Chinni Serial Today December 23rd:చిన్ని సీరియల్: రేపే శ్రేయ, మ్యాడీల నిశ్చితార్థం! దేవాని ప్రశ్నించనున్న మధు! చందు సస్పెండ్!
Chinni Serial Today Episode December 23rd రేపే మ్యాడీ, శ్రేయలకు నిశ్చితార్థం అని దేవా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు ఎలా అయినా తన తల్లి తప్పు చేయలేదు అని నిరూపిస్తానని అంటుంది. ఇక దేవేంద్రవర్మ రేపే నిశ్చితార్థం అని చెప్తాడు. సడెన్‌గా నిశ్చితార్థం అంటే ఎలా డాడీ ప్రిపేర్ అవ్వాలి కదా అంటే ఎందుకు మళ్లీ అమెరికా వెళ్లిపోవడానికా అని అడుగుతాడు. మీ అమ్మని చంపింది చిన్ని వాళ్ల అమ్మే అని తెలిసినా కూడా నువ్వు తనని మర్చిపోలేను అని నా సహనాన్ని చంపేస్తూనే ఉన్నావ్.. నీకు శ్రేయకి పెళ్లి అని తెలిసి కూడా అమెరికా వెళ్లిపోవాలని అనుకున్నావ్ దాంతో పూర్తిగా నా సహనం పోయింది.. ఇప్పటి వరకు అంతా నీ ఇష్టప్రకారమే జరిగింది.. పెళ్లి ఒక్కటే నాకు నచ్చినట్లు జరగాలి.. నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పినా నేను నా చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని అంటాడు.
మహి ఇప్పుడే నిశ్చితార్థం అంటే ఏంటి మళ్లీ చిన్నిని ప్రేమిస్తున్నావా.. చిన్నిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అని అడిగితే నా తల్లిని చంపిన ఆ హంతకురాలి కూతుర్ని ఎప్పటికీ ఈ ఇ ఇంటికి కోడలిగా తీసుకురాను అని అంటాడు. అయితే రేపు నిశ్చితార్థానికి ఓకే చెప్పు అంటాడు. మహి భోజనం చేయకుండా చేయి కడిగేసుకుంటాడు. ఇలా సడెన్‌గా చేయి కడిగేస్తే ఏం అనుకోవాలి అని లోహిత అంటే ఏం అనుకోవాలో మమ్మీడాడీకి తెలుసు అని మ్యాడీ అంటాడు.
మ్యాడీ మళ్లీ అమెరికా వెళ్లిపోవాలి అనుకుంటాడో ఏమో అని స్వప్న మధుతో చెప్తుంది. మ్యాడీ ఇప్పట్లో అమెరికా వెళ్లడు.. నేను మ్యాడీ మనసు మార్చేశా కానీ అది సమస్య కాదు.. అమ్మ తప్పు చేయలేదు అని నిరూపించాలని చెప్పి రేపు ఉదయం ఓ ప్లేస్‌కి వెళ్లాలని చెప్తుంది. మ్యాడీ బాధ పడుతుంటే వరుణ్ వెళ్తాడు. నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి బావ.. ఏ చిన్ని కోసం ఇండియా వచ్చానో,, ఏ చిన్నిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నానో తను ఓ హంతకురాలి కూతురు.. శ్రేయ ఇలా ఇరికించింది.. డాడీ వాళ్లు కూడా రేపే నిశ్చితార్థం అంటున్నారు అని అంటాడు.
మ్యాడీ విషయం మధుకి చెప్పాలి అనుకుంటాడు. దూరం నుంచి వింటున్న శ్రేయ లోహితతో ఆ మధు నిశ్చితార్ధానికి వస్తే ఆపాలని చూస్తుంది అని అంటుంది. మధు రాకుండా నేను చేస్తా అని లోహిత మ్యాడీ వాళ్ల దగ్గరకు వెళ్లి చిన్ని గురించి మాట్లాడుకుంటున్నారా.. అంటుంది. చిన్ని గురించి ఏం ఉంటుంది అని మ్యాడీ అంటే మళ్లీ అంకుల్ చెప్పినట్లు మళ్లీ నీకు చిన్ని మీద ప్రేమ మొదలైందేమో అని అంటుంది. మ్యాడీ కోపంతో ఫోన్ గట్టిగా పట్టుకుంటాడు. చిన్ని మీద ప్రేమతో రేపటి నుంచి వెతుకుతావేమో.. చిన్ని వాళ్ల అమ్మని క్షమిస్తావేమో అని మ్యాడీని రెచ్చగొడుతుంది. దాంతో మ్యాడీ ఫోన్ పగలగొట్టేసి అది ఎప్పటికీ జరగదు అని వెళ్లిపోతాడు. ఫోన్ పగిలిపోయింది కాబట్టి ఇక మధుకి ఫోన్ చేయడు అని లోహిత అనుకుంటుంది.
దేవా పార్వతి ఫొటో దగ్గర నిల్చొని అసలు నువ్వు మనిషివేనా చచ్చినదానికి చచ్చినట్లు ఉండకుండా క్షణక్షణం నన్ను చంపుతున్నావేంటే.. ఆ రోజు నా మాట విని ఆస్తి మొత్తం నా పేరున రాసుంటే ఈ రోజు నువ్వు బతికుండేదానివే కదా.. నిన్ను చంపి నింద కావేరి మీద వేశా.. దాన్ని చంపాలి అనుకుంటే అది నన్ను వదల్లేదు.. ఆ తర్వాత దాని కూతురు తప్పిపోయింది. ఇప్పుడు మ్యాడీ చిన్నిని ప్రేమించాడు. బలవంతంగా శ్రేయతో వాడి పెళ్లి చేస్తా.. వీలైనంత త్వరగా చిన్నిని వెతికి నేనే నిన్ను చంపాను అన్న నిజం సమాధి చేసేయాలి.. అప్పటి వరకు నాకు మనస్శాంతి ఉండదు అని అనుకుంటాడు.
మధు, స్వప్నని తీసుకొని ఆఫ్ టికెట్ దగ్గరకు వెళ్తుంది. స్వప్నకి అన్ని విషయాలు తెలుసు అనిఅంటుంది. కేసు వివరాలు తెలిస్తే అమ్మని నిర్దోషిగా చూపించగలం అని అంటుంది. మధు చేసిన ప్రయత్నాలు అన్నీ చెప్పి ఇక నాన్న, దేవా అంకుల్ మాత్రమే ఉన్నారు. ఈ కేసు గురించి వాళ్లిద్దరికీ మాత్రమే తెలుసు. దేవేంద్ర అంకుల్‌కి విషయాలు అడుగుదామని అంటుంది. ఆఫ్ టికెట్ దేవాకి చిన్ని అడిగితే తనే చిన్ని అని తెలిసిపోతుందని కంగారు పడతాడు. దేవాకి ఏం అడగొద్దు అని అంటాడు. తన భార్య ప్రస్తావన వస్తే ఆయన అస్సలు ఊరుకోడు అని పైగా నువ్వే చిన్ని అని తెలిస్తే మ్యాడీ నీకు దూరం అయిపోతాడు అని ఆఫ్ టికెట్ అంటాడు. మీ నాన్న వచ్చే వరకు ఎవరికి ఏం అడగొద్దు అని అంటాడు. మధు మాత్రం మాట్లాడుదామనే అనుకుంటుంది. దేవా ఇంటికి బయల్దేరుతుంది.
ఇంతలో నాగవల్లి మధుకి కాల్ చేస్తుంది. నువ్వు ఎక్కడున్నా వెంటనే ఇంటికి వచ్చేయండి అని అంటుంది. మధు సరే అంటుంది. ఇక చందు ఇంటికి బాధగా వస్తాడు. ఏమైందని సరళ అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















