Illu Illalu Pillalu Serial Today December 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు:వల్లీ 2.0: ప్రేమ-ధీరజ్ లవ్ ఫైట్! తిరుపతి ఎమోషనల్.. విశ్వ ఇచ్చిన చీరలో అమూల్య!
Illu Illalu Pillalu Serial Today Episode December 4th అమూల్య విశ్వ ఇచ్చిన చీర కట్టుకోవడం వేదవతి చీర ఎవరు ఇచ్చారని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమలు వల్లీకి వార్నింగ్ ఇస్తారు. ఇక నుంచి నీ బతుకు నువ్వు చూసుకో.. నీ కాపురం నీది లేదు అని వేరే వేషాలు వేస్తే నీ సంగతి చెప్తా అని నర్మద అనడంతో ఇక నుంచి నేను మంచికి మారుపేరులా ఉంటాను.. కొత్త వల్లీని చూస్తారు అని ఒట్టు పెడుతుంది.
ప్రేమ నర్మదతో పాము ఈ వల్లీ ఒక్కటే అక్క ఇది మారడం అసాధ్యం అంటే లేదు మారుతుంది అని నర్మద అంటుంది. ఇక వల్లీ బయటకు వెళ్లి బస్తాలను ప్రేమ నర్మద అని చితక్కొడుతుంది. ప్రేమ చూసి మారిపోతుంది అన్నావ్ కదా చూడు అటు అని దగ్గరకు తీసుకెళ్తుంది. ఏంటి అక్క బస్తాలతో బాక్సింగ్ చేస్తున్నావ్.. మమల్ని ఈ బస్తాలు అనుకొని కొడుతున్నావ్ కదా అని ప్రేమ అడుగుతుంది. దానికి వల్లీ చపాతి పిండి గట్టిగా కొట్టడమే నాకు చేత కాదు మిమల్ని ఊహించుకొని కొడతానా.. వల్లీ 2.0 చూస్తారు అని అంటుంది. ప్రేమ నర్మదతో ఈ జలగ జన్మలో మారదు అక్క.. దీని సంగతి మామయ్యకి చెప్దాం అని ప్రేమ అంటుంది. నర్మద ఆపి అది మనకు అక్క దాని బుద్ధి మనమే మార్చాలి.. అని అంటుంది. ఎలా మార్చుతాం అక్కా అని ప్రేమ అంటే తనని జాబ్‌కి వెళ్లేలా చేద్దాం.. ఇంట్లో ఖాళీగా ఉంది కదా అందుకే ఇలాంటి పనులు చేస్తుంది.. వర్క్‌లో పడితే ఇంకేం గుర్తుండవులే అంటుంది.
అమూల్య విశ్వ ఇచ్చిన చీర కట్టుకొని అద్దం ముందు చూసుకొని మురిసిపోతుంది. విశ్వది మంచి టేస్ట్ అని అనుకుంటుంది. మురిసిపోతూ బయటకు వెళ్తుంది. వేదవతి చూసి ఈ చీర ఎక్కడిది నేను నీకు కొనలేదు కదా అని అంటే వల్లీ వదిన ఇచ్చిందని అంటుంది. ఇంతలో ధీరజ్ చూసి ఏంటమ్మా ఇది నేను అడిగితే మా ఫ్రెండ్ ఇచ్చిందని అన్నావ్ ఇప్పుడు వల్లీ వదిన ఇచ్చిందని అంటున్నావ్ ఎవరు ఇచ్చారు అని రెట్టించి అడుగుతుంది. వల్లీ వదిన కూడా ఇలాంటిదే ఇచ్చింది కన్ఫ్యూజ్ అయ్యా అంటుంది. వేదవతి వల్లీని పిలిచి అడిగితే నేను ఇలాంటిదే ఇచ్చా అంటుంది. నీ ప్రవర్తన ఈ మధ్య తేడాగా ఉందని వేదవతి అంటే భయపడుతుంది వదిలేమ్మా అని ధీరజ్ అంటాడు.
వల్లీ మరదలితో ఏంటి ఈ చీరల గొడవ అని అడిగితే విశ్వ పూజకి కట్టుకోమని గిఫ్ట్ ఇచ్చాడని అంటుంది. అబ్బో అప్పుడే చీరలు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకునే వరకు కథ వచ్చిందా అంటుంది. అమూల్య నవ్వుకుంటుంది. ఇక తిరుపతిని బయటకు రామరాజు గెంటేయడంతో తిరుపతి గేటు బయట నిల్చొని ఏమైందమ్మా ఈ నాడు.. చినబోయాడా సూరీడు అని పాట వేసుకుంటాడు. అప్పుడే ధీరజ్, సాగర్ వచ్చి నీకు అసలు ఆ నగలు సంగతి ఎందుకు మామ ముందే మాకు చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాళ్లం కదా అంటారు. ఓరేయ్ అవన్నీ ఎందుకురా ఏదో ఒకటి చేసి మీ నాన్నకి ఒప్పించి నన్ను లోపలికి తీసుకెళ్లండిరా.. చలికి పోయేలా ఉన్నా అంటాడు. అయితే దుప్పటి తీసుకొస్తా అంటారు. ఇంతలో చందు వచ్చి నేను నాన్నతో మాట్లాడుతా అంటాడు. ఇంతలో రామరాజు వచ్చి ఏంట్రా అక్కడ మీటింగ్ అనగానే ముగ్గురు పరుగులు పెడతారు.
రామరాజు రాగానే తిరుపతి ఎమోషనల్ అయి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నాకు అన్ని.. మీ కోసం నా ఇంటికి వదిలేసి వచ్చేశా.. నిన్ను నాన్నలా మా అక్కని అమ్మలా చూసుకున్నా.. మేనల్లుళ్లతో స్నేహంగా ఉన్నాను.. నిజానికి ఇంట్లోకి రావడానికి నాకు నీ పర్మిషన్ అక్కర్లేదు వచ్చే హక్కు నాకు ఉంది కానీ నువ్వు అంటే నాకు విపరీతమైన గౌరవం బావ అందుకే ఇక్కడే ఉన్నాను.. చనిపోయే వరకు ఇక్కడే ఉంటా.. నీ కోసం ప్రాణం ఇస్తా అని నిరూపించుకుంటా అని అంటాడు.
చంద్ర, సాగర్, ధీరజ్‌లు నాన్న ఈ ఒక్క సారికి మామయ్యని క్షమించండి అని అంటారు. ఇక రామరాజు తిరుపతిని క్షమించి లోపలికి రానిస్తాడు. అందరూ పూజలో కూర్చొంటారు. ప్రేమ ధీరజ్ పక్కనే కూర్చొని ఉంటుంది. ధీరజ్‌ని చూసి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇంత జరిగిందని ధీరజ్ అన్న మాట గుర్తు చేసుకొని ప్రేమ పక్కకి జరుగుతుంది.. ధీరజ్ ప్రేమని చూసి ప్రేమ పక్కకి వెళ్తాడు. ఏంటే జరిగి జరిగి మీ పుట్టింటికి వెళ్లిపోతావా ఏంటి అని అడుగుతాడు. నేను వెళ్లేది ఏంటి నువ్వే ఏదో ఒకరోజు గెంటేస్తావ్ అని అంటుంది. నన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని ఫీలవుతున్నావ్.. ఇప్పుడు నీ పక్కనే ఉంటే జలగలా వదలను అని అనుకుంటావ్ అందుకే పక్కనే ఉండను అంటుంది. కోపంలో అలా అనేశా అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమ పక్కకి జరిగితే కొంగు మీద కూర్చొండి పోతాడు. నా చీర వదులురా అని ప్రేమ అంటే పట్టుకుంది మధ్యలో వదలడానికి కాదు ఇప్పుడు పారిపో చూద్దాం అని అంటాడు. ఇద్దరూ గిల్లి గజ్జాలు అడుకుంటారు. తిరుపతి చూసి ఓరే ఓరే చిన్నల్లుడు మీరు పూజ గదిలో ఉన్నాం అనుకున్నారా మీ గదిలో ఉన్నాం అనుకున్నారా ఆ రొమాన్స్ ఏంట్రా అని అంటాడు. అందరూ నవ్వుతారు. పూజ కూడా పూర్తవుతుంది. ఆడవాళ్లు మొత్తం భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు చెప్తారు. ధీరజ్ ప్రేమని చూసి కాలర్ ఎగరేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















