Illu Illalu Pillalu Serial Today December 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఇంగ్లీష్ అదరగొట్టేసిన వల్లీ.. టెస్ట్‌బుక్‌తో తిప్పలు! అమూల్య, విశ్వలను చూసేసిన ధీరజ్!
Illu Illalu Pillalu Serial Today Episode December 23rd వల్లీకి ఇంగ్లీష్ టీచర్ జాబ్ రావడం, అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం ధీరజ్ చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ, నర్మదలు వల్లీని ఇంటర్వ్యూకి తీసుకెళ్తారు. ఇద్దరూ దగ్గరుండి ఐసీయూలోకి పంపిస్తున్నట్లుందని అనుకొని లోపలికి వెళ్తుంది. వల్లీ లోపలికి వెళ్తే ప్రిన్సిపల్ టేక్ యువర్ సీట్ అంటారు. అంటే ఏంటో అర్థం కాకపోవడంతో వల్లీ బిత్తర చూపులు చూస్తుంది. ప్రిన్సిపల్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటే వల్లీ చాలా కంగారు పడుతుంది.
సర్టిఫికేట్లు వల్ల దొరికిపోతానేమో అని చాలా టెన్షన్ పడుతుంది. ప్రిన్సిపల్ ఇంటర్వ్యూ చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే వల్లీ ఏం చెప్పలేదు.. బయట నుంచి నర్మద, ప్రేమ నవ్వుకుంటారు. వల్లీ ఆన్సర్స్ చెప్పకుండా చెమటలు పట్టేస్తుంది. దాంతో ఆయన ఇంగ్లీష్‌లోనే నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేయలేదు.. ఇవి ఫేక్ సర్టిఫికేట్స్ కదా అని అంటారు. తర్వాత నర్మద, ప్రేమల్ని పిలుస్తారు. ఇద్దరితో తను అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడింది.. సూపర్ అని జాబ్ ఇస్తారు. నర్మద, ప్రేమ ఇద్దరూ బిత్తరపోతారు. తీరా చూస్తే భాగ్యం, ఇడ్లీబాబాయ్ ఓ ఇంగ్లీష్ టీచర్‌ని పెట్టి బ్లూటూత్‌తో మాట్లాడించి వల్లీతో ఇంగ్లీష్ చెప్పిస్తారు.
ప్రిన్సిపల్ ప్రేమ వాళ్లతో తన రూపంలో రామరాజు గారు మంచి టీచర్‌ని మాకు ఇచ్చారు అని చెప్పి ఈ రోజు నుంచే క్లాస్ చెప్పమని అంటారు. నర్మద, ప్రేమలు అక్కడే ఉన్న మరో టీచర్‌ని చూస్తారు. భాగ్యం, ఆయనతో మాట్లాడటం చూసి ఇదా సంగతి అని అనుకుంటారు. వల్లీ దగ్గరకు వెళ్తే నాకు జాబ్ ఇచ్చిందని షాకింగ్‌గా ఉంద అని వల్లీ లేదు.. భవిష్యత్‌లో నీ పరిస్థితి తలచుకుంటే బాధగా ఉంది..మీ అమ్మానాన్నలతో ఇంగ్లీష్ టీచర్‌ని తీసుకొచ్చి జాబ్ కొట్టేశావ్.. నీ ఇంగ్లీష్ గురించి తెలిసిపోయింటే ఒక్కరోజు గొడవ పోయిండేది.. కానీ ఇప్పుడు రోజూ పిల్లలకు పాఠాలు చెప్పలేక నరకం చూస్తావ్. ఎంజాయ్‌దా టెన్షన్.. ఎంజాయ్ ది నరకం అని చెప్తారు. వల్లీ మొదటి క్లాస్ తీసుకోవడానికి వెళ్తుంది.
తిరుపతి తన స్వప్న సుందరిని ఊహించుకొని నడిరోడ్డు మీద డ్యాన్సులు చేస్తుంటాడు. ఇంతలో ధీరజ్ అక్కడికి వస్తాడు. ధీరజ్‌ని పట్టుకొని డ్యాన్సులు చేస్తాడు. నా స్వప్న సుందరి ఎక్కడా అని కంగారు పడిపోతాడు. ధీరజ్ ఆయనతో నిన్ను చూస్తే బొక్కాబొర్లా పడేలా ఉన్నావ్ జాగ్రత్త అని అంటాడు. ధీరజ్ ఇంటికి వెళ్తా అంటూ బైక్ ఎక్కి ఎదురుగా అమూల్య నడుచుకుంటూ రావడం చూస్తాడు. ఈ టైంలో కాలేజ్‌ల్ ఉండాలి కదా.. ఇంత టెన్షన్‌గా ఎక్కడికి వెళ్తుంది అని ఫాలో అవుతాడు.
అమూల్య కాస్త దూరంలో ఉన్న విశ్వని కలవడానికి వెళ్తుంది. అమూల్య, విశ్వ చనువుగా మాట్లాడుకోవడం చూసి ధీరజ్ బిత్తరపోతారు. అమూల్య వాడితో మాట్లాడటం ఏంటి.. ఆ చెత్తనా కొడుకే అమూల్యని మాయమాటలతో ట్రాప్ చేసుంటాడు. వాడిని వదలను అనుకుంటూ దగ్గరకు వెళ్తాడు. ధీరజ్ వెళ్లే సరికి అమూల్య, విశ్వ ఇద్దరూ బైక్ మీద వెళ్లిపోతారు. విశ్వ అద్దంలో ధీరజ్‌ని చూస్తాడు. ఇప్పుడు మిస్ అయినా నిన్ను వదిలిపెట్టనురా అని ధీరజ్ అనుకుంటాడు.
వల్లీ మొదటి రోజు క్లాస్‌కి వెళ్తుంది. క్లాస్‌కి వెళ్లి టెస్ట్ బుక్ చూసి ఏబీసీడీలు అయితే మ్యానేజ్ చేయొచ్చు.. పాముల్లా ఇంత పొడవు ఉన్న అక్షరాలు నేను ఎలా చెప్పగలను అని చెమటలు పట్టేస్తుంది. త్వరగా చెప్పండి అని పిల్లలు కంగారు పెడతారు. ఇంగ్లీష్‌లో మాట్లాడమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















