Ammayi garu Serial Today December 3: అశోక్ హత్య చేశాడని రాజు,రూపకు ఎలా తెలిసిపోతుంది..? కోర్టులో విరూపాక్షికి శిక్షపడిందా లేదా..?
Ammayi garu Serial Today Episode December 3: చిట్‌ఫండ్ సంస్థ మేనేజర్‌ను అశోక్ హత్య చేశాడని తెలుసుకున్న రాజు..అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. సీసీ ఫుటేజ్ వీడియో కోర్టలో సమర్పించి రూప సమయం కోరుతుంది.

Ammayi garu Serial Today Episode: కోర్టులో విరూపాక్షి కేసుపై ట్రయల్ నడుస్తూ ఉంటుంది. అక్కడికి సీఎం సూర్య కూడా రావడంతో విజయాంబిక భయపడుతుంది.భార్యను కాపాడుకోవడానికి వచ్చాడా ఏంటిరా అని కొడుకును అడుగుతుంది. అత్తయ్యే హత్య చేసినట్లు నిరూపించేలా సాక్ష్యాలు తారుమారు చేశానని...ఆమెను కాపాడటం దేవుడివల్ల కూడా కాదంటాడు.ఇంతలో కేసు వాదోపవాదనలు జరుగుతుంటాయి. తాను కేవలం పేదల డబ్బులు తిరిగి ఇవ్వమనే చిట్‌ఫండ్ మేనేజర్‌ను బెదిరించిందని...కానీ ఎవరో కావాలనే ఆమెను ఈ కేసులో ఇరికించారని విరూపాక్షి తరపుు లాయర్ వాదిస్తాడు. ఇంతలో డిఫెన్స్ లాయర్ కూడా తన వాదనలు వినిపిస్తాడు. విరూపాక్షి తరఫున వాదనలు వినిపించిన లాయర్ కట్టుకథలు చెప్పాడని చెబుతాడు. ఎమ్మెల్యే భూదందాలు, దౌర్జన్యాలకు అలవాటుపడి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని అనడానికి ఈ హత్య ఓ ఉదాహరణ అని అంటాడు. ఇంతకు ముందు కూడా పేదలకు ఇళ్లపట్టాలు ఇప్పిస్తానని చెప్పి భూదందా చేయాలని చూశారని గుర్తుచేస్తాడు.తనే ఈ హత్య చేసిందనడానికి సాక్ష్యాలు ఉన్నాయని అంటాడు.
కోర్టులో సాక్ష్యాలు చూపించేందుకు రాజు,రూప వస్తుండగా...దారిలో కారు ఆగిపోతుంది. అది బాగు చేసుకుంటూ ఉండగా...అక్కడ ముగ్గురు మనుషులు మాట్లాడుకోవడం రాజు వింటాడు. నిన్న నా దగ్గరకు ఒకడు వచ్చి మేం చెప్పినట్లు చేస్తే...10వేలు ఇస్తానని చెబితే చేశామంటారు. విరూపాక్షి కారులో వెళ్తుండగా...ఆమె కిందకు దిగి వచ్చేలా గొడవ చేయమన్నాడని...మేం అలా చేశామని చెప్పుకుంటారు. ఈ మాటలన్నీ రాజు, రూప వింటారు. వెంటనే రాజు వాళ్ల దగ్గరకు వెళ్లి గొడవపడతారు. మీరు చేసిన పనివల్ల ఓ మర్డర్ జరిగిందని చెబుతాడు. మీరు చేసిన గొడవ వల్లే ఎమ్మెల్యేగారు జైలుపాలయ్యారని మండిపడతాడు. అసలు మీకు డబ్బులిచ్చి నాటకం ఆడమన్నది ఎవరని నిలదీస్తాడు. ఎవరో తెలియదని వాళ్లు చెప్పగా....ఇంతలో తన ఫోన్‌లో ఉన్న ఫొటోలన్నీ చూపిస్తాడు. ఎన్ని చూపించినా వాళ్లు కాదని అంటారు. ఇంతలో అశోక్ ఫొటో చూపించగానే....వాళ్లు ఇతనే డబ్బులిచ్చాడని చెబుతారు. దీంతో రాజు,రూప షాక్‌కు గురవుతారు. వీడు ఈ హత్య చేసి ఉంటాడని అసలు ఊహించలేదని రాజు అంటాడు. వెంటనే అశోక్‌కు ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ఛాప్ అని వస్తుంది. మనం ఆలస్యం చేస్తే....కోర్టులో అమ్మకు శిక్షపడుతుందని రూప చెప్పగా..నువ్వు వెళ్లి ఏదోలా మేనేజ్ చేయ్యి...ఈలోగా నేను అశోక్‌ను తీసుకుని వస్తానని రాజు చెప్పి పంపించేస్తాడు.
అశోక్ నెంబర్‌ను తన ప్రెండ్‌కు పంపించిన రాజు....అర్జెంట్‌గా ఇతను ఎక్కడ ఉన్నడో లొకేషన్ ట్రేస్ చేయమని చెబుతాడు. కోర్టులో జడ్జి తీర్పు చదువుతుండగా...రూప అక్కడికి వస్తుంది. తన తల్లి నిర్దోషి అని నిరూపించే సాక్ష్యాలు ఉన్నాయని చెబుతుంది. తన వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో ఉన్న సీసీ టీవీ వీడియో చూడమని ఇస్తుంది. అందులో ఒకడు చేతిలో గన్ పట్టుకుని తలకు టోపి పెట్టుకుని బయటకు వెళ్తున్న వీడియో ఉంటుంది. ఈ హత్య మా అమ్మ కాకుండా అతను చేసి ఉండొచ్చు కదా అని చెబుతుంది. వెంటనే ఢిపెన్స్ లాయర్ కలుగజేసుకుని...మేం వీడియో ఆధారాలు ఇస్తే ఫేక్ అని చెప్పారు....ఇప్పుడు ఈ వీడియో కూడా ఫేక్ వీడియో అయ్యి ఉండొచ్చు కదా అని వాదిస్తాడు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అంటాడు. దీంతో రూప అన్ని ఆధారాలు చూపుతాం కొంచెం సమయం ఇవ్వాలని కోరడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.





















