ సంతోషంగా ఉండేలా చేస్తా మ్యాడీతో పెళ్లి చేస్తా అని నాగవల్లి అంటుంది.
శ్రేయ ఏడుస్తూ ఉంటుంది. లోహిత చూసి అందరికీ చెప్తే బాగుంటుందని అనుకుంటుంది. అందరినీ పిలుస్తుంది. శ్రేయ అందరినీ పట్టుకొని ఏడుస్తుంది. బావే నా ప్రాణం అనుకున్నా.. బావ లేకుండా నా జీవితం వేస్ట్ అనుకున్నా నేను ఇంతలా బావని ప్రేమిస్తుంటే బావ నన్ను 1 శాతం కూడా ప్రేమించడం లేదు.. మధుకి ఇస్తున్న ప్రాముఖ్యత కూడా నాకు ఇవ్వడం లేదు తనతో ఉన్నంత క్లోజ్‌గా నాతో ఉండటం లేదు బావకి ఆ మధు ఫ్రెండ్‌నో మరదలో అర్థం కావడం లేదు.. ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేస్తున్నాడు తులాభారంలో నేను ఎన్ని నగలు వేసినా బావ తూగలేదు.. ఆ మధు తులసి ఆకు వేయగానే తూగాడు.. కనబడని ఆ చిన్నితో కనిపించే ఈ మధుతో ఉన్న స్నేహం నాతో ఉండదా.. అలాంటి బావ కోసమా నేను అమెరికా వెళ్లకుండా ఉండిపోయింది..అలాంటి బావ కోసమా నా మనసా వాచా కర్మనా నేను భర్తగా ఊహించుకుంది.. అక్కర్లేదు నాకు ఈ బతుకు నాకు ఇంత విషయం పెట్టేయండి అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















