Jagadhatri Serial Today December3: నిషిక అప్పుగా డబ్బు తీసుకున్న విషయం కౌషికి చెప్పేసిన ఇంద్రాణి...ఆ తర్వాత ఏం జరిగింది..?
Jagadhatri Serial Today Episode December3: నిషిక తీసుకున్న డబ్బులు వసూలు కోసం కౌషికి ఇంటికి వచ్చిన ఇంద్రాణి...ఆ విషయం కౌషికి చెప్పేస్తుంది. ఆ తర్వాత కౌషికి ఏం చేసిందన్నది సస్పెన్స్

Jagadhatri Serial Today Episode: పేపర్‌లో యాడ్ చూసినప్పటి నుంచి వైజయంతిలో కంగారు, తడబాటు చూసి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోతారు. వైజయంతిలో లోపలికి వెళ్లగానే ఆమె భర్త నిలదీస్తాడు. తెలిసి తెలియక చేసిన తప్పులకు పిల్లలను బలిచేయాడం భావ్యం కాదని అంటాడు. శ్రీవల్లి నీ కూతురేనని నాకు అర్థమవుతోందని అంటాడు. తనని ఇప్పటికైనా అమ్మగా చేరదీసి ఆదరించమని అంటాడు. దీనికి నేనేమీ అడ్డు చెప్పనని అంటాడు. దీంతో అది నా కూతురు కాదురా మెగుడా నీ కూతురు....కన్నుమిన్ను కానక నువ్వు చేసిన తప్పులకు నన్న బలిచేయాలని చూడకు అని మనసులో అనుకుంటుంది. వెళ్లి శ్రీవల్లితో ప్రేమగా మాట్లాడమని చెబుతాడు. నేను వెళ్లి శ్రీవల్లితో ప్రేమగా మాట్లాడతా ఉంటే....నువ్వు ఆ కేదార్‌గాడిని చేరదీస్తావా..అంటూ మండిపడుతుంది. ఇంకొకసారి ఆ శ్రీవల్లి నా కూతురు అంటే నీకు మర్యాదగా ఉండదని కోప్పడుతుంది. ఎవరి కూతురునో పట్టుకుని నీ కూతురు, నీకూతురు అంటావేంటి అని మండిపడుతుంది. నా క్యారెక్టర్‌ను తప్పుబడితే ఊరుకునేది లేదని అంటుంది. ఇలాంటి బుద్ధులన్నీ మీ కొంపలోనే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.తెలిసే రోజు వస్తే అన్నీ తెలుస్తాయని అనడంతో ఆమె భర్త వైజయంతి చెంప పగులగొడతాడు. ఏదైతే ఏం ఈరోజుకు ఆ శ్రీవల్లి, కేదార్ అన్నా చెల్లెల్లు అన్న విషయం బయటపడకుండా దాటవేశానని సంతోషపడుతుంది. ముందు శ్రీవల్లి దగ్గర నుంచి తాను కొట్టేసిన సుహాసిని ఫొటో భద్రంగా ఉందో లేదోనని వెతుకుతుంది. అది భద్రంగానే ఉందని చూసి ఫొటో లోపల పెడుతుండగా...అప్పుడే అక్కడికి నిషిత వస్తుంది. మా దగ్గర ఏం దాస్తున్నావో చెప్పు అంటూ నిలదీస్తుంది. కేదార్‌కు తోడబుట్టిన వాళ్లు ఉన్నారని తెలిసినప్పుడు నేనే అంత షాక్ అయ్యాను. మీ ముఖంలో మాత్రం కోపం అసలు లేదని అడుగుతుంది. కేదార్ వాళ్ల అమ్మ ఫొటో శ్రీవల్లి చూసేసరికి ఎందుకు హారతి కిందపడేశారని నిలదీస్తుంది. న్యూస్ పేపర్‌ను ఎందుకు తగులబెట్టేశారని అడుగుతుంది. మీ ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉందని అంటుంది. దీంతో వైజయంతికి రోషం వస్తుంది.ఇప్పుడు ఇలా అంటున్నావ్ గానీ...కొన్ని రోజుల తర్వాత నిజం తెలిసినప్పుడు నన్ను అన్నందుకు నువ్వే బాధపడతావు అంటుంది. ముందు ఆ శ్రీవల్లి వ్యవహారం తేలుద్దాం అంటుంది. దానికి ఏమై అయితే అందరూ మనల్నే అంటారని నిషిత మండిపడుతుంది. అయితే పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేస్తే ఎలా ఉంటుందని వైజయంతి అంటుంది. నువ్వు సాయం చేస్తే....జాగ్రత్తగా ఆశ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేద్దాం అంటే నిషిత సరేనంటుంది.
ముందు నుంచీ అత్తయ్యగారు శ్రీవల్లి విషయంలో బయపడిపోతుందని జగధాత్రి కేదార్‌తో అంటుంది. దీనికి అతను బదులిస్తూ...ఇన్నిరోజులు శ్రీవల్లి తన కూతురు అనే విషయం బయటపడుతుందేమనని భయపడటంలో అర్థం ఉంది...కానీ ఇప్పుడు అందరికీ నిజం తెలుసుకదా...ఇంకా ఎందుకు భయం అంటాడు. శ్రీవల్లి విషయంలో అత్తయ్యగారు మనందరికి తెలియకుండా ఏదో దాస్తున్నారు కేదార్....అదేంటో మనం కనిపెట్టాలని జగధాత్రి అంటుంది. అత్తయ్యగారు దాస్తున్న నిజం ఏంటో తెలిస్తే గానీ...శ్రీవల్లి చుట్టూ ఉన్న సమస్య ఏంటో తేలిపోతుందంటుంది. ఇందాక కూడా అత్తయ్యగారు పేపర్‌ను కావాలనే కాల్చినట్లు అనిపిస్తుంది అంటుంది. ఎందుకు చేశారంటావ్ అని జగధాత్రి అనగా....మా నాన్న చూస్తారేమోనని అలా చేసి ఉంటుంది అంటాడు. ఏదేమైనా అత్తయ్య కంగారు వెనక ఉన్న కారణం ఏంటో మనం కనిపెట్టాలని జగధాత్రి అంటుంది.
నిషిక తీసుకున్న అప్పు గురించి కౌషికి చెప్పేందుకు ఇంద్రాణి వాళ్ల ఇంటికి వస్తుంది. రంగా ఆమెను వారిస్తాడు...ఇప్పుడు ఈ విషయం కౌషికి తెలిస్తే....నిషిక దగ్గర నుంచి మనకు రావాల్సిన సొమ్ము రాకుండా పోతుందని అంటాడు. నా దగ్గర తన మరదలు అప్పుగా డబ్బు తీసుకుందని తెలిసిన తర్వాత కౌషిక కళ్లల్లో కనిపించే బెరుకి ఎన్ని లక్షలు పోయినా పర్వేదని ఇంద్రాణి అంటుంది. ఇంద్రాణి నేరుగా ఇంట్లోకి రావడం నిషిక చూస్తుంది.ఈ రాక్షసి ఏంటి నేరుగా వచ్చిందంటూ ఎదురుగా వెళ్తుంది. వదిన ఇంట్లో లేదని...ఆమె వచ్చేసరికి ఇంద్రాణిని ఇక్కడ నుంచి పంపించి వేయాలని అనుకుంటుంది. ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతుంది. నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పాను కదా మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. నీ కుటుంబాన్నే మోసం చేస్తున్న దానివి నన్ను మోసం చేయవని గ్యారెంటీ ఏంటని ఇంద్రాణి అంటుంది. మావాళ్లు వచ్చేలోగా ఇక్కడ నుంచి వెళ్లిపో అని నిషిక హెచ్చరిస్తుంది. ఇదంతా అక్కడే ఉన్న జగధాత్రి చూడటం చూసి నిషిక గుండె గతుక్కుమంటుంది. ఎన్నిసార్లు మెడపట్టి గెంటివేసినా రావడానికి సిగ్గుగా లేదా అంటూ ఇంద్రాణిని అంటుంది. ఇంద్రాణిని చూస్తే వదినకు ఎంత కోపం వస్తుందో తెలిసి కూడా ఈమెను పదేపదే ఎందుకు ఇంటికి పిలుస్తున్నావని మండిపడుతుంది. అసలు ఇంద్రాణితో నీకు ఉన్న పనేంటి..? బిజినెస్ లెక్కలన్నీ ముగిసిపోయాయి కదా.. ఇంకా ఏం లెక్కలు చూడాలని అంటుంది. దీంతో నిషిక నీకు ఎందుక ఇవన్నీ...బిజినెస్ చేసుకునే వాళ్లకు చాలా లెక్కలు ఉంటాయని దబాయిస్తుంది. లోపలికి వెళ్లి నీ పని చూసుకో అంటుంది. ఒక్కసారి చెబితే చాలదా పోవే ఇక్కడ నుంచి అంటుంది..
ఇంతలో లోపల నుంచి కౌషికి బయటకు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇంద్రాణికి ఈ ఇంటి గేటు తాకే అర్హత కూడా లేదని...అయినా పదేపదే ఎందుకు తనని లోపలికి రానిస్తున్నావని మండిపడుతుంది. సారీ వదిన తప్పు అయ్యింది...ఇప్పుడే పంపించివేస్తానంటుంది. ఇంద్రాణీ మనం బయటకు వెళ్లి మాట్లాడుకుందామంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె బయటకు వెళ్లకపోగా....అక్కడే కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చుంటుంది. నేను చెప్పేది వింటే మీ అందిరికీ తల తిరుగుతుంది అంటుంది. మెడపట్టి బయటకు గెంటకు ముందే వెళ్లిపోవాలని అందరూ ఆమెను అంటారు. నేను ఇక్కడకి రావడానికి నిషికనే కారణమని అంటుంది. మనం బయటకు వెళ్లి మాట్లాడుకుందామని నిషిక అన్నా కూడా ఇంద్రాణి వినదు..నిజం అందరికీ తెలియాలి కదా అంటుంది. నిజం తెలియకపోతే అందరూ నేను కావాలనే ఈ ఇంటికి మళ్లీ మళ్లీ వస్తున్నాని అనుకుంటున్నారు అని అంటుంది. ఇంతలోసుధాకర్ అక్కడికి వచ్చి మా కోడలితో నీకు పనేంటి అని అనగా...డబ్బులు తీసుకుంటే రారా అని ఇంద్రాణి నిలదీస్తుంది. మీ కోడలు నా దగ్గర పాతిక లక్షల అప్పు తీసుకుందని చెబుతుంది. ఈ మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.
నువ్వు చెప్పే కట్టుకథలు నమ్మమని ఇంట్లో అందరూ అనగా...నిషిక మీ అందరినీ పిచ్చివాళ్లను చేసి ఆడిస్తోందని అంటుంది. శ్రీకోసం నిషిక తెచ్చిన నెక్లెస్ ఎక్కడిది అనుకుంటున్నారని ఇంద్రాణి నిలదీస్తుంది. అది నా దగ్గర తీసుకున్న డబ్బులతో కొన్నదేనని అంటుంది. ఇంద్రాణి చెబుతోంది నిజమేనా అని సుధాకర్ నిషికను గట్టిగా నిలదీస్తాడు. నువ్వు నిజంగానే ఇంద్రాణి వద్ద అప్పు చేశావా అంటాడు. దీంతో తప్పక అప్పు చేశానని నిషిక ఒప్పుకుంటుంది.దీంతో ఇంద్రాణి మరింత రెచ్చిపోతుంది. నా డబ్బులు నాకు వచ్చే వరకు ఈ ఇంటికి వస్తూనే ఉంటానని కౌషికితో అంటుంది. దీంతో కౌషికి కోపంతో లోపలికి వెళ్లిపోతుంది. జగధాత్రి కలుగజేసుకుని నిషికపై మండిపడుతుంది. నీ వల్ల వదిన ఇలాంటి ఆవిడ ముందు తల దించుకోవాల్సి వచ్చిందంటుంది. నువ్వే అడ్డుపడకపోయి ఉంటే...ఇంద్రాణి వదిన కంట పడుకుండా వెళ్లిపోయి ఉండేదని నిషిక అనగా.....సుధాకర్ గట్టిగా మందలిస్తాడు.తప్పు నువ్వు చేసి పైగా జగధాత్రిపై అరుస్తున్నావేంటని మండిపడతాడు. ఇంతలో లోపల నుంచి చెక్‌బుక్‌తో వచ్చిన కౌషికి...నీకు నిషిక ఇవ్వాల్సింది పాతిక లక్షలేగా అనగా...లేదు వారానికి ఐదులక్షల వడ్డీ కలిపి 35 లక్షలు ఇవ్వాలని చెబుతుంది. అంతే మొత్తం డబ్బులకు కౌషికి చెక్ రాసి ఇవ్వడంతో ఈ రోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.





















