Brahmamudi Serial Today December 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: సూపర్ యాడ్ చేసిన రాజ్ - నిజం తెలుసుకున్న ధాన్యం
Brahmamudi serial today episode December 23rd: అప్పు తనకు తెలియకుండా డ్యూటీ చేస్తుందని నిజం తెలుసుకుంటుంది ధాన్యలక్ష్మీ దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఓ కేసు విషయంలో అప్పు ఒక కాలనీలో పోలీసులతో మాట్లాడుతూ ఉండగా లలిత అనే మహిళను రౌడీలు తరుముకుంటూ వస్తుంటారు. లలిత పరుగెత్తుకుంటూ అప్పు వాళ్లు కనిపించగానే కాపాడండి మేడం అంటూ దగ్గరకు వెళ్లుంది. పోలీసులను చూసిన రౌడీలు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు.
అప్పు: ఏమైందమ్మా.. ఎందుకు అలా పరుగెడుతున్నారు..?
లలిత: రౌడీలు నన్ను తరుముతున్నారు మేడం..
అప్పు: ఎందుకు..?
లలిత: నా మెడలో చైన్ కొట్టేయడానికి ప్రయత్నించారు మేడం. నేను తప్పించుకుని పరుగెత్తుకుంటూ ఇక్కడకు వచ్చాను
అప్పు: ఎక్కడ ఉంటారు మీరు
లలిత: పక్కనే ఉన్న సుభాష్ నగర్‌లో ఉంటాను మేడం
అప్పు: అయితే వాళ్లు ఇంకేం రారు మీరు వెళ్లండి
లలిత భయపడుతుంది.
అప్పు: సరే మేము నిన్ను డ్రాప్ చేసి వెళ్తాం పద
అంటూ తన కారులో లలితను ఇంటి దగ్గర దింపేస్తుంది అప్పు.
లలిత: మేడం.. ఇంత దూరం వచ్చారు మా ఇంట్లోకి వచ్చి ఓ కాపీ తాగి వెళ్లండి మేడం
అప్పు: అయ్యో టైం లేదండి.. వెళ్లాలి..
లలిత: ఫ్లీజ్ మేడం.. మీరు లేకపోతే వాళ్లు నా మెడలో ఉన్న బంగారం లాక్కెళ్లేవారు. మీకు ఉట్టి థాంక్స్ చెప్తే సరిపోదు మేడం రండి ప్లీజ్
అప్పు: సరే పదండి
అనగానే ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు.
అప్పు: మీకు మీ ఇంటికి అసలు సంబంధమే లేదండి..
లలిత: నేను చాలా సింపుల్ గా ఉంటాను మేడం.. ఈ ఇల్లు రీసెంట్ గానే కొన్నాం.. మేడం నేను మీకు కాఫీ తీసుకొస్తాను.
అంటూ లలిత కిచెన్ లోకి వెళ్తుంది. ఇంట్లో గోడలకు ఉన్న అశోక్ ఫోటో చూసి అప్పు షాక్ అవుతుంది. లలితను అతనెవరు అని అడుగుతుంది. తన రెండో భర్త అని తనను తన పాపను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్తుంది. వెంటనే అప్పు అక్కడి నుంచి వెళ్లి అశోక్‌ను స్టేషన్‌కు తీసుకురమ్మని కానిస్టేబుల్‌ను పంపిస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ రాజ్ చేసిన యాడ్ చూసి సైలెంట్‌గా ఉంటారు.
రాజ్: ఏమైంది అందరూ అలా ఉన్నారు..?
కావ్య: యాడ్ బాగాలేదా..?
అందరూ ఒకేసారి సూపర్ అంటూ గట్టిగా అరుస్తారు.
ఇందిరాదేవి: సూపర్ గా ఉందిరా మనవడా..
అపర్ణ: నాన్న యాడ్ సూపర్ గా ఉంది
సుభాష్: ఒరేయ్ రాజ్ నీ యాడ్ అద్బుతంగా ఉందిరా..?
ధాన్యలక్ష్మీ: ఇంటి నిండా నగలు ఉన్నాయి కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. లేదంటే ఈ డిజైన్స్ అన్ని నేనే కొనేసేదాన్ని రాజ్. అంత అద్బుతంగా ఉంది ఈ యాడ్
ప్రకాష్: రాజ్ ఈ యాడ్‌కు మన బిజినెస్‌కు తిరుగే లేదురా..?
కళ్యాణ్: అన్నయ్య యాడ్ చాలా బాగుంది. అసలు ఎంతో ఎక్స్‌ఫీరియెన్స్ ఉన్న డైరెక్టర్ లా చేసేశావు అనుకో
సుభాష్: ఈ యాడ్ మన గోల్డ్ మార్కెట్ నే షేక్ చేస్తుందిరా
అంటూ అందరూ హ్యాపీగా ఉంటే.. రాహుల్, రుద్రాణి మాత్రం మనసులో బాధపడుతుంటారు. మరోవైపు అశోక్‌ను ఇంటరాగేషన్ చేసిన అప్పు నిజం తెలుసుకుని అంజలిని రేణుకకు అప్పగిస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి అశోక్ మాఫియాను బయటపెడుతుంది. అప్పు ప్రెస్ మీట్ టీవీలో చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ధాన్యలక్ష్మీ కోపంగా కళ్యాణ్‌ను తిడుతుంది. దీంతో రాజ్, కావ్య అడ్డు వెళితే వాళ్లను తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















