Nindu Noorella Saavasam Serial Today December 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమ్ము మీద అటాక్ చేసిన గరుడ – అయోమయంలో భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode December 23rd: చంభా మంత్రం వేసి అమ్ము మీదకు గరుడను పంపించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: హాల్లో పాపతో అడుకుంటున్న పిల్లలను చదువుకోమని రూంలోకి పంపిస్తుంది మనోహరి. అమ్ము స్టేషనరి షాపు కు వెళ్లేలా చేసి చంభాను తోడుగా వెళ్లమని చెప్తుంది. పనిలో పనిగా అక్కడే అమ్మును భయపెట్టమని చెప్తుంది మనోహరి. పిల్లలు రూంలోకి వెళ్లిపోతారు. అమ్ము బయటకు వెళ్లగానే.. మనోహరి పాపను ఎత్తుకుని గుర్రుగా చూస్తుంది.
మను: అరుంధతి..
పాప: మనోహరి..
అని పిలవగానే మను షాక్ అవుతుంది. పాపను ఎత్తుకుని ఆరు ఫోటో దగ్గరకు వెళ్తుంది మనోహరి.
మను: ఒసేయ్ అరుందతి నువ్వు మళ్లీ పుట్టావా..? ఈ బిడ్డలో ప్రవేశించావా..? ఒకసారి నా చేతిలో చచ్చావు కదే మళ్లీ మళ్లీ నా చేతిలో ఎందుకు చావాలి అనుకుంటున్నావు.. నాకు అడ్డు వచ్చావని నిన్ను చంపేశాను. నీ తర్వాత నీ చెల్లెలు భాగీ నాకు పోటీగా వచ్చింది. దాన్ని అడ్డు తొలగించుకుందామనుకుంటే.. ఇప్పటి వరకు కుదరలేదు. ఈ బిడ్డ రూపంలో నువ్వు మళ్లీ ఈ లోకంలోకి రాక ముందే..భాగీని తన కడుపులో ఉన్న నిన్ను అంతం చేద్దామనుకున్నాను అయినా తప్పించుకున్నావు.. ఇప్పుడు ఈ బిడ్డగా అందరితో సంతోషంగా ఉండాలనుకున్నావు.. కదూ.. నిన్ను భాగీని ఈ ఇంటి నుంచి దూరం చేసే పథకం మొదలు పెట్టాను. నేను ఆడే ఈ ఆటను నువ్వు ఎలా ఆపుతావో నేను చూస్తాను.
అంటూ కోపంగా పాపను తీసుకుని భాగీ దగ్గరకు వెళ్తుంది. రూంలో ఆలోచిస్తూ కూర్చున్న భాగీని డోర్ దగ్గర నుంచి చూస్తుంది మనోహరి.
మను: ( మనసులో దీనికి పంతులు గారితో నేను పట్టించిన భయం బాగా వర్కవుట్ అయినట్టు ఉంది. ఇప్పుడు కాస్త డోస్ పెంచితే దీనిలో ఏ మూలలో ఉన్న కాస్త ధైర్యాన్ని కూడా చంపేయోచ్చు) భాగీ బిడ్డను ఒంటరిగా వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు
భాగీ: పాప దగ్గర పిల్లలు ఉన్నారు కదా.?
మను: ఎవ్వరూ.. లేరు అంజు, ఆకాష్, ఆనంద్ రూంలో హోం వర్క్ చేసుకుంటున్నారు.. అమ్ము కు ఏదో స్టేషనరీ కావాలని బయటకు వెళ్లింది.
భాగీ: ఈ టైంలో బయటకు వెళ్లిందా..? అది ఒంటరిగా వెళ్లిందా..?
మను: ఎందుకు భాగీ అంత కంగారు పడతావు
భాగీ: కంగారు పడక ఏం చేయమంటావు. ఇంత రాత్రి పూట అమ్మును ఎందుకు ఒంటరిగా పంపించావు.. వద్దని చెప్పలేకపోయావా..? నాతో కూడా ఎందుకు చెప్పలేదు
మను: భాగీ అమ్ము ఒంటరిగా ఏం వెళ్లలేదు. యాదమ్మ కూడా తోడుగా వెళ్లింది.
భాగీ: అమ్ముకు తోడుగా యాదమ్మ వెళ్లిందా
మను: అదే కదా చెప్పాను.. అమ్ము ఏమైనా చిన్న పిల్లా తనకేం అవుతుంది చెప్పు
భాగీ పంతులు చెప్పింది గుర్తు చేసుకుంటుంది.
మను: సరే భాగీ పాప ఇందాక ఏడ్చింది.. పాలు కావాలేమో చూడు
అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అమ్ము నాతో చెప్పకుండా ఎందుక వెళ్లిందబ్బా అని భాగీ అనుకుంటుంది. బయటకు వెళ్లిన అమ్మును భయపెట్టమని చంబా మంత్రం వేసి ఒక కుక్కను పంపిస్తుంది. ఆ కుక్క అమ్మును బయపెడుతుంటే అప్పుడే అమర్ వచ్చి అమ్మును సేవ్ చేస్తాడు. తర్వాత గార్డెన్‌లో ఆడుకుంటున్న అమ్మును గాయపర్చమని గరుడను పంపిస్తుంది చంభా. గరుడ వెళ్లి అమ్మును గాయపరుస్తుంది. అది చూసిన భాగీ భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















